...
...
Next Story

ఆ సినిమాల అడ్వాన్సులు వెనక్కి ఇచ్చేశా.. అద్దంలో నన్ను నేను చూసుకోలేకపోయా.. వరుణ్ తేజ్ నాలాగే అనిపించడంతో..: రానా

రానా దగ్గుబాటి ఎమోషనల్ అయ్యాడు. తన ఆరోగ్య పరిస్థితి, వరుణ్ తేజ్ తనలాగే అనిపించడం, సినిమాల అడ్వాన్సులు వెనక్కి ఇచ్చేయడంలాంటి విషయాలను వెల్లడించాడు. రియా చక్రవర్తితో పాడ్‌కాస్ట్ లో అతడు ఈ కామెంట్స్ చేశాడు.

Published on: Feb 18, 2026, 14:54:39 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

'బాహుబలి' తర్వాత రానా దగ్గుబాటి ఎదుర్కొన్న తీవ్ర అనారోగ్య సమస్యల గురించి మరోసారి నోరు విప్పాడు. కిడ్నీ మార్పిడి, ఆ తర్వాత జరిగిన శారీరక మార్పుల వల్ల తాను ఒప్పుకున్న సినిమాల అడ్వాన్సులు వెనక్కి ఇచ్చేశానని తెలిపాడు. రియా చక్రవర్తి పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. వరుణ్ తేజ్ గురించి, తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

"బతకడమే ముఖ్యం అనుకున్నా.. కానీ ఆ తర్వాత.."

ఆ సినిమాల అడ్వాన్సులు వెనక్కి ఇచ్చేశా.. అద్దంలో నన్ను నేను చూసుకోలేకపోయా.. వరుణ్ తేజ్ నాలాగే అనిపించడంతో..: రానా
ఆ సినిమాల అడ్వాన్సులు వెనక్కి ఇచ్చేశా.. అద్దంలో నన్ను నేను చూసుకోలేకపోయా.. వరుణ్ తేజ్ నాలాగే అనిపించడంతో..: రానా

టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి 'బాహుబలి 2' తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. కిడ్నీ వైఫల్యం, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ అతడు అమెరికాలో చికిత్స పొందాడు. అక్కడ కిడ్నీ మార్పిడి కూడా జరిగింది. తాజాగా రియా చక్రవర్తి హోస్ట్ చేస్తున్న 'చాప్టర్ 2' పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రానా.. ఆ కష్ట సమయాలను గుర్తుచేసుకున్నాడు.

బాలీవుడ్, టాలీవుడ్ లో రానాకు 'హ్యాండ్సమ్ హంక్' అనే ఇమేజ్ ఉండేది. కానీ సర్జరీ తర్వాత ఆ ఇమేజ్ మారిపోయింది. "మొదట్లో నా దృష్టంతా బతకడం మీదే ఉండేది. కానీ అమెరికాలో చికిత్స తర్వాత అద్దంలో చూసుకుంటే, నేను పాత రానాలా లేను. అప్పటికే నేను కొన్ని భారీ యాక్షన్ సినిమాలు, ఒక రెజ్లర్ పాత్ర చేయాల్సి ఉంది. కానీ నా శరీరం దానికి సహకరించదని అర్థమైంది. అందుకే నేను తీసుకున్న అడ్వాన్సులు అన్నీ వెనక్కి ఇచ్చేశాను" అని రానా ఆవేదన వ్యక్తం చేశాడు.

వరుణ్ తేజ్ వచ్చాడు.. నాలానే ఉన్నాడు!

తనను పరామర్శించడానికి వచ్చిన మెగా హీరో వరుణ్ తేజ్ గురించి రానా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "వరుణ్ నన్ను చూడటానికి వచ్చినప్పుడు, అతను చాలా భారీగా, ఫిట్‌గా ఉన్నాడు. అప్పుడు నా పాత రూపాన్ని వరుణ్ లో చూసుకున్నాను. ఒకానొక దశలో.. నేను చేయాల్సిన ఆ కథలన్నీ వరుణ్‌కు ఇచ్చేసి, పనైపోయిందని అనుకుందామా అనే ఆలోచన కూడా వచ్చింది. మనల్ని మనం గుర్తుపట్టలేని స్థితిలో ఉండటం చాలా గందరగోళంగా ఉంటుంది" అని రానా పేర్కొన్నాడు.

అనారోగ్యం తర్వాత రానా ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. గతేడాది దుల్కర్ సల్మాన్‌తో కలిసి 'కాంత' (Kaantha) సినిమాను నిర్మించి, నటించాడు. తేజ సజ్జా నటించిన 'మిరాయ్'లో అతిథి పాత్ర పోషించాడు. నెట్‌ఫ్లిక్స్‌లో 'రానా నాయుడు' సీజన్ 2లో మెరిశాడు.

తాజాగా శివకార్తికేయన్ నటించిన ‘పరాశక్తి’లో ఒక గెస్ట్ రోల్ చేశాడు. అలాగే ‘సోలో లెవలింగ్’కు డబ్బింగ్ చెప్పడం, ప్రైమ్ వీడియోలో టాక్ షో హోస్ట్ చేయడం వంటి వైవిధ్యమైన పనులు చేస్తున్నాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks