మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు జనవరి 31న కవల పిల్లలను (ఒక అబ్బాయి, ఒక అమ్మాయి) తమ జీవితంలోకి ఆహ్వానించిన విషయం తెలుసు కదా. ఆ రాత్రి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా వేదికగా ఈ శుభవార్తను పంచుకోవడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తమ అభిమాన హీరో తండ్రి అయిన ఆనందంలో ఫిబ్రవరి 1న అపోలో ఆసుపత్రి వద్దకు భారీ సంఖ్యలో మెగా ఫ్యాన్స్ తరలివచ్చారు.
ఫ్యాన్స్‌కు అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్

శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన అభిమానులను మెగా కుటుంబం నిరాశపరచలేదు. వారి ఆనందాన్ని పంచుకుంటూ ప్రత్యేకమైన గిఫ్ట్ హ్యాంపర్లను పంపిణీ చేశారు. దీనికి సంబంధించిన అన్‌బాక్సింగ్ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. "రామ్ చరణ్, ఉపాసనలకు శుభాకాంక్షలు.. అపోలో నుంచి ఈ గిఫ్ట్ అందుకున్నాం" అంటూ ఓ అభిమాని వీడియో పోస్ట్ చేశారు.
ఆ బాక్స్‌లో ఏముంది?
ఎరుపు రంగు బాక్స్‌పై రామ్ చరణ్, ఉపాసనల ఫొటోలు ముద్రించి ఉన్నాయి. బాక్స్ లోపల రెండు వెండి గిన్నెలు, వాటికి సరిపోయే స్పూన్లు, ఒక ప్లేట్ ఉన్నాయి. ఆ ప్లేట్‌పై పిల్లలు పుట్టిన తేదీ '31-01-2026' అని రాసి ఉంది. వీటితో పాటు నోరూరించే స్వీట్లు కూడా ఉన్నాయి.
అసలు ఇది వెండి వస్తువులేనా? ధర ఎంత?
గిఫ్ట్ బాక్స్ చూడగానే ఇది వెండిదా లేక వెండి పూత పూసినదా అని నెటిజన్ల మధ్య చర్చ మొదలైంది. అయితే నిశితంగా పరిశీలిస్తే.. ఇవి 'అష్టోక్' (Ashtok) బ్రాండ్‌కు చెందినవని తెలుస్తోంది. వెబ్‌సైట్ సమాచారం ప్రకారం ఇవి స్వచ్ఛమైన వెండి కాదు. 'జర్మన్ సిల్వర్' వస్తువులు. ఒక్కో సెట్ ధర సుమారు రూ. 399 కాగా, ఎక్కువ మొత్తంలో కొంటే రూ. 276కు లభిస్తుంది. స్వీట్ల ఖర్చు అదనం. అయినప్పటికీ తమ హీరో నుంచి వచ్చిన కానుక కావడంతో అభిమానులు దీనిని ఆనందంగా స్వీకరిస్తున్నారు.
ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత.. పసిపాపతో చరణ్
ఫిబ్రవరి 1న తన రెండేళ్ల కుమార్తె క్లిన్ కారాతో కలిసి రామ్ చరణ్ ఆసుపత్రికి వచ్చాడు. ఈ సందర్భంగా అభిమానులు ఒక్కసారిగా అతని చుట్టూ గుమిగూడారు. చరణ్ చేతిలో చిన్నారి ఉన్నప్పటికీ సెల్ఫీల కోసం ఎగబడటంతో కాస్త ఇబ్బందికర వాతావరణం నెలకొంది.
{{/usCountry}}ఫిబ్రవరి 1న తన రెండేళ్ల కుమార్తె క్లిన్ కారాతో కలిసి రామ్ చరణ్ ఆసుపత్రికి వచ్చాడు. ఈ సందర్భంగా అభిమానులు ఒక్కసారిగా అతని చుట్టూ గుమిగూడారు. చరణ్ చేతిలో చిన్నారి ఉన్నప్పటికీ సెల్ఫీల కోసం ఎగబడటంతో కాస్త ఇబ్బందికర వాతావరణం నెలకొంది.
{{/usCountry}}మరోవైపు ఆసుపత్రి ఆవరణలో అభిమానులు బాణసంచా కాల్చడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆసుపత్రిలోని ఇతర రోగులకు, పసిపిల్లలకు ఇది ఇబ్బంది కలిగిస్తుందని, ఆసుపత్రి జోన్‌లో శబ్ద కాలుష్యం సరికాదని పలువురు అభిప్రాయపడ్డారు.
రామ్ చరణ్ కెరీర్ అప్‌డేట్స్
ఇక సినిమాల విషయానికి వస్తే శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'గేమ్ ఛేంజర్' తర్వాత రామ్ చరణ్ జోరు పెంచాడు. అతడు నటిస్తున్న తాజా మూవీ 'పెద్ది' మార్చిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఆ తర్వాత 'పుష్ప', 'రంగస్థలం' వంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన సుకుమార్ దర్శకత్వంలో మరో భారీ చిత్రంలో నటించనున్నాడు.