...
...
Next Story

Yash Ravana: 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో రావణుడి సింహాసనం.. ఒక్క సీన్ కోసం రూ.1.5 కోట్ల రథం: రామాయణ ఆర్ట్ డైరెక్టర్

Yash Ravana: ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం 'రామాయణం' (Ramayana). రూ. 1600 కోట్ల భారీ నిర్మాణ వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ విజువల్ వండర్‌లో ప్రతి సన్నివేశం ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా డిజైన్ చేశారు. రావణుడి సింహాసనం, శూర్పనఖ రథం గురించి ఆర్ట్ డైరెక్టర్ షాకింగ్ విషయాలు వెల్లడించారు.

Published on: Nov 6, 2026, 13:56:31 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Yash Ravana: రామాయణ మూవీ పార్ట్-1 దాదాపు రూ. 1600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కి అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా ఇలాంటి పౌరాణిక కావ్యాల్లో విజువల్ ఎఫెక్ట్స్ (VFX), కంప్యూటర్ గ్రాఫిక్స్ (CGI) లపైనే ఎక్కువ ఖర్చు చేస్తారని అందరూ భావిస్తారు. కానీ ఈ సినిమాలో చూపించిన ప్రతి ప్రధాన వస్తువును ప్రత్యక్షంగా సెట్స్ పైనే భారీ ఖర్చుతో ప్రాక్టికల్‌గా రూపొందించడం విశేషం.

Yash Ravana: 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో రావణుడి సింహాసనం.. ఒక్క సీన్ కోసం రూ.1.5 కోట్ల రథం: రామాయణ ఆర్ట్ డైరెక్టర్
Yash Ravana: 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో రావణుడి సింహాసనం.. ఒక్క సీన్ కోసం రూ.1.5 కోట్ల రథం: రామాయణ ఆర్ట్ డైరెక్టర్

తాజాగా ఈ సినిమాకు పనిచేసిన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ రమేష్ అందాలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడూ కొన్ని నమ్మలేని నిజాలను బయటపెట్టారు. రావణాసురుడి బంగారు సింహాసనం, శూర్పణఖ రథం, పుష్పక విమానం వంటివి కేవలం గ్రాఫిక్స్ కాదని, వాస్తవంగా తయారుచేసిన మోడల్స్ అని స్పష్టం చేశారు.

రావణాసురుడి సింహాసనానికి కోటి.. నిజమైన 24K బంగారం వాడకం

రామాయణం కథలో కుబేరుడిని ఓడించి లంకను చేజిక్కించుకున్న తర్వాత రావణాసురుడు అత్యంత వైభవంగా సింహాసనాన్ని అధిష్ఠించే సన్నివేశం చాలా కీలకమైనది. ఈ సన్నివేశం కోసం ఆర్ట్ విభాగానికి చెందిన టీమ్ నాలుగు నెలల పాటు రాత్రింబవళ్లు శ్రమించింది.

ఆర్ట్ డైరెక్టర్ రమేష్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మొదట డిజైన్ ఆధారంగా పూర్తి సింహాసనాన్ని మట్టితో తయారు చేశారు. ఆ తర్వాత ఫైబర్ తో దానికి బలమైన రూపాన్ని ఇచ్చారు. సింహాసనానికి అపూర్వమైన రాజసం, మెరుపు తీసుకురావడానికి నిజమైన 24 క్యారెట్ల కరిగించిన బంగారాన్ని పూతగా ఉపయోగించారు.

ఈ ఒక్క సింహాసనం డిజైన్ చేసి పూర్తి చేయడానికి ఏకంగా రూ. 1 కోటి ఖర్చు అయింది. రాకింగ్ స్టార్ యశ్ గంభీరమైన లుక్‌కు తగ్గట్టుగా దీనిని తీర్చిదిద్దారు.

ఒక్క సీన్ కోసం రూ.1.5 కోట్లతో శూర్పణఖ రథం!

పంచవటి అడవిలో శ్రీరాముడు, లక్ష్మణులను చూడటానికి శూర్పణఖ వచ్చే సన్నివేశం సినిమాలో కేవలం ఒకే ఒక్క సీన్‌లో కనిపిస్తుంది. అయినా సరే దీని కోసం రూ. 1.5 కోట్ల భారీ బడ్జెట్‌ను వెచ్చించారు. బంగారు పూత పూసిన ఈ రథాన్ని ప్రాక్టికల్‌గా నడిచేలా, బ్యాలెన్స్ అయ్యేలా డిజైన్ చేయడానికి ఆర్ట్ టీమ్‌కు మూడు నెలల సమయం పట్టింది. విజువల్ గ్రాండియర్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని రమేష్ అందాలే తెలిపారు.

రామాయణం మూవీ విశేషాలు

నమిత్ మల్హోత్రాకి చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీనెగ్ (DNEG), రాకింగ్ స్టార్ యశ్ కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించారు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రంలో 'పార్ట్-1' ఈ నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాగా, 'పార్ట్-2'ను 2028 దీపావళి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

భారతీయ పౌరాణిక ఘట్టాలను అంతర్జాతీయ స్థాయిలో ఆవిష్కరించిన 'రామాయణం' సినిమా ప్రతి చిన్న డీటెయిలింగ్‌లోనూ సరికొత్త ప్రమాణాలను నెలకొల్పి, సినీ ప్రియులను అవాక్కయ్యేలా చేస్తోంది. మూవీకి పాజిటివ్ రివ్యూలు కూడా రావడంతో బాక్సాఫీస్ దగ్గర మేకర్స్ ఆశించిన స్థాయిలో వేల కోట్లు రాబడుతుందన్న అంచనాలు ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks