అటు అభిమానులు, ఇటు సెలబ్రిటీలను ఒకే స్థాయిలో ఉర్రూతలూగించి, ఇండియన్ సినిమా దశ, దిశనే మార్చేసిన మూవీగా నిలిచింది శివ. రామ్‌గోపాల్ వర్మ డైరెక్షన్, నాగార్జున యాక్షన్ తో ఈ మూవీ రికార్డులను తిరగరాసింది. ఇప్పుడీ సినిమా నవంబర్ 14న థియేటర్లలో రీరిలీజ్ కానుంది. దానికి ముందు మంగళవారం (నవంబర్ 4) ట్రైలర్ రిలీజ్ చేశారు.
శివ రీరిలీజ్ ట్రైలర్

రామ్‌గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్ లో వచ్చి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన మూవీ శివ. 1990లో రిలీజైన ఈ మూవీని 36 ఏళ్ల తర్వాత ఇప్పుడు రీరిలీజ్ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ కాగా.. అందులో ఈ సినిమాపై రాజమౌళి, ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, నాని, మణిరత్నం, చిరంజీవిలాంటి వాళ్లు తమ అభిప్రాయాలు చెప్పడం చూడొచ్చు.
శివ మూవీకి ముందు, ఆ తర్వాత అనొచ్చు అంటూ రాజమౌళి అన్నాడు. ఈ సినిమాను ఓ పది సార్లు చూసుంటానని మహేష్ బాబు.. ఈ మూవీ తనపై ఎంతగానో ప్రభావం చూపిందని ప్రభాస్.. మోస్ట్ ఐకానిక్ మూవీ అని అల్లు అర్జున్.. ఇదో చిరస్మరణీయమైన మూవీ అని చిరంజీవిలాంటి వాళ్లు శివ సినిమాపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆ తర్వాత మూవీ ట్రైలర్ చూపించారు. ఇందులో ఆ మూవీలోని కొన్ని ఐకానిక్ సీన్లను చూడొచ్చు.
శివ మూవీ గురించి..
శివ మూవీ డిసెంబర్ 7, 1990లో రిలీజైంది. ఇందులో నాగార్జున, అమల లీడ్ రోల్స్ లో నటించగా.. చిన్నా, శుభలేఖ సుధాకర్, రఘువరన్, తనికెళ్ల భరణిలాంటి వాళ్లు కూడా నటించారు. స్టూడెంట్ పాలిటిక్స్ చుట్టూ తిరిగే సినిమా ఇది. ఇందులో శివ పాత్రలో నాగార్జున, ఆశ పాత్రలో అమల నటించారు. ఈ సినిమాలో సైకిల్ చెయిన్ సీన్ ఎవర్‌గ్రీన్ గా నిలిచింది.
ఇక పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్నింటికీ మించి రామ్‌గోపాల్ వర్మ డైరెక్షన్, టేకింగ్ ఇండియన్ సినిమాలో ప్రత్యేకంగా నిలిచిపోయింది. వర్మను టాప్ డైరెక్టర్లలో ఒకడిగా చేసింది. తొలి సినిమాతోనే అతని రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత అతడు క్షణక్షణం, గోవిందా గోవిందా, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్ లాంటి సినిమాలతో
{{/usCountry}}ఇక పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్నింటికీ మించి రామ్‌గోపాల్ వర్మ డైరెక్షన్, టేకింగ్ ఇండియన్ సినిమాలో ప్రత్యేకంగా నిలిచిపోయింది. వర్మను టాప్ డైరెక్టర్లలో ఒకడిగా చేసింది. తొలి సినిమాతోనే అతని రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత అతడు క్షణక్షణం, గోవిందా గోవిందా, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్ లాంటి సినిమాలతో
{{/usCountry}}