Ramayana: ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ అవైటెడ్, ప్రెస్టీజియస్ విజువల్ వండర్ 'రామాయణం' గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, కేజీఎఫ్ ఫేమ్ రాకింగ్ స్టార్ యశ్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కాంబినేషన్‌లో డైరెక్టర్ నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ మైథలాజికల్ ఎపిక్ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 59,000 స్క్రీన్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటివరకు ఏ భారతీయ సినిమాకు సాధ్యం కాని రీతిలో ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ దిగ్గజం సోనీ పిక్చర్స్ (Sony Pictures) ఈ సినిమాను గ్లోబల్ వైడ్‌గా భారీ స్థాయిలో థియేటర్లలోకి తీసుకురాబోతోంది.
పుష్ప 2, ఆర్‌ఆర్ఆర్‌లను దాటేసి.. హాలీవుడ్ బెంచ్ మార్క్ నమోదు
ఇండియాలో దాదాపు 9,000 స్క్రీన్లలో ప్రదర్శించనుండగా, విదేశాల్లో ఏకంగా 50,000కు పైగా స్క్రీన్లలో 'రామాయణం పార్ట్ 1' సందడి చేయనుంది. గతంలో ఆల్ టైమ్ రికార్డులు నెలకొల్పిన 'పుష్ప 2' (13,000 స్క్రీన్స్), 'ఆర్‌ఆర్ఆర్' (11,000 స్క్రీన్స్) చిత్రాల గ్లోబల్ థియేట్రికల్ కౌంట్‌ను ఇది ఈజీగా దాటేయనుంది.
అంతేకాకుండా హాలీవుడ్ విజువల్ వండర్ జేమ్స్ కామెరాన్ 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' (52,000 స్క్రీన్స్) రికార్డును సైతం తిరగరాస్తూ ప్రపంచంలోనే అత్యధిక స్క్రీన్లలో విడుదలయ్యే బిగ్గెస్ట్ మూవీగా 'రామాయణం' నిలవబోతుండటం గమనార్హం. ఐమాక్స్ (IMAX) ప్రీమియం వెర్షన్లలో కూడా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.
5 రోజుల్లోనే 100 కోట్ల వ్యూస్.. ట్రైలర్ సృష్టించిన సంచలనం
ఈ సినిమా ప్రమోషన్ల విషయంలో మేకర్స్ అనుసరిస్తున్న స్ట్రాటజీ మైండ్ బ్లాకింగ్ అనిపిస్తోంది. బ్రహ్మ ముహూర్తంలో రిలీజ్ చేసిన రామాయణం టీజర్ అండ్ ప్రమోషనల్ ట్రైలర్ హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు ఇంగ్లీష్ వెర్షన్‌లో కేవలం 5 రోజుల్లోనే 1 బిలియన్ (100 కోట్లు) క్యుములేటివ్ వ్యూస్ సాధించి వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది.
ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా అధికారికంగా వెల్లడిస్తూ, భారతీయ సంస్కృతిని, ఈ ఇతిహాసాన్ని గ్లోబల్ ఆడియన్స్‌కి బెస్ట్ క్వాలిటీతో అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
4,000 కోట్ల బడ్జెట్.. హాలీవుడ్ లెజెండ్స్ ఆస్కార్ కాంబో
{{/usCountry}}ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా అధికారికంగా వెల్లడిస్తూ, భారతీయ సంస్కృతిని, ఈ ఇతిహాసాన్ని గ్లోబల్ ఆడియన్స్‌కి బెస్ట్ క్వాలిటీతో అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
4,000 కోట్ల బడ్జెట్.. హాలీవుడ్ లెజెండ్స్ ఆస్కార్ కాంబో
{{/usCountry}}దాదాపు రూ.4,000 కోట్ల బ్రహ్మాండమైన బడ్జెట్‌తో నమిత్ మల్హోత్రాకి చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, యశ్ కి చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి హాలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ హన్స్ జిమ్మర్ (Hans Zimmer), ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ (A.R. Rahman) కలిసి మొదటిసారి సంగీతం అందిస్తుండటం విశేషం.
రణ్‌బీర్ కపూర్ రాముడిగాను, సాయి పల్లవి సీతగాను, రాకింగ్ స్టార్ యశ్ రావణాసురుడిగాను నటిస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో సన్నీ డియోల్ (హనుమంతుడు), రవి దూబే (లక్ష్మణుడు), లారా దత్తా (కైకేయి), అరుణ్ గోవిల్ (దశరథుడు), కాజల్ అగర్వాల్ (మండోదరి), రకుల్ ప్రీత్ సింగ్ (శూర్పణఖ) లాంటి భారీ తారాగణం అలరించనుంది.
దీపావళి కానుకగా నవంబర్ 6న బాక్సాఫీస్ సునామీ
'రామాయణం: పార్ట్ 1' ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 6, 2026న దీపావళి పండుగ కానుకగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇప్పటికే మొదటి భాగానికి సంబంధించిన మేజర్ షూటింగ్ పూర్తవుతుండగా, రెండవ భాగాన్ని (Ramayana: Part 2) దీపావళి 2027లో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఈ విజువల్ వండర్ ఇండియన్ సినిమా రూపురేఖలను గ్లోబల్ లెవెల్‌లో మార్చడం ఖాయంగా కనిపిస్తోంది.