Ranveer Singh: బాలీవుడ్ ప్రముఖ హీరో రణ్‌వీర్ సింగ్‌పై సినీ కార్మిక సంఘం 'FWICE' సహాయ నిరాకరణ ప్రకటించిన విషయం తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ 'ఎక్స్' వేదికగా చాలా ఘాటుగా స్పందించారు. రణ్‌వీర్ సింగ్‌ను కాదు, ఆ ఫెడరేషన్‌నే బ్యాన్ చేయాలంటూ సంచలన పోస్ట్ పెట్టారు. ఈ వివాదంలో తలదూర్చే హక్కు FWICEకు లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఆర్జీవీ తన సుదీర్ఘ పోస్టులో ఏమన్నాడో చూడండి.
అదొక కంగారూ కోర్టు..

రణ్‌వీర్ సింగ్ వ్యవహారంలో ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ.. అదేమీ కోర్టు కాదంటూ ఆర్జీవీ అన్నారు.
"గాంధీజీ తరహాలో సహాయ నిరాకరణ చేస్తాం, బ్యాన్ చేస్తాం అనడం చివరికి FWICE పాలిట ఒక పెద్ద జోక్‌గా మారుతుంది. ఇది పరిశ్రమను లేదా కార్మికులను రక్షించడం కాదు. కాలం చెల్లిన ఒక యూనియన్ వ్యవస్థ తన ఉనికిని కాపాడుకోవడం కోసం కండబలం ప్రదర్శించుకునే ఒక డ్రామా మాత్రమే. లక్షలాది మంది కార్మికుల తరఫున మాట్లాడుతున్నామని వారు చెప్పుకుంటున్నా.. ఆ కార్మికులకు అసలు ఈ వివాదంలో ఉన్న నిజాలేమిటో కూడా తెలియదు. FWICE అనేది చట్టబద్ధమైన న్యాయస్థానం కాదు, ప్రభుత్వ గుర్తింపు పొందిన నియంత్రణ సంస్థ అంతకన్నా కాదు. అదొక కంగారూ కోర్టు. ఒక అజెండాతో కొంతమంది ప్రైవేట్‌గా కూర్చుని ముందే తీర్పులు రాసేసుకునే పంచాయితీ అది" అని ఆర్జీవీ చాలా ఘాటుగా స్పందించారు.
'ధురంధర్' సక్సెస్ చూసి భయపడుతున్నారు
"ఇటీవల రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' (Dhurandhar) సినిమా సాధించిన మెగా సక్సెస్ చూసి భయపడి వణికిపోతున్న కొందరు నటులు కూడా ఈ గ్రూపులో ఉండి ముందే తీర్పును డిసైడ్ చేసేశారు. ఇది FWICEకు పీఆర్ పరంగా పెద్ద డిజాస్టర్ కాబోతోంది. లక్షలాది మంది కార్మికుల బతుకులు ఏ ఒక్క హీరో పైనో, ఏ ఒక్క ప్రాజెక్టు పైనో ఆధారపడి ఉండవనేది పచ్చి నిజం. సోషల్ మీడియాలో సానుభూతి కోసం వారు కార్మికుల పేరుతో అబద్ధాలు ఆడుతున్నారు" అని ఆర్జీవీ అన్నారు.
అది వారి వ్యక్తిగత వివాదం..
"ఈ వ్యవహారంలో అసలు విషయం ఏమిటంటే.. ఒక నిర్మాత తనకు ప్రీ-ప్రొడక్షన్ వల్ల భారీ నష్టాలు వచ్చాయని చెబుతున్నాడు. అది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ వివాదం. ఇండియాలోని అన్ని వ్యాపారాల్లో ఇలాంటివి లక్షల్లో జరుగుతుంటాయి. అప్పుడు ఈ FWICE ఎక్కడికి పోయింది? అందులో ఏం జరిగిందనేది ఆ ఇద్దరికి మాత్రమే తెలుసు. సివిల్ కోర్టుకు వెళితే జడ్జి నిర్ణయిస్తారు. అంతే తప్ప ఇందులో మిగతా వాళ్లు దూరి రణ్‌వీర్ సింగ్‌ను బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు" అని స్పష్టం చేశారు.
నిజం ఏమిటంటే..
{{/usCountry}}"ఈ వ్యవహారంలో అసలు విషయం ఏమిటంటే.. ఒక నిర్మాత తనకు ప్రీ-ప్రొడక్షన్ వల్ల భారీ నష్టాలు వచ్చాయని చెబుతున్నాడు. అది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ వివాదం. ఇండియాలోని అన్ని వ్యాపారాల్లో ఇలాంటివి లక్షల్లో జరుగుతుంటాయి. అప్పుడు ఈ FWICE ఎక్కడికి పోయింది? అందులో ఏం జరిగిందనేది ఆ ఇద్దరికి మాత్రమే తెలుసు. సివిల్ కోర్టుకు వెళితే జడ్జి నిర్ణయిస్తారు. అంతే తప్ప ఇందులో మిగతా వాళ్లు దూరి రణ్‌వీర్ సింగ్‌ను బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు" అని స్పష్టం చేశారు.
నిజం ఏమిటంటే..
{{/usCountry}}"FWICE ఎన్ని హెచ్చరికలు చేసినా.. రణ్‌వీర్ సింగ్ ఒక్కసారి తలూపితే చాలు, రేపు ఉదయం ఆయన ఇంటి ముందు నిర్మాతలు చెక్కులు పట్టుకుని కిలోమీటరు పొడవునా క్యూ కడతారు. ఎందుకంటే థియేటర్లలో టికెట్లు అమ్మించేది రణ్‌వీర్ లాంటి స్టార్స్.. FWICE కాదు. లక్షలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించేది రణ్‌వీర్ లాంటి స్టార్స్.. FWICE కాదు. రణ్‌వీర్ లాంటి స్టార్స్ ఉన్నారు కాబట్టే పరిశ్రమ ఉంది.. ఆ ఫెడరేషన్ కూడా ఉంది. కాబట్టి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సివిల్ వివాదంలో అనవసరంగా తలదూర్చకండి" అంటూ ఆర్జీవీ తన పోస్ట్‌ను ముగించారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
రణ్‌వీర్ సింగ్‌పై FWICE ఎందుకు బ్యాన్ విధించింది?
డాన్ 3 సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ దశలో తనకు భారీ నష్టాలు వచ్చాయని ఒక నిర్మాత చేసిన ఆరోపణల (వ్యక్తిగత కాంట్రాక్ట్ వివాదం) నేపథ్యంలో FWICE రణ్‌వీర్‌పై సహాయ నిరాకరణ (బ్యాన్) ప్రకటించింది.
రణ్‌వీర్‌పై విధించిన నిషేధంపై రామ్ గోపాల్ వర్మ ఏమని స్పందించారు?
ఇది పూర్తిగా ఇద్దరి మధ్య జరిగిన సివిల్ వివాదమని, ఇందులో తలదూర్చడానికి FWICE ఒక కంగారూ కోర్టు లాగా ప్రవర్తిస్తోందని ఆర్జీవీ విమర్శించారు.
ఆర్జీవీ ప్రకారం ఈ వివాదానికి అసలు కారణం ఏమిటి?
రణ్‌వీర్ నటించిన 'ధురంధర్' సినిమా భారీ విజయం సాధించడంతో, అది చూసి ఓర్వలేక భయపడుతున్న కొందరు నటులు ఉద్దేశపూర్వకంగా ఈ వివాదాన్ని సృష్టిస్తున్నారని వర్మ ఆరోపించారు.