రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, కన్నడ స్టార్ యష్ రావణుడిగా నటిస్తున్న 'రామాయణం' టీజర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. నితేష్ తివారీ విజువల్ వండర్‌గా మలుస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే గతంలో 'రామాయణం' కథను పదే పదే వెండితెరపైకి తీసుకురావడాన్ని తప్పుబట్టిన సీనియర్ నటి దీపికా చిఖ్లియా.. టీజర్ చూసిన తర్వాత తన అభిప్రాయాన్ని మార్చుకుంది. 1980వ దశకంలో రామానంద్ సాగర్ రూపొందించిన ఐకానిక్ 'రామాయణ్' సీరియల్‌లో సీతమ్మ పాత్రతో ఇంటింటికీ చేరువైన దీపికా.. తాజా టీజర్‌పై సానుకూలంగా స్పందించింది.
టీజర్ చాలా 'రిచ్'గా ఉంది..

ఇండియా టుడేతో మాట్లాడిన దీపికా చిఖ్లియా.. రణ్‌బీర్ కపూర్ రామాయణ టీజర్‌లోని గ్రాండియర్‌ను మెచ్చుకున్నారు. "నేను టీజర్ చూశాను. అది చాలా అద్భుతంగా ఉంది. విజువల్స్ చాలా రిచ్‌గా కనిపిస్తున్నాయి. సినిమాను చాలా బాగా తీశారు. ఇప్పుడు నేను సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇది చాలా అందంగా ఉంది" అని ఆమె ప్రశంసించింది.
గతాన్ని మర్చిపోయి.. కొత్త అడుగు!
నిజానికి 2024 జూన్ నెలలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దీపికా భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. "రామాయణాన్ని పదే పదే తీయడం నాకు నచ్చడం లేదు. ప్రతిసారీ ఏదో ఒక కొత్త కోణం, కొత్త లుక్ అని చెప్పి అసలు కథను గందరగోళం చేస్తున్నారు" అని ఆమె అప్పట్లో అసహనం వ్యక్తం చేసింది.
గతంలో ఓం రౌత్ రూపొందించిన 'ఆదిపురుష్' చిత్రాన్ని కూడా ఆమె తీవ్రంగా విమర్శించింది. కానీ నితేష్ తివారీ విజన్ చూసిన తర్వాత ఆమె తన పాత వైఖరిని పక్కనపెట్టి చిత్ర బృందానికి మద్దతు తెలపడం విశేషం.
రామాయణ మూవీ విశేషాలు
ఈ 'రామాయణం' సినిమాను కేవలం సినిమాగా కాకుండా ఒక ఎమోషన్‌గా నితేష్ తివారీ మలుస్తున్నాడు. ఆస్కార్ విజేతలు 'DNEG' సంస్థ విజువల్ ఎఫెక్ట్స్ అందిస్తుండగా, లెజెండరీ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మెర్ ఈ చిత్రానికి బాణీలు సమకూరుస్తున్నారు.
టీజర్ లాంచ్ సమయంలో నితేష్ తివారీ మాట్లాడుతూ.. ఈ క్షణం కోసం తాను ఏడేళ్లుగా శ్రమిస్తున్నానని, ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని భావోద్వేగానికి గురయ్యారు. నిర్మాత నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ, "మనం రామాయణాన్ని ఎంచుకోము, రామాయణమే మనల్ని ఎంచుకుంటుంది" అని పేర్కొన్నారు.
{{/usCountry}}టీజర్ లాంచ్ సమయంలో నితేష్ తివారీ మాట్లాడుతూ.. ఈ క్షణం కోసం తాను ఏడేళ్లుగా శ్రమిస్తున్నానని, ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని భావోద్వేగానికి గురయ్యారు. నిర్మాత నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ, "మనం రామాయణాన్ని ఎంచుకోము, రామాయణమే మనల్ని ఎంచుకుంటుంది" అని పేర్కొన్నారు.
{{/usCountry}}ఈ భారీ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
1. దీపికా చిఖ్లియా ఎవరు?
దీపికా చిఖ్లియా 1987లో వచ్చిన రామానంద్ సాగర్ 'రామాయణ్' సీరియల్‌లో సీత పాత్రను పోషించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
2. కొత్త రామాయణం సినిమాలో ప్రధాన తారాగణం ఎవరు?
ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో కనిపిస్తారు.
3. ఈ సినిమాకు సంగీతం ఎవరు అందిస్తున్నారు?
ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మెర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.