RGV Rao Bahadur Review: 99 శాతం సినిమాలు అలాంటివే కానీ ఈ రావు బహదూర్ వేరు.. వాళ్లిద్దరినీ ద్వేషించడం లేదు కానీ..:ఆర్జీవీ

RGV Rao Bahadur Review: రావు బహదూర్ మూవీని ఆకాశానికెత్తుతూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 99 శాతం సినిమాలు మరో సినిమా జ్ఞాపకాల ద్వారా వస్తాయని, కానీ ఈ సినిమా మాత్రం అలాంటిదేమీ లేకుండా చాలా ఫ్రెష్ గా ఉందని అన్నారు.

Published on: Jul 4, 2026, 08:50:21 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

RGV Rao Bahadur Review: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV) ఎవరినైనా పొగిడాడంటే అందులో కచ్చితంగా ఏదో స్పెషాలిటీ ఉండే ఉంటుంది. తాజాగా టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్, డైరెక్టర్ వెంకటేష్ మహా కాంబినేషన్ లో వచ్చిన 'రావు బహదూర్' మూవీపై ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. సత్యదేవ్ యాక్టింగ్ తో పాటు మేకింగ్ స్టాండర్డ్స్ పై వర్మ వేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

RGV Rao Bahadur Review: 99 శాతం సినిమాలు అలాంటివే కానీ ఈ రావు బహదూర్ వేరు.. వాళ్లిద్దరినీ ద్వేషించడం లేదు కానీ..:ఆర్జీవీ
RGV Rao Bahadur Review: 99 శాతం సినిమాలు అలాంటివే కానీ ఈ రావు బహదూర్ వేరు.. వాళ్లిద్దరినీ ద్వేషించడం లేదు కానీ..:ఆర్జీవీ

సత్యదేవ్ పాత్రలోకి మాయమైపోయాడు

ఎప్పుడూ తనదైన స్టైల్ లో విమర్శలు చేసే రామ్ గోపాల్ వర్మ.. ఈసారి మాత్రం డైరెక్టర్ వెంకటేష్ మహాను ఆకాశానికెత్తేశాడు. "రావు బహదూర్ సినిమా తీసినందుకు నేను మహాను, సత్యదేవ్ ను ఏమాత్రం ద్వేషించట్లేదు.. ముఖ్యంగా సత్యదేవ్ తో యాక్టింగ్ చేయించకుండా, ఆ క్యారెక్టర్ లో పూర్తిగా పాత్రలో మాయమైపోయేలా చేసినందుకు నిజంగా హ్యాట్సాఫ్" అంటూ ఎక్స్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించాడు. ఒక ఆర్టిస్ట్ క్యారెక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేయడం అంటే ఇదేనని వర్మ తేల్చి చెప్పాడు.

లోకల్లీ ఇంటర్నేషనల్.. ప్రొడక్షన్ వాల్యూస్ పై ప్రశంసలు

సినిమాలోని మేకప్, కాస్ట్యూమ్స్, ప్రొడక్షన్ డిజైన్ గురించి కూడా వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రతి ఫ్రేమ్ చూస్తుంటే 'లోకల్లీ ఇంటర్నేషనల్' అనే ఫీలింగ్ కలుగుతోందని వర్మ చెప్పాడు. క్వాలిటీ విషయంలో డైరెక్టర్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని ఆయన ట్వీట్ చూస్తేనే అర్థమవుతోంది. సత్యదేవ్ లుక్, మూవీ కోసం వేసిన సెట్స్ అన్నీ ఒక వింటేజ్ వరల్డ్ ను అద్భుతంగా క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ లోని రెగ్యులర్ సినిమాలపై కూడా వర్మ తన స్టైల్ లో సెటైర్ వేశాడు. "ఇప్పుడు వస్తున్న 99 శాతం సినిమాలు పాత సినిమాల జ్ఞాపకాలతో కాపీ కొడుతున్నవే.. కానీ రావు బహదూర్ మాత్రం జీరో మెమొరీ ఇమాజినేషన్ తో తెరకెక్కింది" అని లాజిక్ లాగాడు. అత్యంత స్పష్టతతో డైరెక్టర్ ఈ మూవీని తెరకెక్కించినట్లు అభిప్రాయపడ్డాడు.

సత్యదేవ్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్

'కేరాఫ్ కంచరపాలెం', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' లాంటి కల్ట్ క్లాసిక్స్ తో ఆడియన్స్ ను మెప్పించిన వెంకటేష్ మహా.. ఇప్పుడు సత్యదేవ్ తో కలిసి ఒక పవర్ ఫుల్ సైకలాజికల్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. తెలుగు సినిమా ఇంతకు ముందు ఎప్పుడూ చూడనిది అని సాక్షాత్తూ మహేష్ బాబుతోనే చెప్పింది రిలీజ్ కు ముందే హైప్ క్రియేట్ చేసుకుంది.

అందుకు తగినట్లు రిలీజ్ తర్వాత కూడా ఈ రావు బహదూర్ కు రివ్యూలు వచ్చాయి. ఇప్పుడు ఆర్జీవీ ప్రశంసలతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా మూవీలో సత్యదేవ్ నటనకు అన్ని వైపుల నుంచీ ప్రశంసలు దక్కుతున్నాయి. మూవీ అర్థం కాలేదని కొన్ని విమర్శలు ఉన్నా.. ఇలాంటి ప్రయత్నం చేసినందుకు మాత్రం దర్శకుడిని అభినందిస్తున్నారు.

ఆర్జీవీయే కాదు గతంలో మరో టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ రావు బహదూర్ సినిమాను ప్రశంసలతో ముంచెత్తాడు. ఇక మూవీ ట్రైలర్ కు మహేష్ బాబు వాయిస్ ఓవర్ తో మరింత హైప్ పెంచారు. మరి ఇవన్నీ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లు పెంచుతాయా లేదా అన్నది చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More