పైరేట్ వెబ్ సైట్ ఐబొమ్మ నడుపుతున్న ఇమ్మడి రవిని ఈ వారం అరెస్ట్ చేశారు. అతని అరెస్ట్ తర్వాత కొందరు ప్రేక్షకులు రవి చట్టవిరుద్ధమైన ఆన్ లైన్ మూవీ స్ట్రీమింగ్ కు మద్దతు తెలుపుతూ, అతన్ని రాబిన్ హుడ్ తో పోల్చారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అలాంటి వారిపై విరుచుకుపడ్డారు. వారి అజ్ఞానాన్ని ఎత్తిచూపారు.
ఆర్జీవీ ఫైర్

ఐబొమ్మ పైరసీ వెబ్ సైట్, ఇమ్మడి రవి, పైరసీపై రామ్ గోపాల్ వర్మ తన స్టైల్లో రియాక్టయ్యారు. ‘‘పైరసీ ఎప్పటికీ ఆగదు. టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందడం వల్లనో లేదా పోలీసుల పర్యవేక్షణ బలహీనంగా ఉండటం వల్లనో కాదు. పైరసీ చేసిన సినిమాను చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు ఉన్నంత కాలం, వారికి సేవ చేయడానికి 'రవి'లు ఎప్పుడూ ఉంటారు’’ అని ఆర్జీవీ ఎక్స్ లో పెద్ద పోస్టు పంచుకున్నారు.
రాబిన్ హుడ్
‘‘హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే, రవి మద్దతుదారులు అతన్ని గర్వంగా రాబిన్ హుడ్‌తో పోలుస్తున్నారు. తాము ఏదో నోబెల్ బహుమతి గెలుచుకునే గొప్ప లాజిక్‌ను కనుగొన్నట్లుగా ఫీలవుతున్నారు. రాబిన్ హుడ్ హీరో కాదు. అతను ప్రపంచంలోనే మొట్టమొదటిగా నమోదైన ఉగ్రవాది. ధనవంతుల నుండి దోచుకుని, వాళ్లను చంపి, లేని వారికి ఇస్తాడు. ధనవంతులు చేసిన ఏకైక నేరం వారు ధనవంతులు కావడం మాత్రమే.
ఆర్థికంగా విజయం సాధించడాన్ని దొంగతనం, హత్యతో శిక్షించదగిన నేరంగా భావించేంతగా ఒక వ్యక్తి ఎంత నీచంగా ఉండాలో ఊహించండి. దొంగిలించిన వస్తువులను ఉచితంగా పొందుతున్నారు అనే ఒకే ఒక్క కారణంతో ఒక నేరస్థుడిని "సాధువు"గా చూపించడానికి చాలా అజ్ఞానం కావాలి’’ అని రామ్ గోపాల్ వర్మ ఫైర్ అయ్యారు.
ఆ లాజిక్ ఏంటీ?
‘‘సినిమా ఖరీదైందా? అయితే పైరసీ సమర్థనీయం. పాప్‌కార్న్ ధర ఎక్కువ ఉందా? అయితే సినిమాను లీక్ చేయండి. టికెట్ల రేట్ అధికమా? అయితే కంటెంట్‌ను దొంగిలించండి.. ఇదే వాళ్ల లాజిక్. ఈ లాజిక్ ప్రకారం ఒక బీఎండబ్ల్యూ ఖరీదైనదైతే, మీరు షోరూమ్‌ను దోచుకుని ఆ కార్లన్నింటినీ స్లమ్‌లోని ప్రతి ఒక్కరికీ ఇవ్వాలి. నగలు ఖరీదైనవా? దుకాణాన్ని దోచుకుని ఉచితంగా పంచిపెట్టండి. ఈ లాజిక్ అన్ని వస్తువులకు వర్తిస్తుంది. ఈ రకమైన ఆలోచన సామాజిక పతనానికి, అరాచకానికి దారి తీస్తుంది’’ అని ఆర్జీవీ మండిపడ్డారు.
నాలాంటి వాళ్లు
{{/usCountry}}‘‘సినిమా ఖరీదైందా? అయితే పైరసీ సమర్థనీయం. పాప్‌కార్న్ ధర ఎక్కువ ఉందా? అయితే సినిమాను లీక్ చేయండి. టికెట్ల రేట్ అధికమా? అయితే కంటెంట్‌ను దొంగిలించండి.. ఇదే వాళ్ల లాజిక్. ఈ లాజిక్ ప్రకారం ఒక బీఎండబ్ల్యూ ఖరీదైనదైతే, మీరు షోరూమ్‌ను దోచుకుని ఆ కార్లన్నింటినీ స్లమ్‌లోని ప్రతి ఒక్కరికీ ఇవ్వాలి. నగలు ఖరీదైనవా? దుకాణాన్ని దోచుకుని ఉచితంగా పంచిపెట్టండి. ఈ లాజిక్ అన్ని వస్తువులకు వర్తిస్తుంది. ఈ రకమైన ఆలోచన సామాజిక పతనానికి, అరాచకానికి దారి తీస్తుంది’’ అని ఆర్జీవీ మండిపడ్డారు.
నాలాంటి వాళ్లు
{{/usCountry}}‘‘ప్రజలు ఏదో నైతిక విప్లవం కారణంగా పైరసీ కంటెంట్‌ను చూడరు. ప్రధానంగా సౌలభ్యం కోసమే చూస్తారు. కొందరికి ఇది డబ్బు ఆదా కావచ్చు. థియేటర్‌కు వెళ్లడం కంటే ఒక లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా సమయాన్ని ఆదా చేయవచ్చని చాలా మంది భావిస్తారు. సినిమా పరిశ్రమకు చెందిన వారు కూడా నాతో సహా ఇదే కారణంతో పైరసీ కంటెంట్‌ను చూస్తారు’’ అని ఆర్జీవీ పోస్ట్ లో పేర్కొన్నారు.
చూసేవాళ్లను అరెస్ట్
‘‘పైరసీని ఆపడానికి ఎవరైనా సీరియస్‌గా ఉంటే, నిజమైన పరిష్కారం ఒక్కటే ఉంది. సరఫరా చేసేవారిని (సప్లయర్‌ను) నేరస్థులుగా పరిగణించడంతో పాటు, చూసేవారిని (వ్యూయర్‌ను) కూడా నేరస్థులుగా పరిగణించాలి. ఎందుకంటే పైరేట్ రహస్య డిజిటల్ ప్రాంతాల వెనుక దాగి ఉంటాడు కాబట్టి అతన్ని పట్టుకోవడం కష్టం. కానీ చూసేవారిని పట్టుకోవడం సులభం’’ అని ఆర్జీవీ పోస్టు చేశారు.
‘‘పైరసీ కంటెంట్‌ను చూస్తున్న ఓ 100 మందిని అరెస్టు చేసి, వారి పేర్లను బహిరంగంగా ప్రకటించండి. అప్పుడు హఠాత్తుగా అందరూ సినిమా లింక్‌ను చూడటం లేదా ఫార్వార్డ్ చేయడం అనేది అక్రమ రవాణా లేదా దొంగతనం చేసిన వస్తువులను స్వీకరించడంతో సమానం అని గ్రహిస్తారు. ఇక్కడ భయం పనిచేస్తుంది. నైతికత పనిచేయదు’’ అని ఆర్జీవీ ఎండ్ చేశారు.