Ramayana Collections: ప్రభాష్ ఆదిపురుష్ ను దాటేసిన రామాయణం పార్ట్ 1.. రెండు రోజుల్లోనే రికార్డు కలెక్షన్లు.. అదే కారణం!
Ramayana Collections: భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన రామాయణం పార్ట్ 1 మూవీ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. గురువారం రిలీజైన ఈ సినిమా వసూళ్ల ప్రభంజనంతో సాగిపోతుంది. ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ మూవీ కలెక్షన్లను రామాయణం చిత్రం క్రాస్ చేసేసేంది.
Ramayana Collections: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణం పార్ట్ 1'. నవంబర్ 5వ తేదీన భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కానీ కలెక్షన్ల విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.

ఫస్ట్ డే కలెక్షన్స్‌లో
రామాయణం పార్ట్ 1 ఫస్ట్ డే కలెక్షన్లు చూస్తే.. ప్రభాస్ హీరోగా వచ్చిన 'ఆదిపురుష్' సినిమాదే పైచేయి అని చెప్పాలి. 'ఆదిపురుష్' తొలిరోజు రూ.128 కోట్లు రాబట్టగా.. 'రామాయణం' రూ.127.50 కోట్లతో సరిపెట్టుకుంది. రామాయణం సినిమా అత్యధిక థియేటర్లలో (భారతదేశంలో 23,316 షోలు) విడుదలైనప్పటికీ మొదటి రోజు ఆదిపురుష్ రికార్డును మాత్రం బ్రేక్ చేయలేకపోయింది.
రెండో రోజు రికార్డ్ బ్రేక్!
ఇండియాలో మొదటిరోజు రూ.64.85 కోట్లు నెట్ కలెక్ట్ చేసిన రామాయణం పార్ట్ 1 చిత్రం, రెండో రోజు కాస్త తగ్గి రూ.48.05 కోట్లకు పడిపోయింది. కానీ ఓవర్సీస్లో మాత్రం సత్తా చాటింది. సాక్నిల్క్ నివేదిక ప్రకారం, రెండో రోజు ఓవర్సీస్లో రూ.35 కోట్లు వసూలు చేయడంతో ఓవర్సీస్ టోటల్ కలెక్షన్లు రూ.86.25 కోట్లకు చేరుకున్నాయి.
ఇక రెండు రోజులకు గానూ ఇండియాలో రూ.134.80 కోట్లు రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 'రామాయణం' రెండు రోజుల గ్రాస్ రూ.221.05 కోట్లకు చేరుకుని ప్రభాస్ 'ఆదిపురుష్' (రూ.215.78 కోట్లు) రికార్డును క్రాస్ చేసింది.
యానిమల్, ధురంధర్ ఇలా
ఇక ఇతర బాలీవుడ్ భారీ సినిమాలతో పోలిస్తే మాత్రం 'రామాయణం' కాస్త వెనుకబడి ఉందనే చెప్పాలి. రణ్వీర్ సింగ్ నటించిన 'ధురంధర్: ది రివెంజ్' (Dhurandhar: The Revenge) రెండు రోజుల్లో రూ. 358.86 కోట్లు వసూలు చేయగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ నటించిన గత చిత్రం 'యానిమల్' రెండు రోజుల్లో రూ. 236.01 కోట్లు కొల్లగొట్టింది.
అదే కారణం
రామాయణం పార్ట్ 1 మూవీ ఆదిపురుష్ కలెక్షన్లను క్రాస్ చేయడానికి జనాలు మౌత్ టాక్ ప్రధాన కారణం. ఆదిపురుష్ రిలీజైన తర్వాత ఆ మూవీపై విపరీతమైన నెగెటివ్ టాక్ వచ్చింది. మూవీలో యూజ్ చేసిన వీఎఫ్ఎక్స్, రావణాసురుడిని చూపించిన తీరు పట్ల ఆడియన్స్ విమర్శలు చేశారు.
అదే రామాయణం మూవీ విషయానికి వస్తే ఆడియన్స్ మౌత్ టాక్ పాజిటివ్ గా మారింది. మూవీలో కొన్ని విషయాలపై ట్రోల్స్ వచ్చినా, స్లో స్క్రీన్ ప్లే అని కౌంటర్లు వేస్తున్నా కూడా ఓవరాల్ రామాయణంపై మంచి టాక్ బిల్డ్ అయింది. ఇక దీపావళి వీకెండ్ కావడంతో శని, ఆదివారాలు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


