...
...
Next Story

Rana Daggubati: ఇండీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా రానా దగ్గుబాటి- 15 అంతర్జాతీయ అవార్డులు పొందిన షేఫ్ ఆఫ్ మోమో ఇవాళ రిలీజ్

Rana Daggubati Releasing Shape Of Momo Indie Movie: టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి తన స్పిరిట్ మీడియా సంస్థ ద్వారా భారతీయ స్వతంత్ర (ఇండీ) చిత్రాలకు కొండంత అండగా నిలుస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వినూత్న కథలను, ప్రాంతీయ చిత్రాలను థియేటర్ల వరకు తీసుకొస్తూ ఇండస్ట్రీలో సరికొత్త విప్లవానికి తెరలేపారు.

Published on: May 29, 2026, 05:57:56 IST
Advertisement

Rana Daggubati Releasing Shape Of Momo Indie Movie: భారతీయ చలనచిత్ర రంగంలో అగ్ర నిర్మాణ సంస్థల వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో రానా దగ్గుబాటి. కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన కంటెంట్‌ను ప్రోత్సహించడంలో దగ్గుబాటి రానా ఎప్పుడూ ముందే ఉంటారు.

ఎలాంటి స్టార్ కాస్టింగ్ లేకుండా

ఇండీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా రానా దగ్గుబాటి- 15 అంతర్జాతీయ అవార్డులు పొందిన షేఫ్ ఆఫ్ మోమో ఇవాళ రిలీజ్
ఇండీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా రానా దగ్గుబాటి- 15 అంతర్జాతీయ అవార్డులు పొందిన షేఫ్ ఆఫ్ మోమో ఇవాళ రిలీజ్

ప్రస్తుతం రానా నేతృత్వంలోని 'స్పిరిట్ మీడియా' మన దేశంలో ఇండీ (ఇండిపెండెంట్) సినిమాలకు ఒక సరికొత్త వేదికగా మారుతోంది. ఎలాంటి స్టార్ కాస్టింగ్ లేకుండా, కేవలం కథనే నమ్ముకుని వచ్చే చిన్న చిత్రాలను సపోర్ట్ చేస్తూ వాటిని థియేటర్ల వరకు తీసుకురావడానికి స్పిరిట్ మీడియా గట్టిగా ప్రయత్నిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా వివిధ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రశంసలు అందుకున్న చిత్రాలను, మన నేటివిటీకి దగ్గరగా ఉండే నిజాయితీ గల కథలను సామాన్య ప్రేక్షకుడి చెంతకు చేర్చడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. దీనివల్ల ఇండస్ట్రీలో పెద్దగా ఎక్స్‌పోజర్ లేని ఎంతోమంది ప్రతిభావంతులైన దర్శకులకు, రచయితలకు తమ కలలను దేశవ్యాప్తంగా పంచుకునే అద్భుతమైన అవకాశం దక్కుతోంది.

దూసుకుపోతున్న నార్త్ ఈస్ట్ సినిమాలు

ఇండీ ఫిలిం మూవ్‌మెంట్‌లో ప్రస్తుతం నార్త్ ఈస్ట్ (ఈశాన్య రాష్ట్రాల) సినిమాలు చాలా ప్రత్యేకంగా నిలుస్తూ వేగంగా ఎదుగుతున్నాయి. సిక్కిం, అస్సాం, మణిపూర్ లాంటి ప్రాంతాల నుంచి వస్తున్న సినిమాలు ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తున్నాయి.

అక్కడ ఉండే విభిన్నమైన సంస్కృతిని, అచ్చమైన మానవ సంబంధాలను చాలా రియలిస్టిక్‌గా చూపిస్తూ గ్లోబల్ లెవెల్‌లో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా మన సౌత్ ఆడియన్స్‌కు నార్త్ ఈస్ట్ చిత్రాల కల్చర్ పెద్దగా తెలియదు. కానీ, ఇలాంటి ప్రయత్నాల వల్ల దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు ఆయా ప్రాంతాల జీవన విధానాన్ని అర్థం చేసుకునే వీలు కలుగుతోంది.

15కిపైగా అంతర్జాతీయ అవార్డులతో 'షేప్ ఆఫ్ మోమో'

బాలీవుడ్ ప్రముఖ మేకర్స్ జోయా అక్తర్, పాయల్ కపాడియా లాంటి క్రేజీ ప్రొడ్యూసర్స్ ఈ ప్రాజెక్ట్‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌గా సపోర్ట్ ఇవ్వడం విశేషం. ఇలాంటి అద్భుతమైన సినిమాలను నేరుగా థియేటర్లకు తీసుకురావడం ద్వారా రానా దగ్గుబాటి అన్ని ప్రాంతాల సినిమాలకు సమానమైన గుర్తింపు ఇస్తూ ఒక మంచి సినిమా కల్చర్‌ను బిల్డ్ చేస్తున్నారు.

చిన్న చిత్రాలకు రానా మద్దతుపై

భారీ బడ్జెట్ సినిమాలు, కమర్షియల్ ఫార్ములా కథల మధ్య నలిగిపోతున్న చిన్న చిత్రాలకు రానా దగ్గుబాటి అందిస్తున్న ఈ మద్దతు టాలీవుడ్‌తో పాటు దేశీయ సినిమా పరిశ్రమలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe