...
...
Next Story

RGV Police Company: ఆర్జీవీ ఈజ్ బ్యాక్.. క్రైమ్ థ్రిల్లర్ పోలీస్ కంపెనీ అనౌన్స్ చేసిన డైరెక్టర్.. ఆ టాప్ హీరో లీడ్ రోల్

RGV Police Company: రామ్ గోపాల్ వర్మ తన నెక్ట్స్ మూవీ అనౌన్స్ చేశాడు. అందరూ సిండికేట్ మూవీ అప్డేట్ గురించి ఎదురు చూస్తుండగా.. తాను పోలీస్ కంపెనీ అనే మూవీ చేయబోతున్నట్లు చెప్పి షాక్ ఇచ్చాడు. ఈ మూవీ గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Published on: Aug 11, 2026, 13:54:46 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

RGV Police Company: ఇండియన్ సినిమా హిస్టరీలోనే అండర్‌వరల్డ్, క్రైమ్ డ్రామా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) తన తదుపరి ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ దిగ్గజ నిర్మాణ సంస్థ 'టీ సిరీస్' (T-Series) నిర్మిస్తున్న ఈ భారీ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి 'పోలీస్ కంపెనీ' అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు.

RGV Police Company: ఆర్జీవీ ఈజ్ బ్యాక్.. క్రైమ్ థ్రిల్లర్ పోలీస్ కంపెనీ అనౌన్స్ చేసిన డైరెక్టర్.. ఆ టాప్ హీరో లీడ్ రోల్
RGV Police Company: ఆర్జీవీ ఈజ్ బ్యాక్.. క్రైమ్ థ్రిల్లర్ పోలీస్ కంపెనీ అనౌన్స్ చేసిన డైరెక్టర్.. ఆ టాప్ హీరో లీడ్ రోల్

ఈ చిత్రానికి "ఇట్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ డి కంపెనీ" (It Is More Dangerous Than D Company) అనే క్రేజీ ట్యాగ్‌లైన్‌ను జతచేసి సినీ ప్రియుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించారు. చాలా ఏళ్ల తర్వాత వర్మ మళ్లీ తన సొంత జోనర్ అయిన ముంబై క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లోకి అడుగుపెడుతుండటంతో సోషల్ మీడియాలో ఈ అనౌన్స్‌మెంట్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ 'దయా నాయక్' పాత్రలో హర్షవర్ధన్ రాణే

బాలీవుడ్ హ్యాండ్సమ్ యాక్టర్ హర్షవర్ధన్ రాణే ఈ సినిమాలో అత్యంత కీలకమైన 'దయా నాయక్' పాత్రలో కనిపించబోతున్నారు. రియల్ లైఫ్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ పాత్రకు సంబంధించి హర్షవర్ధన్ రాణే ఇంటెన్స్ అండ్ రా లుక్స్‌ను వర్మ తన అధికారిక ఎక్స్ ఖాతాలో వరుసగా షేర్ చేశారు.

చేతిలో గన్‌తో పక్కా సీరియస్ ఎన్‌కౌంటర్ ఆఫీసర్‌గా హర్షవర్ధన్ రాణే మేకోవర్ అద్భుతంగా కుదిరింది. దయా నాయక్ పాత్రలో రాణే పవర్ ఫుల్ పోలీస్ అవతారం చూసి ఫ్యాన్స్, సినీ విశ్లేషకులు మైండ్ బ్లాక్ అవుతున్నారు. ఈ చిత్రంలో ఇంకా అనేకమంది స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారని, వారి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని వర్మ స్పష్టం చేశారు.

అసలు ఏంటి ఈ 'పోలీస్ కంపెనీ'? - ఆర్జీవీ మైండ్ బ్లాకింగ్ డీటైలింగ్

ముంబై అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తన ప్రత్యర్థి గ్యాంగ్‌లను దారుణంగా అంతమొందించిన తర్వాత, తన గ్యాంగ్‌ను ఒక 'డి కంపెనీ'గా మార్చేశాడు. అనంతరం ఆపరేషన్స్ అన్నింటినీ తన ముఖ్య అనుచరుడైన ఛోటా రాజన్‌కు అప్పగించి తాను దుబాయ్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత చోటుచేసుకున్న కొన్ని అనూహ్య పరిణామాల వల్ల దావూద్, ఛోటా రాజన్ మధ్య తీవ్ర పూడ్చలేని విభేదాలు వచ్చి డి కంపెనీ రెండుగా చీలిపోయింది.

300 మంది గ్యాంగ్‌స్టర్ల వేట.. రియల్ ఎన్‌కౌంటర్ స్క్వాడ్ కథ

దావూద్, రాజన్ విడిపోవడంతో ముంబై అండర్‌వరల్డ్‌లో ఒక్కసారిగా పెద్ద శూన్యం ఏర్పడింది. ఆ అండర్‌వరల్డ్ పీఠాన్ని దక్కించుకోవడానికి మిగిలిన చిన్న చిన్న గ్యాంగ్‌లు ఒక్కసారిగా విరుచుకుపడటంతో ముంబై నగరంలో తీవ్రమైన నేరపూరిత వాతావరణం నెలకొంది. యూపీ, ఎంపీ, బీహార్ లాంటి రాష్ట్రాల నుంచి వేలాదిమంది యువకులు క్రైమ్ వైపు ఆకర్షితులై ఈ గ్యాంగ్‌లలో చేరడం ప్రారంభించారు.

నేరాలను అదుపు చేయడంలో వ్యవస్థ పూర్తిగా విఫలమవుతున్న తరుణంలో, ఆ భయాందోళనకర పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ముంబై పోలీసులు ఒక ప్రత్యేక స్పెషల్ స్క్వాడ్ ను ఏర్పాటు చేశారు. 1997 నుంచి 2004 మధ్య కాలంలో ఈ స్పెషల్ స్క్వాడ్ ఏకంగా 300 మందికి పైగా డేంజరస్ గ్యాంగ్‌స్టర్లను ఎన్‌కౌంటర్లలో లేపేసింది.

ఆ నిజమైన స్పెషల్ ఎన్‌కౌంటర్ టీమ్, అందులోని ప్రధాన సభ్యుడైన దయా నాయక్ జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగానే వర్మ ఈ 'పోలీస్ కంపెనీ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 'సత్య', 'కంపెనీ', 'డి', 'అబ్ తక్ ఛప్పన్' లాంటి క్లాసిక్ సినిమాల తర్వాత వర్మ మళ్లీ రియల్ అండర్‌వరల్డ్ ఎన్‌కౌంటర్స్ ఆధారంగా సినిమా తీస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe