Ramayana First Review: భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన విజువల్ వండర్ 'రామాయణం: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్'. తాజాగా లాస్ ఏంజిల్స్ లో ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ వరల్డ్ ప్రీమియర్ ఘనంగా జరిగింది. ఈ షో చూసిన ఒక అంతర్జాతీయ క్రిటిక్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు.
మైండ్ బ్లాక్

2001లో వచ్చిన హాలీవుడ్ ఎపిక్ 'ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్' చూసినప్పుడు తనకు ఎలాంటి అద్భుతమైన అనుభూతి కలిగిందో.. ఇప్పుడు 'రామాయణం' చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ కలిగిందని ఆ క్రిటిక్ చెప్పాడు. రాముడి పాత్రను చూపించిన విధానం అద్భుతమని కొనియాడాడు. ఇక పార్ట్ 2కు లీడ్ ఇస్తూ వచ్చే ముగింపు సీన్ అయితే మైండ్ బ్లాక్ అయ్యేలా ఉందని, స్క్రీన్ బ్లాక్ అవ్వగానే తాను ఆశ్చర్యంతో గట్టిగా అరిచేశానని తెలిపాడు.
యశ్ అదుర్స్
నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. రావణాసురుడిగా కేజీఎఫ్ స్టార్ యశ్ విశ్వరూపం చూపించాడనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా యశ్ ఇంట్రడక్షన్ సీన్స్ సినిమాకే అతిపెద్ద హైలైట్ గా నిలిచాయి. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అయితే ఆయా పాత్రల్లో ఉండాల్సిన దైవత్వం, ఎమోషనల్ కనెక్ట్ కొన్ని చోట్ల తెరపై పూర్తిగా పండలేదని కూడా అంటున్నారు. సన్నీ డియోల్, అరుణ్ గోవిల్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
విజువల్స్ గ్రాండ్
సినిమాను చాలా గ్రాండ్ స్కేల్లో తెరకెక్కించారు. మేకర్స్ పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. అయితే రామాయణం మూల కథకు కట్టుబడి ఉన్నప్పటికీ.. డ్రామా, ఎమోషన్స్ కంటే కూడా యాక్షన్, విజువల్స్ పైనే దర్శకుడు నితీష్ తివారీ ఎక్కువ దృష్టి పెట్టాడు. దీనివల్ల కొన్ని సన్నివేశాలు టీవీ సీరియల్ తరహాలో ఫ్లాట్ గా సాగుతాయని అంటున్నారు.
{{/usCountry}}సినిమాను చాలా గ్రాండ్ స్కేల్లో తెరకెక్కించారు. మేకర్స్ పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. అయితే రామాయణం మూల కథకు కట్టుబడి ఉన్నప్పటికీ.. డ్రామా, ఎమోషన్స్ కంటే కూడా యాక్షన్, విజువల్స్ పైనే దర్శకుడు నితీష్ తివారీ ఎక్కువ దృష్టి పెట్టాడు. దీనివల్ల కొన్ని సన్నివేశాలు టీవీ సీరియల్ తరహాలో ఫ్లాట్ గా సాగుతాయని అంటున్నారు.
{{/usCountry}}విజువల్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ కొన్ని చోట్ల గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్ స్పష్టంగా తెలిసిపోతున్నాయి. ఇక రాక్షసుల డిజైన్ కాస్త కార్టూన్ లా అనిపించడం మైనస్ గా మారిందని టాక్.
మ్యూజిక్ అతిపెద్ద మైనస్
రామాయణం సినిమాకు అతిపెద్ద మైనస్ పాయింట్ మ్యూజిక్. రామాయణం లాంటి పౌరాణిక చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోయాలి. కానీ ఇందులో ఇండియన్, హాలీవుడ్ స్టైల్స్ మిక్స్ చేయడం వల్ల మ్యూజిక్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అలాగే పార్ట్ 1 ను ఎక్కడ ముగించాలనే నిర్ణయం వల్ల సెకండాఫ్ లో సాగదీత ఎక్కువైందని నెటిజన్లు ఫీల్ అవుతున్నారు.
ఫైనల్ గా
మొత్తం మీద రామాయణం సినిమా కోసం మేకర్స్ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవలి కాలంలో వచ్చిన పౌరాణిక చిత్రాల కంటే ఇది చాలా బెటర్. కానీ రామాయణంపై ఉన్న భారీ అంచనాలను మాత్రం పూర్తిగా అందుకోలేకపోయిందని మూవీ చూసిన నెటిజన్లు రివ్యూలు ఇస్తున్నారు.
కంటెంట్ పరంగా ఒక 'మిక్స్‌డ్ బ్యాగ్' లాంటి ఫీలింగ్ ఇస్తుందని అంటున్నారు. నమిత్ మల్హోత్రా, యశ్ సంయుక్తంగా నిర్మించిన ఈ రామాయణం చిత్రం నవంబర్ 5, 2026న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.