...
...
Next Story

Ram Gopal Varma: షాకింగ్.. ఫస్ట్ టైమ్ ధురంధర్ 2పై నెగెటివ్ కామెంట్స్ చేసిన ఆర్జీవీ.. అదొక్కటే నచ్చలేదంటూ

Ram Gopal Varma: బ్లాక్ బస్టర్ హిట్ ‘ధురంధర్ 2’పై సంచలన దర్శకుడు ఆర్జీవీ ప్రశంసలు కురిపిస్తూనే వచ్చాడు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైమ్ ఈ మూవీపై నెగెటివ్ కామెంట్లు చేశాడు. అదొక్కటే నచ్చలేదంటూ కుండ బద్ధలు కొట్టాడు.

Published on: Apr 17, 2026 06:13 AM IST
Advertisement

Ram Gopal Varma: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మనసులో ఏది ఉంటే అది బయటకు చెప్పేస్తుంటాడు. ఇన్ని రోజులూ ధురంధర్ 2ను ఆహా అంటూ పొగిడేసిన అతను.. ఇప్పుడు ఫస్ట్ టైమ్ నెగెటివ్ కామెంట్లు చేశాడు. ఒక విషయంలో మాత్రం మూవీని అపోజ్ చేశాడు. సినిమాలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాత్రను చిత్రించిన తీరు సరిగ్గా లేదని వర్మ అభిప్రాయపడ్డాడు.

ఆర్జీవీ కామెంట్లు

ధురంధర్ 2పై ఆర్జీవీ కామెంట్లు
ధురంధర్ 2పై ఆర్జీవీ కామెంట్లు

ప్రముఖ రచయిత హుస్సేన్ జైదీతో నిర్వహించిన తాజా ఇంటర్వ్యూలో ఆర్జీవీ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ధురంధర్ 2 మేకింగ్, క్రాఫ్ట్ అద్భుతంగా ఉన్నప్పటికీ, దావూద్ ఇబ్రహీం పాత్ర విషయంలో తనకు భిన్నమైన అభిప్రాయం ఉందని చెప్పాడు. సినిమాలో దావూద్‌ను 'బడే సాహబ్' అని పిలుస్తూ, పాకిస్థాన్‌తో కలిసి భారత్‌లో ఉగ్ర కార్యకలాపాలను నడిపించే కీలక వ్యక్తిగా చూపించారు.

నాకు నచ్చనది

" ధురంధర్ 2 సినిమాలో నాకు నచ్చని అంశం ఏదైనా ఉందంటే అది దావూద్ ఇబ్రహీం పాత్రను చూపించిన విధానమే. మేకర్స్ దగ్గర వారికి తెలిసిన సొంత సమాచారం ఉండవచ్చు, కానీ నా అవగాహన ప్రకారం అది తప్పు" అని ఆర్జీవీ అన్నాడు. తన వాదనను సమర్థించుకుంటూ.. "నేను చెప్పేదే పూర్తి నిజమని కూడా అనను. కానీ నాకు తెలిసిన విషయాలతో పోల్చితే సినిమాలో దావూద్ గురించి చెప్పింది పొంతన లేకుండా ఉంది" అని రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశాడు.

వాస్తవం ఎవరికీ తెలియదు

అండర్ వరల్డ్ వంటి అంశాల మీద సినిమాలు తీసేటప్పుడు అసలు నిజాన్ని నిర్ధారించడం ఎవరికీ సాధ్యం కాదని ఆర్జీవీ అభిప్రాయపడ్డాడు. "సినిమాలో ఒక విషయాన్ని చూపించినప్పుడు దాన్ని మేకర్స్ నిరూపించలేరు, విమర్శకులు దాన్ని కాదనలేరు. ఎవరి దగ్గర ఖచ్చితమైన ఆధారాలు ఉండవు" అని ఆర్జీవీ పేర్కొన్నాడు. గత కొన్నేళ్లుగా దావూద్ అనారోగ్యంతో ఉన్నాడని, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాడని తాను విన్నట్లు వర్మ తెలిపాడు. తన అంచనా ప్రకారం దావూద్ ఎప్పుడో ఈ నేర ప్రపంచం నుండి తప్పుకొని ఉండవచ్చని ఆయన అంచనా వేశాడు.

ఆదిత్య ధర్ నా గురువు

ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 1,700 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. రణ్‌వీర్ సింగ్, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ ఫ్రాంచైజీలోని రెండు భాగాలు కలిపి దాదాపు 3,000 కోట్ల రూపాయల మైలురాయిని దాటడం విశేషం.

1993 ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన దావూద్ ఇబ్రహీం జీవితం ఆధారంగా గతంలో ఆర్జీవీ కూడా 'సత్య', 'కంపెనీ' వంటి అద్భుతమైన క్రైమ్ డ్రామాలను రూపొందించిన సంగతి తెలిసిందే. అందుకే అండర్ వరల్డ్ పై అతను చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe