చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.
Vijay Rashmika: విజయ్ బంగారం, రష్మిక మందన్నా అచ్చం ప్రభాస్ లాంటిది.. రణబాలి నటుడు కిషోర్ కుమార్ పొలిమేర కామెంట్స్
Ranabaali Actor About Vijay Deverakonda Rashmika Mandanna: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలపై'రణబాలి' సహనటుడు కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ కిషోర్ కుమార్ పొలిమేర ప్రశంసలు కురిపించారు. బయట ప్రచారం జరుగుతున్నట్లు విజయ్ కాదని, ఆయన మనసు బంగారమని కిషోర్ చెప్పారు. రష్మిక వ్యక్తిత్వాన్ని ప్రభాస్‌తో పోల్చారు.
Ranabaali Actor Compares Rashmika Mandanna With Prabhas: టాలీవుడ్ క్రేజీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలకు సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కోవడం కొత్తేమీ కాదు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉదయ్‌పూర్ వేదికగా పెళ్లి పీటలెక్కిన ఈ జంట, గత నెలలో ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ నిర్వహించే 'కాఫీ విత్ కరణ్' షోలో కలిసి సందడి చేశారు.

రణబాలి సినిమాలో నటించిన కిషోర్ కుమార్ పొలిమేర
అప్పటి నుంచి వీరి బంధం, వ్యక్తిత్వాలపై నెట్టింట తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వీరితో కలిసి 'రణబాలి' సినిమాలో నటించిన కిషోర్ కుమార్ పొలిమేర తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో స్పందిస్తూ విజయ్, రష్మికలకు గట్టి మద్దతుగా నిలిచారు.
విజయ్ మనసు బంగారం.. అస్సలు గర్వం ఉండదు
'రాజా టాక్స్ ఐడీ' (Raja Talks ID) పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన కిషోర్ కుమార్ పొలిమేరను, బయట సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ గురించి ప్రచారంలో ఉన్న అభిప్రాయాలపై యాంకర్ ప్రశ్నించారు. దీనికి కిశోర్ ఏమాత్రం తడుముకోకుండా విజయ్‌ను ఆకాశానికెత్తేశారు.
"విజయ్ నిజంగా బంగారం. బయట జనాలు ఆయన గురించి ఏవేవో ఊహించుకుని మాట్లాడుతుంటారు కానీ, ఆయన అస్సలు అలాంటి వ్యక్తి కాదు. ఎవరు ఎన్ని అనుకున్నా ప్రేక్షకుల ఆదరణ ఉన్నంత కాలం ఆయనకు ఏమీ కాదు. విజయ్ చాలా మంచి మనిషి" అని కిషోర్ కుమార్ తెలిపారు. శ్రీలంకలో 'రణబాలి' షూటింగ్ జరుగుతున్న సమయంలో విజయ్ సెట్‌లో అందరితో ఎంతో సరదాగా, స్నేహపూర్వకంగా మెలిగిన తీరును ఆయన గుర్తుచేసుకున్నారు.
ప్రభాస్ లాగే రష్మికకు కూడా 'జీరో యాటిట్యూడ్'
ఇదే వేదికపై మరో సహనటి రష్మిక మందన్నా స్వభావం గురించి కేరాఫ్ కంచరపాలెం యాక్టర్ కిషోర్ కుమార్ ఆసక్తికర పోలికతో అభివర్ణించారు. మన టాలీవుడ్ టాప్ హీరోలలో ప్రభాస్ ఎంత సున్నిత మనస్కుడో, ఎంత ప్రేమగా ఉంటారో అందరికీ తెలిసిందేనని అంటూ రష్మికను ఆయనతో పోల్చారు.
"మన అగ్ర హీరోలలో ప్రభాస్ ఎంత క్యూట్‌గా, లవబుల్‌గా ఉంటారో తెలుసు కదా? రష్మిక కూడా అచ్చం అలాంటిదే. ఆమెకు అస్సలు గర్వం (జీరో యాటిట్యూడ్) ఉండదు. నిజం చెప్పాలంటే విజయ్ కంటే రష్మిక ఇంకా పెద్ద బంగారం" అని కిషోర్ కుమార్ పొలిమేర కితాబిచ్చారు. దీంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
కుటుంబం జోలికొస్తే ఊరుకోనన్న రష్మిక
మరోవైపు తనపై వచ్చే ట్రోలింగ్‌పై రష్మిక మందన్నా ఇటీవల 'ప్రేమ' యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఘాటుగా స్పందించారు. "నా వ్యక్తిత్వం గురించి లేదా నా నటన గురించి విమర్శిస్తే నేను తట్టుకోగలను. మా వృత్తిలో అది సహజం. ఎవరి అభిప్రాయాలు వారు చెప్పే స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఎవరైనా నా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం అస్సలు సహించను. అప్పుడు నేను పూర్తిగా 'వారియర్ మోడ్'లోకి వెళ్లిపోతాను" అని ఆమె తేల్చిచెప్పారు.
'కాఫీ విత్ కరణ్' ఎపిసోడ్‌తో మొదలైన రచ్చ
ఫిబ్రవరిలో వివాహం తర్వాత తమ కొత్త చిత్రం 'రణబాలి' ప్రమోషన్లలో భాగంగా విజయ్, రష్మిక తొలిసారి కలిసి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ క్రమంలో అక్టోబర్ 21న జియో హాట్‌స్టార్ (JioHotstar) వేదికగా ఓటీటీ స్ట్రీమింగ్ అయిన 'కాఫీ విత్ కరణ్' ఎపిసోడ్ తీవ్ర చర్చకు దారితీసింది.
ఏడాది కాలంలో తాను విజయ్‌కు ఏకంగా 100 సార్లు ప్రపోజ్ చేశాక ఆయన ఒప్పుకున్నారని రష్మిక చెప్పడంపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. గతంలో ఇతర ప్రమోషన్లలో రష్మిక ధరించిన ఆభరణాలను చూసి నిశ్చితార్థపు ఉంగరమని కొందరు భావించడంపై విజయ్ అసహనం వ్యక్తం చేశారు.
పోలీసులకు ఫిర్యాదు
ఈ ఎపిసోడ్ ప్రసారమయ్యాక అసత్య ప్రచారాలు చేస్తూ, ఏఐ (AI) సాయంతో అసభ్యకర ఫొటోలు సృష్టించిన ట్రోలర్లపై ఈ జంట పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అగ్ర తారల వ్యక్తిగత జీవితాలపై సామాజిక మాధ్యమాల్లో హద్దులు దాటుతున్న విమర్శలకు అడ్డుకట్ట వేయాలని అభిమానులు సైతం కోరుతున్నారు.

E-Paper
