...
...
Next Story

Kangana Ravi Babu: హిందీలో రవిబాబు దర్శకత్వం- దగ్గుబాటి రానా నిర్మాణం- కంగనా రనౌత్‌తో హారర్ థ్రిల్లర్- టైటిల్‌లోనే భయం!

Rana Daggubati Kangana Ranaut Ravi Babu Scary Picture: దగ్గుబాటి రానా నిర్మాణంలో కంగనా రనౌత్ కథానాయికగా సరికొత్తగా హారర్ థ్రిల్లర్ సినిమా తెరకెక్కుతోంది. ఈ హిందీ సినిమాకు టాలీవుడ్ నటుడు, దర్శకుడు రవిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. న్యూఢిల్లీలో జరిగిన హారర్‌కాన్ ఇండియా వేదికగా రానా ఈ విషయం ప్రకటించారు.

Published on: Nov 1, 2026, 16:00:29 IST
Advertisement

Rana Daggubati Kangana Ranaut Ravi Babu: టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి బాలీవుడ్ వేదికపై ఒక సంచలన ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. న్యూఢిల్లీలో హ్యాలోవీన్ సందర్భంగా జరిగిన 'హారర్‌కాన్ ఇండియా 2026' వేదికగా దగ్గుబాటి రానా ఈ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు.

కంగనాతో రవిబాబు స్కేరీ పిక్చర్

హిందీలో రవిబాబు దర్శకత్వం- దగ్గుబాటి రానా నిర్మాణం- కంగనా రనౌత్‌తో హారర్ థ్రిల్లర్- టైటిల్‌లోనే భయం!
హిందీలో రవిబాబు దర్శకత్వం- దగ్గుబాటి రానా నిర్మాణం- కంగనా రనౌత్‌తో హారర్ థ్రిల్లర్- టైటిల్‌లోనే భయం!

'స్కేరీ పిక్చర్' పేరుతో రూపుదిద్దుకోనున్న ఒక భారీ హారర్ థ్రిల్లర్ సినిమాను తాను నిర్మిస్తున్నట్లు దగ్గుబాటి రానా వెల్లడించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్, భాజపా ఎంపీ, కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, తెలుగు చిత్రసీమకు చెందిన ప్రముఖ నటుడు, దర్శకుడు రవిబాబు ఈ ప్రాజెక్ట్‌తో హిందీలోకి అడుగుపెడుతున్నారు.

సురేష్ ప్రొడక్షన్స్, స్పిరిట్ మీడియా బ్యానర్లపై

దక్షిణాది నిర్మాతలు పాన్ ఇండియా స్థాయిలో విభిన్నమైన కథలను ప్రోత్సహిస్తున్న తరుణంలో రానా ఈ క్రేజీ కాంబినేషన్‌ను తెరపైకి తెచ్చారు. సురేష్ ప్రొడక్షన్స్, స్పిరిట్ మీడియా బ్యానర్లపై కొత్త తరహా కంటెంట్‌ను అందిస్తున్న రానా, ఈసారి పూర్తిస్థాయి హారర్ కథతో నేరుగా బాలీవుడ్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. కంగనా రనౌత్ తన సోషల్ మీడియా ఖాతాలో రానా దగ్గుబాటి మాట్లాడిన వీడియోను రీపోస్ట్ చేస్తూ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు.

సరికొత్త ప్రయోగాలకు కేరాఫ్ రవిబాబు

తెలుగు చిత్రసీమలో రవిబాబుకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 'అనసూయ', 'అవును' వంటి విలక్షణమైన సస్పెన్స్, హారర్ థ్రిల్లర్ సినిమాలతో ప్రేక్షకులను భయపెట్టిన ఆయన, ఎప్పుడూ రొటీన్ మార్గానికి భిన్నంగా వెళ్తుంటారు. పంది పిల్లతో 'అదుగో' లాంటి ప్రయోగాత్మక చిత్రం తీసిన చరిత్ర ఆయన సొంతం. సీనియర్ నటుడు దివంగత చలపతిరావు కుమారుడైన రవిబాబు, తెలుగులో ఎన్నో జోనర్లలో సినిమాలు తీసినా హారర్ థ్రిల్లర్లపై ఆయన ముద్ర ప్రత్యేకమైనది.

మీడియాకు చెప్పకముందు మొదటిసారి

కంగనా రనౌత్ 2009లో వచ్చిన 'రాజ్: ది మిస్టరీ కంటిన్యూస్' చిత్రంతో బాలీవుడ్‌లో హారర్ జోనర్‌లో పెద్ద విజయం సాధించారు. ఆ తర్వాత తమిళంలో 'చంద్రముఖి 2' చేసినప్పటికీ, హిందీలో నేరుగా పూర్తిస్థాయి హారర్ సినిమా చేయడానికి దాదాపు 17 ఏళ్ల సమయం పట్టింది.

ఓటీటీలో భారత్ భాగ్య విధాత

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గ ఎంపీగా రాజకీయాల్లో బిజీగా ఉంటూనే కంగనా వరుస ప్రాజెక్టులతో అలరిస్తున్నారు. ఇటీవలే ఆమె నిర్మించి నటించిన 'భారత్ భాగ్య విధాత' చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఇవి కాకుండా 'సర్కిల్', 'క్వీన్ 2'తో పాటు హాలీవుడ్ అరంగేట్ర చిత్రం 'బ్లెస్డ్ బి ది ఈవిల్' లైన్లో ఉన్నాయి.

టాలీవుడ్, బాలీవుడ్ కలిసి

ఈ క్రమంలో రానా నిర్మించే 'స్కేరీ పిక్చర్' ఆమె కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశముంది. ఉత్తరాది, దక్షిణాది టాలెంట్‌ను మేళవించి తెరకెక్కిస్తున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభించుకోనుంది. టాలీవుడ్ మేకింగ్ స్టైల్, బాలీవుడ్ స్టార్ పవర్ కలగలిసి రాబోతున్న 'స్కేరీ పిక్చర్' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks