Sreeja Konidela: చిరంజీవి కూతురు శ్రీజ సోమవారం (జూన్ 8) తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. అందులో తన గతం గురించి ఓపెన్ గా మాట్లాడారు. తాను అనుభవించిన కష్టాలు, వాటి ద్వారానే తనకు వచ్చిన గుర్తింపుపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ వీడియోలో ఆమె ఏమన్నదో చూడండి.
బాధితురాలిని కాను

చిరంజీవి కూతురిగా, రామ్ చరణ్ చెల్లెలిగా శ్రీజ కొణిదెల తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. అయితే చాలా వరకు నెగటివ్ వార్తలతోనే ఆమె ముడిపడి ఉంది. దీనిపైనా తాజా వీడియోలో శ్రీజ స్పందించారు.
"నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? నేను ఇంత బాధ ఎందుకు అనుభవించాలి? ఒక కష్టం తర్వాత ఇంకో కష్టం ఎందుకు వస్తోంది? అసలు ఈ కష్టాలు పడటానికి నేను చేసిన తప్పు ఏంటి? అనే ప్రశ్నల్లో నేను చాలా కాలం ఇరుక్కుపోయాను. కానీ ఈ ప్రయాణంలో నేను ఆ బాధితురాలిని అనే భావన నుంచి బయటకు వచ్చాను. లైఫ్ అంటే మనకు ఏదో జరిగిపోవడం కాదు, మన లైఫ్ ని మనమే క్రియేట్ చేసుకునే పవర్ మనకు ఉందని అర్థమైంది" అని శ్రీజ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.
తన జీవితంలో ఎక్కువ భాగం బాధ, గతం, కష్టాలతోనే ముడిపడి ఉందని శ్రీజ ఫీల్ అయ్యారు. "నా లైఫ్ లో జరిగిన తప్పులే నా గుర్తింపును డిసైడ్ చేశాయని అనుకున్నాను. కానీ 'సేక్రెడ్ పాత్స్' (Sacred Paths) వాళ్లు కండక్ట్ చేసిన 'సెల్ఫ్ మాస్టరీ ప్రాజెక్ట్' ద్వారా నా ఆలోచనా విధానం పూర్తిగా మారింది. నా బాధ నాలో ఒక భాగమే కావచ్చు.. కానీ నా జీవితం అంతా అదే కాదు. ఒక మనిషిలో ఇంకా ఎన్నో లేయర్స్ ఉంటాయి. వాటిని తెలుసుకోవడమే నా ఈ జర్నీలో దొరికిన మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్" అని ఆమె వివరించారు.
శ్రీజ గతం ఇలా..
2007లో కేవలం 19 ఏళ్ల వయసులో శ్రీజ తన 22 ఏళ్ల బాయ్‌ఫ్రెండ్ శిరీష్ భరద్వాజ్‌తో ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఫ్యామిలీ నుంచి అభ్యంతరాలు ఉండటంతో.. ఈ కపుల్ మీడియా, పోలీసుల రక్షణ కూడా అడిగారు. అప్పట్లో హైదరాబాద్ ఆర్యసమాజ్ లో జరిగిన వీళ్ల పెళ్లి దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది.
{{/usCountry}}2007లో కేవలం 19 ఏళ్ల వయసులో శ్రీజ తన 22 ఏళ్ల బాయ్‌ఫ్రెండ్ శిరీష్ భరద్వాజ్‌తో ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఫ్యామిలీ నుంచి అభ్యంతరాలు ఉండటంతో.. ఈ కపుల్ మీడియా, పోలీసుల రక్షణ కూడా అడిగారు. అప్పట్లో హైదరాబాద్ ఆర్యసమాజ్ లో జరిగిన వీళ్ల పెళ్లి దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది.
{{/usCountry}}2008 లో వీరికి నివృతి భరద్వాజ్ పుట్టింది. ఆ తర్వాత 2011 లో శిరీష్, అతని ఫ్యామిలీ మెంబర్స్ పై శ్రీజ కట్నం, గృహహింస వేధింపుల కేసు పెట్టారు. పుట్టింటికి తిరిగి వచ్చేసిన శ్రీజకు 2014 లో అఫీషియల్ గా విడాకులు వచ్చాయి. కాగా హెల్త్ ఇష్యూస్ వల్ల శిరీష్ భరద్వాజ్ 2024 లో హైదరాబాద్ లో చనిపోయారు.
ఆ తర్వాత 2016లో శ్రీజ తన చిన్ననాటి ఫ్రెండ్, బిజినెస్‌మెన్ కల్యాణ్ దేవ్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. 2018లో వీరికి నవిష్క పుట్టింది. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల 2022లో ఈ జంట విడిపోయారు. శ్రీజ తన పేరు చివర ఉన్న 'కల్యాణ్' ను సోషల్ మీడియాలో తీసేయడంతో ఫ్యాన్స్ కు ఈ విషయం తెలిసింది. 2023 లో కల్యాణ్ దేవ్ కూడా తాము విడిపోయిన విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. వారంలో కేవలం నాలుగు గంటలు మాత్రమే తన కూతురితో గడిపే ఛాన్స్ తనకు దొరుకుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మెగా ఫ్యామిలీ ఇతర వివరాలు చూస్తే.. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల 2006లో బిజినెస్‌మెన్ ఎల్వీ విష్ణు ప్రసాద్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి సమర, సంహిత అని ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అలాగే రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ల పేర్లు క్లిన్ కారా, అన్వీర దేవి, శివరామ్.
తరచుగా అడిగే ప్రశ్నలు (PAA - People Also Ask)
ప్రశ్న 1: శ్రీజ కొణిదెల తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో ఏ విషయాలు చెప్పారు?
సమాధానం: తన పాస్ట్ లైఫ్ లో జరిగిన స్ట్రగుల్స్, విక్టిమ్ మైండ్‌సెట్ (తాను ఒక బాధితురాలిని అనే ఫీలింగ్) నుంచి 'సెల్ఫ్ మాస్టరీ ప్రాజెక్ట్' అనే 15 నెలల కోర్సు ద్వారా ఎలా బయటపడ్డాననే విషయాలను శ్రీజ షేర్ చేసుకున్నారు.
ప్రశ్న 2: శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ ఎలా చనిపోయారు?
సమాధానం: హెల్త్ ఇష్యూస్ (అనారోగ్య సమస్యల) కారణంగా శిరీష్ భరద్వాజ్ 2024 లో హైదరాబాద్ లో చనిపోయారు.
ప్రశ్న 3: కల్యాణ్ దేవ్ తో శ్రీజకు ఉన్న పిల్లలు ఎవరు?
సమాధానం: శ్రీజ, కల్యాణ్ దేవ్ దంపతులకు 2018 లో 'నవిష్క' అనే కూతురు పుట్టింది.
ప్రశ్న 4: రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఎంతమంది పిల్లలు?
సమాధానం: రామ్ చరణ్, ఉపాసన దంపతులకు క్లిన్ కారా, అన్వీర దేవి, శివరామ్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.