Ramayana Shankha: అమెరికాలో రామాయణ ట్రైలర్ లాంచ్- గిఫ్ట్‌గా బంగారు దివ్య శంఖం- దాని వెనుకున్న అసలు రహస్యం ఏంటంటే?

Ramayana Movie Team Gifts Gold Shankha: రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణ' ప్రమోషన్స్ అంతర్జాతీయ స్థాయిలో హోరెత్తుతోంది. శాన్ డియాగో కామిక్-కాన్ 2026 వేదికగా విదేశీ వీక్షకులకు మూవీ టీమ్ అందించిన ఒక దివ్యమైన బహుమతి వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

Published on: Jul 27, 2026, 11:24:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ramayana Movie Team Gifts Gold Shankha: భారతీయ చలనచిత్ర రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ రూపుదిద్దుతున్న పౌరాణిక దృశ్యకావ్యం 'రామాయణం'. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా అపారమైన అంచనాలు నెలకొన్నాయి.

అమెరికాలో రామాయణ ట్రైలర్ లాంచ్- గిఫ్ట్‌గా బంగారు దివ్య శంఖం- దాని వెనుకున్న అసలు రహస్యం ఏంటంటే?
అమెరికాలో రామాయణ ట్రైలర్ లాంచ్- గిఫ్ట్‌గా బంగారు దివ్య శంఖం- దాని వెనుకున్న అసలు రహస్యం ఏంటంటే?

అరుదైన బహుమతి

ఇటీవల అమెరికాలోని శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC) 2026 వేదికగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రత్యేకాంశాలను అంతర్జాతీయ ప్రేక్షకులకు ప్రదర్శించారు. ఈ ఈవెంట్‌కు హాజరైన విదేశీ వీక్షకులకు చిత్రబృందం ఒక అరుదైన బహుమతిని ఇచ్చి ఆశ్చర్యపరిచింది.

వైరల్ అవుతున్న శంఖం అన్‌బాక్సింగ్ వీడియో

ఈవెంట్‌కు వచ్చిన ఒక అంతర్జాతీయ అభిమాని తనకు అందిన గిఫ్ట్ బాక్స్‌ను తెరిచి చూపుతూ తీసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. గులాబీ రంగులో, తామర పువ్వు ఆకృతితో శోభాయమానంగా ఉన్న ఆ పెట్టెలో బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఒక దివ్య శంఖం కనిపిస్తుంది. దానితో పాటు చిత్ర నిర్మాణ సంస్థ అందించిన ఒక ప్రత్యేక సందేశపత్రం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.

"ధర్మానికి ప్రతీకగా నిలిచే ఈ శంఖం భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. మనలోని శక్తిని సమతుల్యం చేస్తూ విశ్వాంతరాళాలలో ప్రతిధ్వనించే నాదం ద్వారా నూతన శకానికి నాంది పలుకుతుంది" అని ఆ లేఖలో పేర్కొన్నారు.

హాలీవుడ్ స్థాయిలో ప్రచారం.. ట్రైలర్ విడుదల ఎప్పుడు?

హాలీవుడ్ దిగ్గజ సంస్థ 'సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్' భాగస్వామ్యంతో రామాయణ సినిమాను అంతర్జాతీయ హాలీవుడ్ చిత్రాల స్థాయిలో విడుదల చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న విద్యార్థుల నిరసనల కారణంగా భారత్‌లో రామాయణ ట్రైలర్ విడుదలను తాత్కాలికంగా వాయిదా వేశామని ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రా తెలిపారు.

త్వరలోనే రామాయణ ట్రైలర్ రిలీజ్ కొత్త తేదీని ప్రపంచవ్యాప్తంగా ప్రకటిస్తామన్నారు. "భారతీయ సినిమా శతాబ్దాల చరిత్రలో ఇది ఎంతో గర్వించదగిన ఘట్టం. మన ప్రాచీన సంస్కృతిని, రామాయణ పరమార్థాన్ని అంతర్జాతీయ వేదికలపైకి తీసుకువెళ్లాలనే కల నెరవేరుతోంది" అని నమిత్ మల్హోత్రా వెల్లడించారు.

ఎవరెవరు ఏ పాత్రలు

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యశ్ రావణాసురుడిగా కనిపిస్తారన్న విషయం తెలిసిందే. వీరితోపాటు హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే, మండోదరిగా కాజల్ అగర్వాల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. అరుణ్ గోవిల్, కునాల్ కపూర్, కునాల్ కోఠారే, షీబా చద్దా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

దీపావళికే విడుదలలు

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'రామాయణ: పార్ట్ 1' ఈ ఏడాది దీపావళి కానుకగా (దివాళీ 2026) థియేటర్లలో విడుదల కానుంది. ఇక రెండవ భాగం 'రామాయణ: పార్ట్ 2' వచ్చే ఏడాది దివాళీ 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'రామాయణ' సినిమాలో శ్రీరాముడు, సీతాదేవి పాత్రల్లో ఎవరు నటిస్తున్నారు?

శ్రీరాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతాదేవి పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు.

2. 'రామాయణ' మొదటి భాగం ఎప్పుడు విడుదల కానుంది?

'రామాయణ: పార్ట్ 1' ఈ ఏడాది 2026 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

3. శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC)లో వీక్షకులకు ఎలాంటి బహుమతి ఇచ్చారు?

భారతీయ సంస్కృతికి, ధర్మానికి ప్రతీకగా నిలిచే బంగారు వర్ణపు శంఖాన్ని ప్రేక్షకులకు బహుమతిగా ఇచ్చారు.

4. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది ఎవరు?

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More