ఏఐతో షూటింగ్ మొదలుపెట్టక ముందే సినిమా మొత్తం చూసేయొచ్చు.. దీనిని ఎవరూ లైట్ తీసుకోవద్దు: రానా దగ్గుబాటి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో సినిమా ఇండస్ట్రీపై పడే ప్రభావం గురించి రానా దగ్గుబాటి స్పందించాడు. దీనిని ఎవరూ లైట్ తీసుకునే పరిస్థితి లేదని, ఏఐతో మొత్తం సినిమాను షూటింగ్ కూడా మొదలుపెట్టక ముందే చూసే వీలు కలుగుతుందని అన్నాడు.
సినీ పరిశ్రమలో టెక్నాలజీ వాడకం, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం గురించి దగ్గుబాటి రానా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇటీవల జరిగిన 'AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026'లో పాల్గొన్న అతడు.. ప్రీ-ప్రొడక్షన్ దశలో AI వల్ల మేకింగ్ స్టైల్ ఎలా మారిందో వివరించాడు. ఇదే సమయంలో రాజమౌళి - మహేష్ బాబు కాంబోలో రాబోతున్న 'వారణాసి' సినిమా ప్రస్తావన కూడా వచ్చింది.

షూటింగ్‌కి వెళ్లకముందే సినిమా రెడీ!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం కనిపిస్తోంది. దీనికి సినిమా ఇండస్ట్రీ కూడా అతీతం కాదని టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి (Rana Daggubati) అభిప్రాయపడ్డాడు. 'AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026' వేదికగా అతడు మాట్లాడుతూ.. సినిమా నిర్మాణంలో, ముఖ్యంగా ప్రీ-ప్రొడక్షన్ దశలో AI తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి వివరించాడు.
"ఇంతకుముందు సినిమా తీయాలంటే కథను కాగితాలపై రాసుకునేవారు. పెన్సిల్ స్కెచ్‌లు వేసుకునేవారు. దీనివల్ల క్రియేటివ్ టీమ్‌లోని ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఐడియా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. AI పుణ్యమా అని షూటింగ్‌కి వెళ్లకముందే సినిమాలోని కొన్ని భాగాలను లేదా మొత్తం స్టోరీటెల్లింగ్ అనుభవాన్ని మనం క్రియేట్ చేయగలుగుతున్నాం. భారీ విజువల్స్ తో సినిమాలు తీసే దర్శకులు, షూటింగ్ మొదలుపెట్టక ముందే దాదాపు సినిమాను చూసే అవకాశం ఇప్పుడు దొరుకుతోంది" అని రానా పేర్కొన్నాడు. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, అవుట్‌పుట్ పై స్పష్టత వస్తుందని అతని ఉద్దేశం.
రాజమౌళి - మహేష్ బాబు ‘వారణాసి’పై..
రానా ఎవరి పేరు ప్రస్తావించనప్పటికీ, టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'వారణాసి' (Varanasi) ఇలాంటి అత్యాధునిక సాంకేతికతతోనే రూపుదిద్దుకుంటోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. గ్లోబ్ ట్రోటింగ్ అడ్వెంచర్‌గా రాబోతున్న ఈ చిత్రం ఏప్రిల్ 2027లో విడుదల కానుంది.
రానా కెరీర్ ఇలా..
రానా దగ్గుబాటి చివరగా తమిళ పీరియడ్ మూవీ 'పరాశక్తి' (Parasakthi)లో అతిథి పాత్రలో కనిపించాడు. అంతకుముందు దుల్కర్ సల్మాన్‌తో కలిసి నిర్మించి, నటించిన 'కాంత' (Kaantha) సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. అలాగే ప్రభాస్, రానా నటించిన బాహుబలి 1 , 2 భాగాలను కలిపి గత ఏడాది 'బాహుబలి: ది ఎపిక్'గా రీ-రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


