...
...
Next Story

ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య.. సోషల్ మీడియా నిషేధంపై రామ్ గోపాల్ వర్మ సీరియస్ వార్నింగ్!

ఘజియాబాద్‌లో ముగ్గురు సిస్టర్స్ ఆత్మహత్య ఘటన తర్వాత సోషల్ మీడియా నిషేధంపై పెద్ద చర్చ మొదలైంది. అయితే 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలనే ఆలోచనను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా వ్యతిరేకించారు. అలా చేయడం వల్ల పిల్లల భవిష్యత్తు ఎలా ప్రమాదంలో పడుతుందో ఆయన వివరించారు.

Published on: Feb 10, 2026, 12:36:18 IST
Advertisement

ఫిబ్రవరి 4న ఘజియాబాద్‌లో ముగ్గురు మైనర్ సిస్టర్స్ ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇది సోషల్ మీడియా వాడకం, డిజిటల్ వ్యసనంపై చర్చను రేకెత్తించింది. ఇండియాలో మైనర్ల సోషల్ మీడియాను వాడకుండా బ్యాన్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేయాలనే ఆలోచనను రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా వ్యతిరేకించారు.

బ్యాన్ ఎందుకు?

రామ్ గోపాల్ వర్మ
రామ్ గోపాల్ వర్మ

16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ ఎందుకని రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి చర్యల కారణంగా ఇప్పటి ఇన్ఫర్మేషన్ బేస్డ్ ప్రపంచంలో పిల్లలకు ఎక్కువ హాని జరుగుతుందని ఆర్జీవీ అన్నారు. తన సోషల్ మీడియాలో "బ్యాన్ ది బ్యానర్స్’’ అనే హెడింగ్ తో ఓ వివరణాత్మక పోస్టు పెట్టారు ఆర్జీవీ.

అది అవివేకం

"16 ఏళ్లలోపు పిల్లలను కంటెంట్ నుండి రక్షించడానికి సోషల్ మీడియాను బ్యాన్ చేయడం వల్ల సమస్య వస్తుంది. దీంతో నేటి కంపిటేటివ్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పిల్లలు వెనుకబడిపోతారు. సోషల్ మీడియా టైమ్ వేస్ట్ అనుకోవడం అవివేకం. ఎందుకంటే ఈ రోజుల్లో ఇది రియల్ టైమ్ నాలెడ్జ్ , నైపుణ్యాలు, నెట్‌వర్క్‌లను కలిపే పైప్ లైన్’’ అని ఆర్జీవీ పోస్టు చేశారు.

ప్రయోగాలు చేస్తారు

‘‘సోషల్ మీడియా బ్యాన్ లేని దేశాల్లోని పిల్లలు యూట్యూబ్ ట్యుటోరియల్స్, రెడ్డిట్ థ్రెడ్‌లు, టిక్‌టాక్, ప్రపంచ ఫోరమ్‌ల వంటి అత్యాధునిక ప్లాట్ ఫామ్స్ తో నేర్చుకుంటారు. నిషేధం విధించే దేశాల్లోని పిల్లలతో పోలిస్తే సోషల్ మీడియా నిషేధించని దేశాల్లోని 14 ఏళ్ల పిల్లలు ఎక్కువ టాలెంటెడ్ గా ఉన్నారు. స్కిల్స్ పెంచుకుంటున్నారు. ఆన్‌లైన్ కమ్యూనిటీలను ఏర్పరుచుకుంటున్నారు. ఆలోచనలతో ప్రయోగాలు చేస్తున్నారు’’ అని ఆర్జీవీ మరింతగా వివరించారు.

బ్యాన్ చేసినంత మాత్రాన

సోషల్ మీడియా అన్నది ఇన్ఫర్మేషన్ కోసం వాడేలా, మన నైపుణ్యాలను పెంచుకునేలా ఉండాలని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. దీన్ని సక్రమంగా వాడటం మానేసి మొత్తానికే బ్యాన్ చేస్తే పిల్లల భవిష్యత్ పై తీవ్ర ప్రభావం పడుతుందని ఆర్జీవీ తన పోస్టు ద్వారా వార్నింగ్ ఇచ్చారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks