Ramayana Trailer 2: ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మైథలాజికల్ ప్రాజెక్ట్ 'రామాయణం' (Ramayana) నుంచి మేకర్స్ మోస్ట్ అవేటెడ్ సెకండ్ ట్రైలర్‌ను గురువారం (అక్టోబర్ 15) విడుదల చేశారు. దంగల్ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలను అందించిన ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ (Nitesh Tiwari) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉండగా, తాజాగా విడుదలైన ఈ రెండో ట్రైలర్ సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. విజువల్ వండర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంపై టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సర్వత్ర భారీ చర్చ జరుగుతోంది.
రాముడిగా రణ్‌బీర్.. రావణుడిగా యశ్ భీకర పోరు
రామాయణ కొత్త ట్రైలర్ ప్రారంభంలోనే ఒక లోతైన వాయిస్‌తో మనుషుల భూమిపై దేవుళ్ల సంచారం, బ్రహ్మ వరంతో అత్యంత శక్తిమంతుడైన ఒక అసురుడి ప్రకోపం గురించి చెబుతుండగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గూస్బంప్స్ తెప్పిస్తుంది. ఆ వెంటనే లంకేశ్వరుడిగా రాకింగ్ స్టార్ యశ్ మాస్ ఎంట్రీ ఉంటుంది. మూడూ లోకాలను శాసించాలనే రాక్షస తలంపుతో ఆయన చెప్పే డైలాగులు సినిమాపై క్యూరియాసిటిని విపరీతంగా పెంచేశాయి.
అసురుల అణచివేతకు, ధర్మ సంస్థాపన కోసం శ్రీమహావిష్ణువు మానవ రూపంలో మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడిగా అవతరించిన ఘట్టంతో ట్రైలర్ మరింత ఊపందుకుంటుంది. రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ అద్భుతమైన అభినయంతో ఆకట్టుకున్నారు. "ఒకవేళ ఇదే నా విధి రాత అయితే, ముూడు లోకాల సాక్షిగా ఆ రావణుడిని వధిస్తాను" అంటూ రాముడు చెప్పే డైలాగ్ సినిమాకు హైలైట్‌గా నిలవనుంది. రణ్‌బీర్, యశ్ మధ్య వచ్చే సన్నివేశాలు థియేటర్లలో ఓ రేంజ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం ఖాయం.
ఈ రామాయణ మూవీలో సీతాదేవిగా సాయి పల్లవి (Sai Pallavi) నటిస్తుండగా, లక్ష్మణుడిగా రవి దూబె, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. వీరితో పాటు లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, అరుణ్ గోవిల్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఆస్కార్ స్థాయి టెక్నికల్ వాల్యూస్
{{/usCountry}}ఈ రామాయణ మూవీలో సీతాదేవిగా సాయి పల్లవి (Sai Pallavi) నటిస్తుండగా, లక్ష్మణుడిగా రవి దూబె, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. వీరితో పాటు లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, అరుణ్ గోవిల్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఆస్కార్ స్థాయి టెక్నికల్ వాల్యూస్
{{/usCountry}}ఈ రామాయణ సినిమాకి సంబంధించిన మరో పెద్ద విశేషం దీని మ్యూజిక్, వీఎఫ్ఎక్స్ వర్క్. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ (A.R. Rahman), హాలీవుడ్ లెజెండ్ హన్స్ జిమ్మర్ (Hans Zimmer) తొలిసారిగా ఈ ప్రాజెక్ట్ కోసం కలిసి పనిచేస్తున్నారు. వీరిద్దరి మ్యూజిక్ ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. అలాగే ప్రపంచ ప్రఖ్యాత 'డీఎన్ఈజీ' (DNEG) సంస్థ వీఎఫ్ఎక్స్ బాధ్యతలు నిర్వర్తించగా, నమిత్ మల్హోత్రా ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
మొదట ఈ పాత్ర చేయడానికి రణ్‌బీర్ కపూర్ కాస్త సంకోచించినప్పటికీ, కూతురు రాహా జన్మించిన తర్వాత తన ఆలోచన మారి ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గతంలో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఈ దృశ్యకావ్యం ఈసారి దీపావళికి మొదటి భాగం రూపంలో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. నవంబర్ 5న మూవీ రానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. దీనికి సీక్వెల్‌గా వచ్చే రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది.