Ramayana Pakistan: బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, రాకింగ్ స్టార్ యశ్ కాంబినేషన్‌లో ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కించిన 'రామాయణం' (Ramayana) ట్రైలర్ సోషల్ మీడియాలో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. కేవలం భారతీయ ప్రేక్షకులే కాకుండా దాయాది దేశమైన పాకిస్తాన్ యూట్యూబర్లు, కంటెంట్ క్రియేటర్లు కూడా ఈ విజువల్ వండర్‌కు ఫిదా అయిపోతున్నారు. సరిహద్దులు దాటి పాకిస్తాన్‌లో వైరల్ అవుతున్న రియాక్షన్ వీడియోలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
“భారతీయ సినిమా ఇన్ని వేల కోట్లు పెడుతోందా?”

పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ కంటెంట్ క్రియేటర్ మావియా ఉమర్ ఫారూకీ (Maviya Umer Farooqui) తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్పెషల్ రియాక్షన్ వీడియోను షేర్ చేశారు. "ఒక్కసారి ఊహించండి, రూ. 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయిలో వీఎఫ్ఎక్స్ వాడటం మైండ్ బ్లాకింగ్ అనిపిస్తోంది. నేను ఒక పాకిస్తానీగా చెప్తున్నా, ఈ రామాయణ ట్రైలర్ చూశాక సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎగ్జైట్ అవుతున్నా" అని ఆయన తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.
వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్లను తీసుకురావడం, ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా ఉండటంపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. రణ్‌బీర్ కపూర్, యశ్ ఇద్దరి ఎంట్రీ సీన్లు కేక పుట్టించాయని, నటన పరంగా వీరిద్దరిలో ఎవరు గెలుస్తారో చూడటం ఆసక్తికరంగా ఉంటుందని పేర్కొన్నారు.
“రావణుడిగా యశ్ ఎంట్రీ వేరే లెవెల్!”
మరో పాకిస్తానీ యూట్యూబర్ హస్నాత్ ఖాన్ (Hasnaat Khan) కూడా ఈ ట్రైలర్‌పై స్పందించారు. "రావణాసురుడిగా యశ్ లుక్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. సీజీఐ వర్క్, యానిమేషన్, స్టంట్స్ చాలా నీట్‌గా చేశారు. యాక్షన్ సీన్స్ చూస్తుంటే నిజంగా వావ్ అనిపిస్తోంది" అని ఆయన కామెంట్ చేశారు.
అలాగే పాకిస్తానీ రియాక్షన్ బాయ్, ఇమాన్ మోఅజ్జమ్ ఎంటర్‌టైన్మెంట్ లాంటి యూట్యూబ్ ఛానెళ్లు కూడా సాయి పల్లవి ప్రదర్శించిన సీతాదేవి పాత్రపై ప్రత్యేకంగా మాట్లాడాయి. సాయి పల్లవి సహజ సిద్ధమైన లుక్, సాంప్రదాయ దుస్తులు సీతాదేవి పాత్రకి పర్ఫెక్ట్ సెట్ అయ్యాయని, ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉందంటూ మెచ్చుకున్నారు.
రెండు భాగాలుగా రామాయణం.. దివాళీ కానుకగా గ్రాండ్ రిలీజ్
{{/usCountry}}అలాగే పాకిస్తానీ రియాక్షన్ బాయ్, ఇమాన్ మోఅజ్జమ్ ఎంటర్‌టైన్మెంట్ లాంటి యూట్యూబ్ ఛానెళ్లు కూడా సాయి పల్లవి ప్రదర్శించిన సీతాదేవి పాత్రపై ప్రత్యేకంగా మాట్లాడాయి. సాయి పల్లవి సహజ సిద్ధమైన లుక్, సాంప్రదాయ దుస్తులు సీతాదేవి పాత్రకి పర్ఫెక్ట్ సెట్ అయ్యాయని, ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉందంటూ మెచ్చుకున్నారు.
రెండు భాగాలుగా రామాయణం.. దివాళీ కానుకగా గ్రాండ్ రిలీజ్
{{/usCountry}}ఈ ట్రైలర్‌లో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, లక్ష్మణుడిగా రవి దూబే రాక్షసులతో పోరాడే దృశ్యాలు, కైకేయి (లారా దత్తా)తో ఇచ్చిన మాట కోసం 14 ఏళ్ల వనవాసానికి వెళ్లే ఘట్టాలు హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. 'దంగల్' ఫేమ్ నితీష్ తివారీ ఈ ఎపిక్ కావ్యాన్ని ప్రతి భారతీయుడు గర్వపడేలా తీర్చిదిద్దుతున్నారు.
డీఎన్‌ఈజీ (DNEG) హెడ్ నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ రూ. 4000 కోట్ల పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ మొదటి భాగం ఈ ఏడాది నవంబర్ 8న దివాళీ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇక రెండో భాగం 2027లో విడుదల కాబోతోంది.