మనసును తాకే పాట-అచ్చ‌మైన జాన‌ప‌ద ప్రేమ గీతం-ఎక్క‌డ చూసినా ఇదే వైర‌ల్‌-రాంబాయి నీ మీద నాకు మ‌న‌సాయెనే లిరిక్స్‌ ఇవే

ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే పాట వినిపిస్తోంది. మనసును తాకేలా చెవుల్లో మార్మోగుతోంది. అదే ‘రాంబాయి నీ మీద నాకు మనసాయెనే’ సాంగ్. కొత్తగా వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి సినిమాలోని ఈ సాంగ్ లిరిక్స్ ఇక్కడున్నాయి. మీరూ పాడేయండి. 

Published on: Nov 29, 2025, 20:20:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మనసును హత్తుకునే సాహిత్యంతో, మాయలో ముంచేసే గాత్రంతో, మంత్రముగ్దులను చేసే సంగీతంతో ఓ పాట తెగ వినిపించేస్తోంది. ఇప్పుడు అదే పాట వైరల్ గా మారింది. అదే రాజు వెడ్స్ రాంబాయి సినిమాలోని ‘రాంబాయి నీ మీద నాకు మనసాయెనే’ సాంగ్. ఈ ఫీల్ గుడ్ లవ్ సాంగ్ చెవుల్లో తెగ మార్మోగుతోంది.

రాంబాయి సాంగ్ లిరిక్స్ (youtube)
రాంబాయి సాంగ్ లిరిక్స్ (youtube)

హత్తుకునే పాట

పల్లెటూరి ప్రేమ కథగా వచ్చిన రీసెంట్ గా రాజు వెడ్స్ రాంబాయి సినిమా థియేటర్లో రిలీజైంది. ఈ సినిమాలోనే ‘రాంబాయి నీ మీద నాకు మనసేయెన’ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. అచ్చమైన జానపద ప్రేమ గీతం ఇది. దీన్ని మిట్టపల్లి సురేందర్ రాశారు. అనురాగ్ కులకర్ణి, జయశ్రీ పల్లెం పాడారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు. ఈ సాంగ్ లిరిక్స్ మీకోసం.

రాంబాయి సాంగ్ లిరిక్స్

విచిత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా

మనసొక్కటే జన్మస్థానం అంటు కొత్త కథలాగా మొదలైతదమ్మా

బొట్టు పెట్టుకు చందమామ ఈ నేల మీద పుట్టెనమ్మా

అడుగు మోపుతుంటే గొడుగులాగా మారి

పూల కొమ్మలు వంగెనమ్మా

అందాల ఓ ముద్దుగుమ్మా గుండె గీసుకున్నదే నీ బొమ్మ

ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్త ప్రతి ఒక్క జన్మ

నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా

నీ జంట కోసం చితిమంటదాక అడుగుల్లో అడుగేస్తనమ్మా

మూసి మూసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా..

మూసి మూసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా

తొలిసారి నీ చూపు తనువర తాకంగా

పొంగిందే నాలోని పచ్చి ప్రేమల గంగా

రాంబాయి నీ మీద నాకు మనసాయెనే

ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే

రాంబాయి నీ మీద నాకు మనసాయెనే

మదిలోన నిన్ను వీడిపోని నీడైతనే

బొట్టు పెట్టుకు చందమామ ఈ నేల మీద పుట్టెనమ్మా

అడుగు మోపుతుంటే గొడుగులాగా మారి

పూల కొమ్మలు వంగెనమ్మా

విచిత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా

మనసొక్కటే జన్మస్థానం అంటు కొత్త కథలాగా మొదలైతదమ్మా

రాజ్యమేది లేదుగాని రాణిలాగా చూసుకుంటా

కోటకట్టలేను గాని కళ్లల్లో నిన్నే దాచుకుంటా

రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా

స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా

నిన్నుగన్న మీ నాన్నకన్నా అల్లారు ముద్దుగా సాదుకుంటా

నీకు కోపం వస్తే కొంత దూరముంటా నువ్వు గీత గీస్తే నేను దాటనంటా

కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావాలుంటా..

రాంబాయి నీ మీద నాకు మనసాయెనే

ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే

ఓ రాజు నీ మీద నాకు మనసాయెరా

మదిలోన నన్ను వీడిపోని నీడైతివిరా

రాంబాయి నీ మీద నాకు మనసాయనే

మదిలోన నిన్ను వీడిపోని నీడైతనే

విచిత్రాల ఈ ప్రేమ.. ఏ అంతరాలు ఎంచదమ్మా

మనసొక్కటే జన్మస్థానం అంటు కొత్త కథలాగా మొదలైతదమ్మా

బొట్టు పెట్టుకు చందమామ ఈ నేల మీద పుట్టెనమ్మా

అడుగు మోపుతుంటే గొడుగులాగా మారి

పులా కొమ్మలు వంగెనమ్మా

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More