భారతీయ చలనచిత్ర రంగంలో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ 'రామాయణం' (Ramayana). నితేష్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి 'రామ గ్లింప్స్' (Rama Glimpse) టీజర్‌ను హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా గురువారం (ఏప్రిల్ 2) విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ టీజర్‌ను ఒకేసారి లాంచ్ చేశారు. ముంబైలో జరిగిన ప్రధాన వేడుకలో దర్శకుడు నితేష్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా స్వయంగా పాల్గొన్నారు.
ఏడేళ్ల నిరీక్షణ.. కంటతడి పెట్టిన దర్శకుడు

రామాయణ టీజర్ స్క్రీనింగ్ తర్వాత ప్రేక్షకుల్లో వచ్చిన స్పందన చూసి దర్శకుడు నితేష్ తివారీ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాడు. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా అతడు తన మనసులోని మాటను పంచుకున్నాడు.
"ఈ క్షణం కోసం నేను ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నాను. సినిమా తీయడం అనేది ఎంతో ఒంటరి ప్రయాణం.. ఎన్నో ఊహలతో కూడుకున్న ప్రక్రియ. ఈ ఏడేళ్లలో ప్రతి నిమిషం ఈ రోజే గుర్తుకు వచ్చేది.. ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో అని ఆందోళన చెందేవాడిని. కానీ ఈరోజు మీ చప్పట్లు, స్పందన చూస్తుంటే నా ఏడేళ్ల కష్టం వృథా పోలేదని అనిపిస్తోంది" అని నితేష్ ఉద్వేగంగా చెప్పాడు.
ఈ సినిమాను ఇంతవరకు తీసుకురావడానికి వందలాది మంది అహోరాత్రులు శ్రమించారని, వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని ఆశిస్తున్నట్లు అతడు తెలిపాడు.
రూ.4000 కోట్ల బడ్జెట్‌తో రామాయణం
'రామాయణం' మూవీ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. ఇది ఒక విజువల్ వండర్. సుమారు రూ.4000 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇది భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యయంతో నిర్మితమవుతున్న చిత్రాల జాబితాలోనూ చేరింది.
ఈ సినిమాలో నటిస్తున్న స్టార్ల జాబితా కూడా అంతే భారీగా ఉంది.
{{/usCountry}}ఈ సినిమాలో నటిస్తున్న స్టార్ల జాబితా కూడా అంతే భారీగా ఉంది.
{{/usCountry}}రణ్‌బీర్ కపూర్: శ్రీరాముడు.
సాయి పల్లవి: సీతాదేవి
యష్: రావణాసురుడు
సన్నీ డియోల్: హనుమంతుడు
రవి దూబే: లక్ష్మణుడు
రామాయణ టీజర్‌లో హైలైట్స్
తాజాగా విడుదలైన 'రామ గ్లింప్స్' ప్రధానంగా శ్రీరాముడి పాత్రపైనే దృష్టి సారించినప్పటికీ.. సీతమ్మ, లక్ష్మణుడి పాత్రల తాలూకు చిన్నపాటి మెరుపులు కూడా కనిపించాయి. ముఖ్యంగా టీజర్ చివరలో కన్నడ స్టార్ యష్ పోషించిన రావణాసురుడి పాత్ర, అతని విలాసవంతమైన 'పుష్పక విమానం' నుంచి దిగుతున్న దృశ్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది.
నితేష్ తివారీ రూపొందిస్తున్న ఈ దృశ్య కావ్యం మొదటి భాగం 2026 అక్టోబర్‌లో (దీపావళి కానుకగా) విడుదల కానుండగా, రెండో భాగం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ టీజర్ చూస్తుంటే భారతీయ పురాణగాథను వెండితెరపై ప్రపంచస్థాయి ప్రమాణాలతో చూడబోతున్నామనే నమ్మకం కలుగుతోంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
1. రామాయణం సినిమా బడ్జెట్ ఎంత?
ఈ సినిమాను సుమారు రూ.4000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇది ఇండియాలోనే అత్యంత ఖరీదైన చిత్రం.
2. ఈ సినిమాలో హనుమంతుడిగా ఎవరు నటిస్తున్నారు?
బాలీవుడ్ యాక్షన్ స్టార్ సన్నీ డియోల్ ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రను పోషిస్తున్నారు.
3. రామాయణం పార్ట్-1 ఎప్పుడు విడుదల కానుంది?
ఈ చిత్రం మొదటి భాగం 2026 అక్టోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.