...
...
Next Story

ఈ సినిమా చూసిన తర్వాత దుల్కర్ సల్మాన్ అభిమానిగా మారిపోయా.. వాళ్లంతా క్యూ కడతారు.. అద్భుతమైన యాక్టర్: రానా కాంత రివ్యూ

దుల్కర్ సల్మాన్ నటించిన కాంత మూవీ రివ్యూ ఇచ్చాడు రానా దగ్గుబాటి. ఈ సినిమా చూసిన తర్వాత తాను దుల్కర్ అభిమానిగా మారిపోయానని, అతడో అద్భుతమైన యాక్టర్ అని ప్రశంసల వర్షం కురిపించాడు.

Published on: Nov 6, 2025, 20:59:44 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన ద్విభాషా చిత్రం ‘కాంత’. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పీరియాడికల్ కథాంశంతో రూపొందించిన ఈ సినిమా ట్రైలర్ గురువారం (నవంబర్ 6) విడుదలవగా.. ఇందులో దుల్కర్ ఏం చూపించబోతున్నాడో చూడాలని అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.

ఈ సినిమా చూసిన తర్వాత దుల్కర్ సల్మాన్ అభిమానిగా మారిపోయా.. వాళ్లంతా క్యూ కడతారు.. అద్భుతమైన యాక్టర్: రానా కాంత రివ్యూ
ఈ సినిమా చూసిన తర్వాత దుల్కర్ సల్మాన్ అభిమానిగా మారిపోయా.. వాళ్లంతా క్యూ కడతారు.. అద్భుతమైన యాక్టర్: రానా కాంత రివ్యూ

ఈ సందర్భంగా జరిగిన ట్రైలర్ లాంచ్‌ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి మాట్లాడుతూ దుల్కర్‌ని ఆకాశానికెత్తేశారు. ‘కాంత’లో దుల్కర్ నటన చూసిన తర్వాత తాను ఆయనకు ఫ్యాన్ అయ్యానని రానా తెలిపారు.

నడిప్పు చక్రవర్తి దుల్కర్

దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్లో నటించిన కాంత మూవీ నవంబర్ 14న రిలీజ్ కానుండగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వేదికపై విలేకరులతో మాట్లాడిన రానా దగ్గుబాటి.. దుల్కర్ సల్మాన్ అద్భుతమైన నటుడని ప్రశంసించారు. “'నడిప్పు చక్రవర్తి (నట చక్రవర్తి) దుల్కర్ సల్మాన్'... 'కాంత' విడుదలైన తర్వాత తమిళనాడు అంతటా ఈ నినాదం వినబడుతుంది. ఇండియాలో ఎవరైనా ఒక పీరియడ్ కథ రాస్తే, మొదటగా వాళ్లు దుల్కర్ దగ్గరికే వస్తారని నేను అనుకుంటున్నాను.

ఆయన డేట్స్ అందుబాటులో లేకపోతేనే ఇతర నటుల దగ్గరకు వెళ్తారు. దుల్కర్ ఎప్పుడూ నాకు మంచి స్నేహితుడు. ఆయన సినిమాపై ఎంత ప్రేమ ఉన్నవాడో నాకు తెలుసు. కానీ ఈ సినిమా చూశాక.. అయ్యా, నేను నిజంగా నీ ఫ్యాన్‌ని అయ్యాను. ఆయన ఎంత అద్భుతమైన నటుడో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో ఆయన నటన చూడటానికి టికెట్ కొనుక్కొని వెళ్లొచ్చు. మా నాన్నగారు (సురేష్ బాబు) కూడా సినిమా చూసి, 'దుల్కర్ చాలా అద్భుతంగా చేశాడు, అతన్ని చూస్తూనే ఉండొచ్చు' అని అన్నారు” అని రానా చెప్పాడు.

'కాంత' కథాంశం ఏమిటంటే?

ఈ చిత్రం ఒక పౌరాణిక తమిళ దర్శకుడు అయ్య, అతని సాయంతో స్టార్‌గా ఎదిగిన సినిమా నటుడు చంద్రన్ మధ్య ఉన్న బంధం చుట్టూ తిరుగుతుంది. దర్శకుడు అయ్య తీసిన 'శాంత' అనే వుమన్ సెంట్రిక్ సినిమాకు హీరో చంద్రన్ 'కాంత' అని పేరు మార్చాలని నిర్ణయించుకోవడంతో గురువు-శిష్యుల మధ్య ఈగో వార్ మొదలవుతుంది.

'కాంత' వాస్తవానికి సెప్టెంబర్ 12న విడుదల కావాల్సి ఉంది. కానీ ఆగస్టు 28న విడుదలైన 'లోకా చాప్టర్ 1 – చంద్ర' సక్సెస్‌ఫుల్ రన్ ను కొనసాగించడానికి వీలుగా దీని విడుదల తేదీని వాయిదా వేశారు. ఆ సినిమాను దుల్కర్ నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ కాంత మూవీ నవంబర్ 14న విడుదల కానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe