Ramayana Pakistan: రామాయణం ఇండియానే కాదు పాకిస్థాన్ ను కూడా ఊపేస్తోంది. దాయాది దేశంలో ఉన్న హిందువులు ఈ సినిమా రిలీజ్ ను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ నవంబర్ 5న దీపావళి సందర్భంగా థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా పట్ల కేవలం ఇండియా లేదా పాశ్చాత్య దేశాలలోనే కాదు, పొరుగున ఉన్న పాకిస్థాన్ లోనూ ఊహించని రీతిలో భారీ క్రేజ్ నెలకొంది. కరాచీలోని చరిత్రాత్మక శ్రీరామ ఆలయంలో డప్పు వాయిద్యాల నడుమ సినిమా పోస్టర్‌ను ప్రతిష్టించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
కరాచీ వీధుల్లో డప్పుల చప్పుడు.. 'మేరే ఘర్ రామ్ ఆయే' పాటలు
పాపులర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్ (Reddit)లో ప్రచారంలోకి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. పాకిస్తాన్‌లోని కరాచీ (Karachi) నగరానికి చెందిన హిందూ సమాజంలోని వాళ్లు రణబీర్ కపూర్ 'రామాయణ' సినిమా పోస్టర్లను చేతిలో పట్టుకుని కరాచీ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లారు.
ఆడపడుచులు, యువకులు డప్పు వాయిద్యాల నడుమ శోభాయాత్రగా సాగుతూ.. భక్తి పారవశ్యంతో "మేరే ఘర్ రామ్ ఆయే హై" (నా ఇంటికి రామయ్య వచ్చాడు) అనే దివ్యమైన పాటను పాడుతూ నృత్యాలు చేశారు. "జై శ్రీరామ్", "సియావర్ రామచంద్రకీ జై" అంటూ కరాచీ వీధుల్లో వారు చేసిన నినాదాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
రణబీర్ కపూర్‌కు ఆస్కార్ రావాలి
ఈ ఊరేగింపులో పాల్గొన్న ఒక పాకిస్తానీ మహిళ మాట్లాడుతూ.. "రణబీర్ కపూర్ మా అందరికీ ఎంతో ఇష్టమైన హీరో. ఆయన శ్రీరాముడి పాత్ర పోషించడం మాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. శ్రీరాముడి ఆశీస్సులు రణబీర్ పై ఎల్లప్పుడూ ఉండాలని, ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయాలని మేము కోరుకుంటున్నాం" అని హృదయపూర్వకంగా తెలిపారు.
{{/usCountry}}ఈ ఊరేగింపులో పాల్గొన్న ఒక పాకిస్తానీ మహిళ మాట్లాడుతూ.. "రణబీర్ కపూర్ మా అందరికీ ఎంతో ఇష్టమైన హీరో. ఆయన శ్రీరాముడి పాత్ర పోషించడం మాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. శ్రీరాముడి ఆశీస్సులు రణబీర్ పై ఎల్లప్పుడూ ఉండాలని, ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయాలని మేము కోరుకుంటున్నాం" అని హృదయపూర్వకంగా తెలిపారు.
{{/usCountry}}వీడియో చిత్రీకరించిన మరొక వ్యక్తి స్పందిస్తూ.. "ఈ 'రామాయణ' చిత్రం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద విజయం సాధించడమే కాకుండా, మన భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పి ఆస్కార్ (Oscar)ను కూడా గెలుచుకోవాలి" అని ఆకాంక్షించారు.
చారిత్రక కరాచీ మందిరంలో 'రామాయణ' పోస్టర్
వీధుల్లో ఊరేగింపు అనంతరం భక్తులంతా కరాచీలోని చరిత్రాత్మక శ్రీరామ మందిరానికి చేరుకుని, డప్పు వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో సినిమా పోస్టర్‌ను ప్రతిష్టించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి మాట్లాడుతూ.. "ఈ దీపావళికి విడుదలవుతున్న 'రామాయణం' సినిమాను మేమంతా ఎంతో ఆసక్తిగా చూడబోతున్నాం. రామాయణంలో రాముడు చూపిన ధర్మ మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలి. ఇంతటి అద్భుతమైన చిత్రాన్ని నిర్మించిన నమిత్ మల్హోత్రా, నితేష్ తివారీలకు, రణబీర్ కపూర్‌కు పాకిస్థాన్ హిందువుల తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం" అని అన్నారు.
రూ. 4000 కోట్ల బడ్జెట్.. నవంబర్ 5న గ్రాండ్ రిలీజ్
భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌గా చెబుతూ ఏకంగా రూ. 4000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మితమైన ఈ సినిమాను నమిత్ మల్హోత్రా, కేజీఎఫ్ స్టార్ యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సన్నీ డియోల్ (హనుమంతుడు), రవి దూబే (లక్ష్మణుడు) కీలక పాత్రలు పోషిస్తున్న ఈ విజువల్ వండర్ పార్ట్-1 రాబోయే నవంబర్ 5న (దీపావళి కానుకగా) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇక రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.