Ramayana: ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న 'రామాయణం'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రణబీర్ కపూర్ (రాముడు), సాయి పల్లవి (సీత), యష్ (రావణుడు) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు నితీష్ తివారీ ఎలా ఆవిష్కరించబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన నితీష్.. రావణుడి పాత్ర చిత్రణపై సంచలన విషయాలను పంచుకున్నాడు. రావణుడిని కేవలం ఒక విలన్ గానే కాకుండా, అతనిలోని భిన్న కోణాలను ప్రపంచానికి చూపించబోతున్నట్లు అతడు స్పష్టం చేశాడు.
రావణుడు యోధుడు, పండితుడు

రావణుడిని ఒక సాధారణ విలన్ తరహాలో కాకుండా, అతని మేధస్సును, భక్తిని చూపిస్తారా? అని అడిగిన ప్రశ్నకు నితీష్ ఆసక్తికరంగా స్పందించాడు. "రావణుడి జీవితంలో చాలా కోణాలు ఉన్నాయి. అతను గొప్ప యోధుడు, నిష్ణాతుడైన సంగీత విద్వాంసుడు, గొప్ప పండితుడు. తన ప్రజలను ప్రేమించే రాజు. వీటన్నింటికీ మించి అతను పరమ శివభక్తుడు. రావణుడు అంటే కేవలం ఒక విలన్ మాత్రమే కాదు.. అంతకు మించి చాలా ఉంది," అని నితీష్ పేర్కొన్నాడు.
అహంకారం ఉంటే పతనం తప్పదు: ఒక గొప్ప పాఠం
రామాయణ మూవీలో రావణుడిలోని ఇన్ని మంచి లక్షణాలను చూపించడంలో ఒక బలమైన ఉద్దేశం ఉందని దర్శకుడు వివరించాడు. "ఒక మనిషిలో ఎన్ని గొప్ప గుణాలు ఉన్నా, ఎంతటి జ్ఞానం ఉన్నా.. ఒకవేళ అతను పగ, అహంకారంతో నిర్ణయాలు తీసుకుంటే ఫలితం ఎలా ఉంటుందో చూపించడమే ఈ సినిమాలోని ప్రధాన పాఠం. ఆ పాఠం రావణుడి పాత్ర ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది" అని అతడు చెప్పుకొచ్చాడు.
కేవలం విజువల్స్ మాత్రమే కాదు, భావోద్వేగాలే ఈ సినిమాకు ప్రాణం అని, అయోధ్య, లంకను ఇదివరకు ఎవరూ చూడని రీతిలో భారీ స్థాయిలో వెండితెరపై ఆవిష్కరిస్తామని అతడు హామీ ఇచ్చాడు.
ఏడేళ్ల కష్టం.. హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ
ఈ సినిమా టీజర్ లాంచ్ సందర్భంగా నిర్మాత నమిత్ మల్హోత్రా భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి తనకు ఏడేళ్లు పట్టిందని అతడు తెలిపాడు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, DNEG, యష్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత హ్యాన్స్ జిమ్మెర్, ఏఆర్ రెహమాన్ కలిసి సంగీతం అందిస్తుండటం విశేషం.
{{/usCountry}}ఈ సినిమా టీజర్ లాంచ్ సందర్భంగా నిర్మాత నమిత్ మల్హోత్రా భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి తనకు ఏడేళ్లు పట్టిందని అతడు తెలిపాడు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, DNEG, యష్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత హ్యాన్స్ జిమ్మెర్, ఏఆర్ రెహమాన్ కలిసి సంగీతం అందిస్తుండటం విశేషం.
{{/usCountry}}రామాయణం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. రామాయణం సినిమాలో రావణుడి పాత్రను ఎవరు పోషిస్తున్నారు?
కన్నడ స్టార్ హీరో యష్ ఈ చిత్రంలో రావణుడి పాత్రను పోషిస్తున్నారు.
2. నితీష్ తివారీ రామాయణం ఎన్ని భాగాలుగా విడుదల అవుతుంది?
ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగం 2026లో, రెండో భాగం 2027లో ప్రేక్షకుల ముందుకు వస్తాయి.
3. ఈ సినిమాకు సంగీతం ఎవరు అందిస్తున్నారు?
ప్రముఖ అంతర్జాతీయ సంగీత దర్శకుడు హ్యాన్స్ జిమ్మెర్, భారతీయ దిగ్గజం ఏఆర్ రెహమాన్ ఈ సినిమా కోసం కలిసి పనిచేస్తున్నారు.
4. ఈ సినిమాలో రాముడు, సీత పాత్రల్లో ఎవరు నటిస్తున్నారు?
రణబీర్ కపూర్ రాముడి పాత్రలో, సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్నారు.