రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్’ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇది సాధారణ సినిమా కాదని, భారతీయ సినిమా గమనాన్నే మార్చేసే అద్భుతమని వర్ణిస్తూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన రివ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇండియన్ సినిమాను మార్చే మూవీ

ధురంధర్ సినిమాపై ఇప్పటికే చాలా మంది సెల్రబిటీలు ప్రశంసలు కురిపించారు. అయితే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాత్రం శుక్రవారం (డిసెంబర్ 19) ఉదయం తన ఎక్స్‌లో ఓ సుదీర్ఘ రివ్యూ ఇస్తూ.. మూవీని ఆకాశానికెత్తాడు. ఇది ఇండియన్ సినిమాకు ఓ టర్నింగ్ పాయింట్ అని అతడు అనడం విశేషం.
“నార్త్ అయినా, సౌత్ అయినా సరే.. ఆదిత్య ధర్ ఒంటిచేత్తో భారతీయ సినిమా భవిష్యత్తును మార్చేశారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే 'ధురంధర్' అనేది జస్ట్ ఒక సినిమా కాదు.. అది సినిమా ప్రమాణాలను పెంచిన ఒక భారీ ముందడుగు. ఈ సినిమాలో ఉన్నది కేవలం భారీతనం మాత్రమే కాదు.. మనమెప్పుడూ చూడని ఒక కొత్త విజన్ ఉంది. ఆదిత్య ధర్ ఇక్కడ సీన్లను డైరెక్ట్ చేయలేదు.. పాత్రల మైండ్ సెట్‌ని, మన మైండ్ సెట్‌ని కూడా ఇంజనీరింగ్ చేశారు. ఈ సినిమా మన అటెన్షన్‌ని అడగదు.. డిమాండ్ చేసి మరీ లాక్కుంటుంది. ఫస్ట్ షాట్ నుంచే ఏదో జరగబోతోందనే ఫీలింగ్ మొదలవుతుంది. మనం కేవలం ప్రేక్షకుల్లా కాకుండా, అందులో జరుగుతున్న దాంట్లో భాగమైపోతాం” అని ఆర్జీవీ అన్నాడు.
ప్రతి సీన్‌లో ఓ టెన్షన్
అతడు తన రివ్యూను ఇంకా కొనసాగిస్తూ.. “ఈ సినిమా ఎక్కడా సాఫ్ట్ గా ఉండదు. రైటింగ్ చాలా పదునుగా ఉంటుంది. ఇందులో వినిపించే 'నిశ్శబ్దం' కూడా పెద్ద బాంబులా పేలుతుంది. కథ చెప్పడంలో పవర్ అంటే గట్టిగా అరవడం కాదని, ప్రెజర్ బిల్డ్ చేయడమని డైరెక్టర్‌కి బాగా తెలుసు. ఒక స్ప్రింగ్‌ని టైట్ చేస్తుంటే ఎప్పుడు తెగుతుందో తెలీని టెన్షన్ ప్రతి సీన్‌లో ఉంటుంది. అది పేలినప్పుడు ఆ ఇంపాక్ట్ మామూలుగా ఉండదు” అని చెప్పాడు.
ఆడియెన్స్ చాలా తెలివైన వాళ్లు
{{/usCountry}}అతడు తన రివ్యూను ఇంకా కొనసాగిస్తూ.. “ఈ సినిమా ఎక్కడా సాఫ్ట్ గా ఉండదు. రైటింగ్ చాలా పదునుగా ఉంటుంది. ఇందులో వినిపించే 'నిశ్శబ్దం' కూడా పెద్ద బాంబులా పేలుతుంది. కథ చెప్పడంలో పవర్ అంటే గట్టిగా అరవడం కాదని, ప్రెజర్ బిల్డ్ చేయడమని డైరెక్టర్‌కి బాగా తెలుసు. ఒక స్ప్రింగ్‌ని టైట్ చేస్తుంటే ఎప్పుడు తెగుతుందో తెలీని టెన్షన్ ప్రతి సీన్‌లో ఉంటుంది. అది పేలినప్పుడు ఆ ఇంపాక్ట్ మామూలుగా ఉండదు” అని చెప్పాడు.
ఆడియెన్స్ చాలా తెలివైన వాళ్లు
{{/usCountry}}ఆదిత్య ధర్ ఈ సినిమాను తీసిన విధానం చూస్తే అతడు ఆడియెన్స్ చాలా తెలివైన వాళ్లు అని నమ్మినట్లు అనిపిస్తోందని రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డాడు. “ఇందులో నటన మనకు నచ్చడం కోసం ఉండదు.. థియేటర్ దాటి వచ్చాక కూడా మనల్ని వెంటాడుతుంది. పాత్రల గతం ఏంటో డైరెక్టర్ స్పూన్ ఫీడింగ్ చేయరు.. వాళ్ళ గాయాలను చూసి మనమే అర్థం చేసుకోవాలని ఆడియన్స్ ని నమ్మారు. సాధారణంగా డైరెక్టర్లు ఆడియన్స్ కి ఏం అర్థం కాదని భావిస్తారు.. కానీ ఆదిత్య ధర్ మాత్రం ఆడియన్స్ ఇంటెలిజెంట్ అని నమ్మి, గౌరవించి తీశారు" అని ఆర్జీవీ అన్నాడు.
టెక్నికల్ బ్రిలియన్స్
ఇక ఈ సినిమాలో టెక్నీషియన్స్ పని తీరు గురించి కూడా ఆర్జీవీ మాట్లాడాడు. “టెక్నికల్ గా చూస్తే.. మెయిన్ స్ట్రీమ్ సినిమా లెక్కలన్నీ ఈ సినిమా మార్చేసింది. సీన్లను అందంగా చూపించడానికి కాదు.. మనల్ని వెంటాడటానికి వాడారు. ఏదో చూస్తున్నట్టు కాకుండా.. వేటాడుతున్నట్టు కెమెరా తిరుగుతుంది. యాక్షన్ విషయానికి వస్తే చప్పట్ల కోసం కొరియోగ్రఫీ చేసినట్టు ఉండదు.. నిజంగా వయొలెన్స్ ఎంత భయంకరంగా ఉంటుందో అలా రియలిస్టిక్ గా చూపించారు” అని వర్మ అన్నాడు.
అన్నిటికంటే ముఖ్యంగా.. ఈ సినిమా తీయాలన్న ఉద్దేశమే గొప్పదని, ట్రెండ్స్ ఫాలో అవ్వడానికో, డబ్బుల కోసమో తీసింది కాదని చెప్పాడు. మనం హాలీవుడ్ ని కాపీ కొట్టక్కర్లేదు, మన నేటివిటీతోనే ఇంటర్నేషనల్ రేంజ్ సినిమా తీయొచ్చని ఆదిత్య ధర్ నిరూపించాడని వర్మ అభిప్రాయపడ్డాడు.
టైటిల్స్ పడుతున్నప్పుడు.. ఏదో ఎంటర్టైన్ అయ్యాం అనిపించదు.. మనం మారిపోయాం అనిపిస్తుంది.. మనలాంటి ఫిల్మ్ మేకర్స్ అందరూ నిలబడే పునాదిని మార్చేసే సత్తా ఉన్న డైరెక్టర్ ఆదిత్య ధర్ అంటూ అతన్ని రామ్ గోపాల్ వర్మ ఆకాశానికెత్తాడు.