Ram Charan Surgery: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసే వార్త బయటకు వచ్చింది. బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi) షూటింగ్ సమయంలో చరణ్ కుడిచేతి మణికట్టుకు తీవ్ర గాయమైంది. ఈ దెబ్బ కారణంగా విపరీతమైన నొప్పితో బాధపడుతున్న ఆయనకు తమిళనాడులోని కోయంబత్తూర్ గంగా హాస్పిటల్‌లో అత్యవసరంగా హ్యాండ్ సర్జరీ నిర్వహించారు.

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా ఫ్యాన్స్ తమ అభిమాన హీరో ఆరోగ్యం గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విదేశీ వైద్యుల ఆధ్వర్యంలో క్లిష్టమైన సర్జరీ!
కోయంబత్తూర్‌లోని ప్రముఖ ఆర్తోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్ నేతృత్వంలో రామ్ చరణ్ కు ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అమెరికాలోని మియామి నుంచి వచ్చిన స్పెషలిస్ట్ డాక్టర్ అలెజాండ్రో బడియా కూడా ఈ సర్జరీ టీమ్‌లో భాగమయ్యారు.
ఆపరేషన్ సమయంలో రామ్ చరణ్ వెంట ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి, తల్లి సురేఖ, భార్య ఉపాసన కామినేని ఉన్నారు. సర్జరీ తర్వాత రామ్ చరణ్ వేగంగా కోలుకుంటున్నారని, వైద్యుల టీమ్ ఆయన హెల్త్ కండిషన్‌పై పూర్తి సంతృప్తిగా ఉన్నారని మెగా కాంపౌండ్ వర్గాలు వెల్లడించాయి.
కన్నీళ్లతో ఉపాసన పూజలు.. పవన్ కళ్యాణ్ కనెక్టివిటీ
తన భర్త రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఉపాసన కామినేని సోమవారం (జులై 27) ఉదయం వినాయకుడు, హనుమంతుడి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమె చాలా ఎమోషనల్ అయ్యారు.
ఇటీవలే రామ్ చరణ్ బాబాయ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో భుజం గాయం (రోటేటర్ కఫ్) సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. సినిమాల్లో నటించేటప్పుడు అయిన గాయాలు రాజకీయ ప్రచారాల్లో బిజీ అవ్వడం వల్ల ఎక్కువకావడంతో పవన్ ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు చరణ్ కూడా సర్జరీకి వెళ్లడంతో ఫ్యాన్స్ కొంచెం కలవరపడుతున్నారు.
'పెద్ది' సెట్స్‌లో ఏం జరిగింది? రియల్ పహిల్వాన్లతో ఫైట్!
{{/usCountry}}ఇటీవలే రామ్ చరణ్ బాబాయ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో భుజం గాయం (రోటేటర్ కఫ్) సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. సినిమాల్లో నటించేటప్పుడు అయిన గాయాలు రాజకీయ ప్రచారాల్లో బిజీ అవ్వడం వల్ల ఎక్కువకావడంతో పవన్ ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు చరణ్ కూడా సర్జరీకి వెళ్లడంతో ఫ్యాన్స్ కొంచెం కలవరపడుతున్నారు.
'పెద్ది' సెట్స్‌లో ఏం జరిగింది? రియల్ పహిల్వాన్లతో ఫైట్!
{{/usCountry}}'పెద్ది' సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ రెండుసార్లు గాయపడ్డారు. మార్చి నెలలోనే ముఖానికి గాయం అవ్వగా, కంటికి చిన్న ప్రొసీజర్ కూడా జరిగింది. ఆ తర్వాత క్లైమాక్స్ కుస్తీ (రెజ్లింగ్) సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు నిజమైన రియల్ పహిల్వాన్లతో ఫైట్ చేయడం వల్ల చరణ్ మణికట్టులోని కార్టిలేజ్ (మృదులాస్థి) దెబ్బతింది.
ఈ హ్యాండ్ బ్రేస్ గురించి ట్రైలర్ లాంచ్ టైమ్‌లోనే చరణ్ ఓపెన్‌గా మాట్లాడారు. "డైరెక్టర్ బుచ్చిబాబు నాకిచ్చిన చిన్న గిఫ్ట్ ఇది" అని సరదాగా కామెంట్ చేశారు. జూన్ 4న రిలీజైన 'పెద్ది' సినిమా మిక్స్డ్ టాక్‌తో మొదలై ప్రపంచవ్యాప్తంగా రూ. 340 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ సాధించింది.
రిహాబిలిటేషన్ తర్వాతే ‘RC17’
'ఆర్ఆర్ఆర్', 'గేమ్ చేంజర్' సినిమాలతో ఇంటర్నేషనల్ రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్.. 'పెద్ది' విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, కన్నడ హ్యాట్రిక్ హీరో శివ రాజ్‌కుమార్, దివ్యేందు, జగపతి బాబు కీలక పాత్రల్లో అలరించారు.
హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత రామ్ చరణ్ కొన్ని వారాల పాటు ఫిజియోథెరపీ, రిహాబిలిటేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకుంటారు. ఆ తర్వాతే ఆయన సుకుమార్ డైరెక్షన్‌లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ (RC17) షూటింగ్‌లో పాల్గొననున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకుని సెట్స్‌లోకి అడుగుపెట్టాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.