...
...
Next Story

Ramayana Advance Sales: రామాయణం బాక్సాఫీస్ విధ్వంసం.. విడుదలకు ముందే రూ.100 కోట్ల రికార్డు ప్రీ సేల్స్.. బాహుబలి 2 సరసన!

Ramayana Advance Sales: నితీష్ తివారి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పౌరాణిక దృశ్యకావ్యం 'రామాయణ' రిలీజ్‌కు ముందే సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలకి ఇంకా రెండు రోజుల సమయం ఉండగానే, ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది.

Published on: Nov 3, 2026, 11:46:46 IST
Advertisement

Ramayana Advance Sales: భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ మహాకావ్యం 'రామాయణం' వెండితెరపై అద్భుతం సృష్టించేందుకు సిద్ధమైంది. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, కన్నడ స్టార్ యశ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు నితీష్ తివారి రూపొందించిన ఈ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్‌కు ఇంకా రెండు రోజుల సమయం ఉండగానే ఈ చిత్రం గ్లోబల్ ప్రీ-సేల్స్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది.

పెరిగిన బుకింగ్స్ జోరు

రామాయణం బాక్సాఫీస్ విధ్వంసం.. విడుదలకు ముందే రూ.100 కోట్ల రికార్డు ప్రీ సేల్స్.. బాహుబలి 2 సరసన! (x/WorldOfRamayana)
రామాయణం బాక్సాఫీస్ విధ్వంసం.. విడుదలకు ముందే రూ.100 కోట్ల రికార్డు ప్రీ సేల్స్.. బాహుబలి 2 సరసన! (x/WorldOfRamayana)

రామాయణం రిలీజ్ కు 15 రోజుల ముందే దసరా సందర్భంగా చిత్ర యూనిట్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించింది. అయితే డిస్ట్రిబ్యూటర్ ధర్మ ప్రొడక్షన్స్, థియేటర్ ఎగ్జిబిటర్ల మధ్య రెవెన్యూ షేరింగ్ చర్చల కారణంగా ప్రారంభంలో సింగిల్ స్క్రీన్లు అందుబాటులోకి రాలేదు. గత శుక్రవారం ఈ సమస్య పరిష్కారం కావడంతో ఒక్కసారిగా బుకింగ్స్ ఊపందుకున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా స్క్రీన్ల సంఖ్య 5000 దాటగా, గడచిన 24 గంటల్లోనే సుమారు 1500 స్క్రీన్లు పెరిగాయి.

భారత మార్కెట్‌లో ఇలా

ఇప్పటికే ఇండియాలో రామాయణం సినిమా రూ.58 కోట్ల ప్రీ-సేల్స్ నమోదు చేసింది. ఇందులో మొదటి రోజు గ్రాస్ వసూళ్లే రూ.27 కోట్లు కావడం విశేషం. కేవలం ఓపెనింగ్ డే మాత్రమే కాకుండా, వీకెండ్ మొత్తం భారీ డిమాండ్ నెలకొంది. శని, ఆదివారాల బుకింగ్స్ ఇప్పటికే రూ.25 కోట్ల వరకు చేరాయి. దేశవ్యాప్తంగా దాదాపు 15 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. కేవలం 4 శాతం స్క్రీన్లలో ఉన్న ఐమాక్స్ వంటి ప్రీమియం ఫార్మాట్లే మొత్తం అమ్మకాల్లో దాదాపు పావు వంతు వాటాను దక్కించుకోవడం విశేషం.

ఓవర్సీస్ కలెక్షన్ల వర్షం

విదేశాల్లోనూ రామాయణం మేనియా కొనసాగుతోంది. ఉత్తర అమెరికాలో నవంబర్ 4న ప్రీమియర్లు పడతాయి. తాజా సమాచారం ప్రకారం ఓవర్‌సీస్ మార్కెట్లలో ఇప్పటికే 5 మిలియన్ డాలర్లు (రూ.41 కోట్లకు పైగా) అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో వచ్చాయి. కేవలం యూఎస్ ప్రీమియర్ల నుంచే 1.5 మిలియన్ డాలర్లకు పైగా కలెక్ట్ అయ్యాయి.

ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజీ (DNEG), యశ్ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, రావణాసురుడిగా యశ్, లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. తొలి భాగం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా నవంబర్ 5న ఐమాక్స్ వెర్షన్‌లో విడుదలవుతుండగా, రెండవ భాగం 2027 దీపావళికి విడుదల కానుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks