...
...
Next Story

Ranabaali Trailer: ఆ పిచ్చిపట్టిన పిశాచులకు శివరాత్రి చూపిద్దాం.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న విజయ్ ‘రణబాలి’ ట్రైలర్

Ranabaali Trailer: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన రణబాలి ట్రైలర్ వచ్చేసింది. అక్టోబర్ 16న రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ ను గురువారం (అక్టోబర్ 8) చెప్పిన సమయాని కంటే కాస్త ఆలస్యంగా మేకర్స్ రిలీజ్ చేశారు.

Published on: Oct 8, 2026, 19:29:02 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Ranabaali Trailer: విజయ్ దేవరకొండ మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ రణబాలి మూవీ ట్రైలర్ వచ్చేసింది. సుమారు 4 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ గూస్‌బంప్స్ తెప్పించేలా సాగింది. విజయ్ పవర్‌ఫుల్, మాస్ డైలాగులు, దద్దరిల్లే బీజీఎం నెక్ట్స్ లెవెల్లో ఉన్నాయి. ట్రైలర్ చూస్తుంటే అక్టోబర్ 16 నుంచి థియేటర్లు దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది.

రణబాలి ట్రైలర్ ఎలా ఉందంటే?

Ranabaali Trailer: ఆ పిచ్చిపట్టిన పిశాచులకు శివరాత్రి చూపిద్దాం.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న రణబాలి ట్రైలర్
Ranabaali Trailer: ఆ పిచ్చిపట్టిన పిశాచులకు శివరాత్రి చూపిద్దాం.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న రణబాలి ట్రైలర్

రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో వస్తున్న పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రణబాలి. బ్రిటీష్ పాలకుల కాలంలో దక్షిణాదిలో ఏర్పడిన కృత్రిమ కరువు, దాని వెనుక ఉన్న భయానక నిజాల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం సాగుతుంది. సింగనమల కొండల్లో రణబాలి అనే వీరుడు గుహలో ఎలా జన్మించాడో చెప్పే బుర్రకథతో ట్రైలర్ చాలా ఆసక్తికరంగా స్టార్ట్ అవుతుంది.

ఊరి ప్రజలను బ్రిటీష్ అధికారులు కూలీలుగా మార్చి వేధిస్తున్న సమయంలో, మన గడ్డపై వాళ్లకు పవర్ ఏంటని ప్రశ్నించే తిరుగుబాటుదారుడిగా విజయ్ దేవరకొండ ఎంట్రీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. కథానాయిక రష్మిక మందన్న 'జయమ్మ' పాత్రలో విజయ్ భార్యగా కనిపించగా, వీరిద్దరి మధ్య వచ్చే లైట్ కామెడీ సీన్లు, రొమాంటిక్ కెమిస్ట్రీ ఆకట్టుకుంటాయి.

ఆ పిచ్చిపట్టిన పిశాచులకు శివరాత్రి చూపిద్దాం.. సింగనమల బొబ్బిలి రణబాలి రా నీ అక్క అంటూ విజయ్ చెప్పే డైలాగులు ట్రైలర్లో గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇక బాలీవుడ్ మ్యూజిక్ జోడీ అజయ్, అతుల్ అందించిన బీజీఎం కూడా నెక్ట్స్ లెవెల్లో ఉన్నాయి.

హాలీవుడ్ విలన్ అర్నాల్డ్ వోస్లూ.. మాస్ ఎలివేషన్స్

ట్రైలర్ ముగింపులో 'కాంతార', 'పుష్ప', 'కరుప్పు' సినిమాల తరహాలో విజయ్ దేవరకొండ చూపించిన రా అండ్ రగ్గడ్ అవతార్, మాస్ ఎలివేషన్స్ అభిమానులకు పిచ్చెక్కిస్తున్నాయి. రాహుల్ సంకృత్యన్ విజన్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా రేంజ్‌ను భారీగా పెంచేశాయి.

విజయ్ - రష్మిక హిట్ కాంబో రిపీట్

'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత విజయ్ - రష్మిక కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

'టాక్సీవాలా', 'శ్యామ్ సింగరాయ్' హిట్స్‌తో నిరూపించుకున్న రాహుల్ సంకృత్యన్ ఈసారి పక్కా పాన్ ఇండియా లెవెల్లో బాక్సాఫీస్ కొల్లగొట్టడానికి పక్కా ప్లానింగ్‌తో వస్తున్నట్లు స్పష్టమవుతోంది. అక్టోబర్ 16న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks