Ramayana Collections: దంగల్ రికార్డును రామాయణం బ్రేక్ చేస్తుందా? 12 రోజుల్లోనే రూ.1437 కోట్లు.. చైనాలో రిలీజ్!
Ramayana Collections: నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ 'రామాయణ: పార్ట్ 1' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మొదటి 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,437 కోట్లు రాబట్టింది. 'దంగల్' రికార్డును బద్దలు కొట్టాలంటే మాత్రం ఈ సినిమాకు చైనా మార్కెట్ అత్యంత కీలకం కానుంది.
Ramayana Collections: బాలీవుడ్ స్టార్ దర్శకుడు నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'రామాయణం: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’ భారతీయ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. ట్రేడ్ నివేదికల ప్రకారం, ఈ సినిమా మొదటి 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. ,437.25 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. ఇందులో భారతదేశం నుంచి వచ్చిన గ్రాస్ రూ. 947.25 కోట్లు కాగా, ఓవర్సీస్ మార్కెట్ నుంచి రూ. 490 కోట్లు వసూలయ్యాయి.

సోమవారం డ్రాప్
సెకండ్ వీకెండ్ లోనూ అద్భుతమైన కలెక్షన్లు సాధించిన రామాయణం చిత్రం 12వ రోజు (సోమవారం) కాస్త నెమ్మదించింది. ఆదివారం రూ.75 కోట్లు రాబట్టిన ఈ మూవీ.. సోమవారం 57.3% డ్రాప్‌తో ఇండియాలో రూ.32 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఓవరాల్ గా హిందీ వెర్షన్ దే పైచేయి. సోమవారం వసూళ్లలో హిందీ రూ.23.75 కోట్లు, మలయాళం రూ.2.85 కోట్లు, కన్నడ రూ.2 కోట్లు, తమిళం రూ.1.90 కోట్లు, తెలుగు రూ.1.50 కోట్లు రాబట్టాయి.
మంగళవారం నాటి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా సుమారు రూ.9.95 కోట్లు (5.30 లక్షల టిక్కెట్లు)గా నమోదయ్యాయి. బుకింగ్స్ లో 2D ఫార్మాట్ (రూ.4.81 కోట్లు) కంటే 3D వెర్షన్ (రూ.7.38 కోట్లు) కే ప్రేక్షకులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
టార్గెట్ ‘దంగల్’
'రామాయణం' సినిమా ఇన్ని కోట్లు వసూలు చేసినప్పటికీ, నితీష్ తివారీ 2016లో తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ 'దంగల్' (రూ.2,070.30 కోట్లు) రికార్డును ఇంకా అందుకోలేకపోయింది. దంగల్ రికార్డుకు రామాయణం ఇంకా రూ.633 కోట్ల దూరంలో ఉంది. ఆ మార్క్ ను చేరుకోవాలంటే ప్రధానంగా చైనా మార్కెట్ పైనే ఆశలు పెట్టుకోవాలి.
ఎందుకంటే చైనాలో 'దంగల్' ఏకంగా రూ.1,305.29 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం చైనా సెన్సార్ బోర్డు అనుమతి కోసం 'రామాయణం' సినిమాను పంపించారు. అన్నీ సవ్యంగా జరిగితే 2027 జనవరి - మార్చి మధ్యలో చైనాతో పాటు జపాన్, రష్యా, దక్షిణ కొరియా దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
చైనాలో సెన్సార్ కష్టాలు
చైనాలో రామాయణం సినిమాను విడుదల చేయడం అంత సులభం కాదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అక్కడి నిబంధనలకు అనుగుణంగా మార్చేందుకు ఈ సినిమా రన్ టైమ్ లో ఏకంగా 33 నిమిషాలు కట్ చేయనున్నట్లు సమాచారం. అలాగే చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'వీబో'లో ఈ సినిమాను 'రామాయణ: ది లెజెండ్ ఆఫ్ ది ప్రిన్స్' అనే పేరుతో ప్రమోట్ చేస్తున్నారు. వాస్తవానికి 2020 గాల్వాన్ లోయ ఘర్షణల తర్వాత చైనాలో హిందీ సినిమాల ప్రభావం బాగా తగ్గింది. ఇది కూడా ‘రామాయణం’మూవీకి ఒక పెద్ద సవాల్ అనే చెప్పాలి.
చైనాలో వర్కౌట్ అవుతుందా?
దంగల్ చిత్రానికి దర్శకత్వం వహించిన నితీష్ తివారీ బ్రాండ్ నేమ్ తోనే చైనాలో 'రామాయణం' సినిమాను భారీ స్థాయిలో మార్కెటింగ్ చేస్తున్నారు. చైనాలో దంగల్ చిత్రం 10,000 స్క్రీన్లలో విడుదల కాగా, ‘రామాయణం’ మూవీని రికార్డు స్థాయిలో 20 వేల నుంచి 25 వేల స్క్రీన్లలో ప్రదర్శించేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఫోగట్ ఫ్యామిలీలోని ఎమోషనల్ జర్నీ చైనీయులకు బాగా కనెక్ట్ అయింది. మరి మన పురాణాలైన రామాయణం, అందులోని రాముడు, సీత, రావణాసురుడు కథ చైనా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


