నిధికి కాపల కాసే 'కొరివి' దెయ్యం- SR కళ్యాణమండపం డైరెక్టర్ శ్రీధర్ గాదె బర్త్ డేకి హారర్ థ్రిల్లర్ టైటిల్ గ్లింప్స్
Sridhar Gade Korivi Title Announcement Glimpse: 'ఎస్‌ఆర్ కళ్యాణమండపం' చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు శ్రీధర్ గాదె తెరకెక్కిస్తున్న కొత్త తెలుగు హర్రర్ థ్రిల్లర్ 'కొరివి'. కమిటీ కుర్రోళ్లు ఫేమ్ ఈశ్వర్ రచిరాజు కథానాయకుడిగా నటిస్తున్న కొరివి సినిమా టైటిల్ గ్లింప్స్‌ను శ్రీధర్ బర్త్ డేకి రిలీజ్ చేశారు.
Korivi Movie Title Announcement Glimpse On Director Sridhar Gade Birthday: 'ఎస్‌ఆర్ కళ్యాణమండపం' సినిమాతో బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోవడమే కాకుండా, తన దర్శకత్వ ప్రతిభతో ఆడియెన్స్ మనసు దోచుకున్న శ్రీధర్ గాదె మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ముందుకు వచ్చారు.

శ్రీధర్ గాదె పుట్టినరోజు సందర్భంగా
శ్రీధర్ గాదె పుట్టినరోజు (అక్టోబర్ 31)ను పురస్కరించుకుని ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మూడో చిత్రం టైటిల్‌ను నిర్మాతలు వెల్లడించారు. ఈ చిత్రానికి 'కొరివి' అనే వైవిధ్యమైన శీర్షికను ఖరారు చేశారు. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా కొరివి సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఆది సాయికుమార్, ఆనంద్ దేవరకొండ సిననిమాలతో
గతంలో ఆది సాయికుమార్ తో 'చుట్టాలబ్బాయి', ఆనంద్ దేవరకొండతో 'హైవే' వంటి విభిన్న చిత్రాలను అందించిన వెంకట్ తలారి కొరివి సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోపాటు కొరివి గ్లింప్స్ వీడియోను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.
మాయానది నిధి.. దెయ్యం కాపలా: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న గ్లింప్స్
ఈ కొరివి గ్లింప్స్ ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. పల్లెటూరి వాతావరణంలో (విలేజ్ బ్యాక్‌డ్రాప్) సాగే హారర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని మలుస్తున్నారు. మాయానది తీరంలో దాగి ఉన్న ఒక అపారమైన నిధికి కాపలా కాసే 'కొరివి' అనే దెయ్యం కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
మేకింగ్ విజువల్స్
కొరివి గ్లింప్స్‌లో చూపించిన మేకింగ్ విజువల్స్, నేపథ్య సంగీతం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి. పాతకాలపు హారర్ కథలకు భిన్నంగా, సరికొత్త కథాకథనంతో పెద్ద తెరపై థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు.
'కమిటీ కుర్రోళ్లు' హీరోతో సరికొత్త కాంబినేషన్
ఇటీవల 'కమిటీ కుర్రోళ్లు' చిత్రంతో మెప్పించిన యంగ్ నటుడు ఈశ్వర్ రచిరాజు ఈ కొరివి సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జోడీగా నందు మురళీధర్, లిఖిత కథానాయికలుగా అలరించనున్నారు. పూజిత పొన్నాడ, సింధు కాసారం ఇతర కీలక పాత్రలలో కనిపిస్తారు.
కొరివిలో ఇతర నటీనటులు
అలాగే సురేష్ గురు, రాయల్ శ్రీ, మట్టా శివకుమార్, విహా దీకొండ, సునీత మనోహర్, అమ్మ రామచంద్రయ్య తదితరులు ఈ కొరివి సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం కొరివి సినిమా రెగ్యులర్ షూటింగ్ వేగంగా సాగుతోంది.
టాప్ టెక్నీషియన్ల కలయిక
కొరివి చిత్రానికి సాయి కార్తీక్ స్వరాలు సమకూరుస్తుండగా, సతీష్ రెడ్డి మాసం ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. యాక్షన్ సీన్స్ దిలీప్ పర్యవేక్షణలో రూపుదిద్దుకుంటుండగా, ప్రొడక్షన్ డిజైనర్‌గా నాని దేవరపల్లి పనిచేస్తున్నారు. కో-రైటర్‌గా టి.ఎన్. సుబ్రహ్మణ్యం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా విప్లవ్, ఎడిటింగ్ బాధ్యతలను శ్రీధర్, వి.బి.జే చూస్తున్నారు.
డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్
"సినిమాలో ప్రతి సన్నివేశం ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టేలా ఉంటుంది" అని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. హారర్ జానర్ ప్రేమికులకు 'కొరివి' ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


