హిందీ ప్రముఖ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం’ గురించి రోజుకో వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. తాజాగా శనివారం (మార్చి 7) నాడు రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడుగా, సాయి పల్లవి సీతాదేవి వేషధారణలో ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
రాముడు, సీత పెళ్లి వేడుకకు సంబంధించినవేనని

రాజసం ఉట్టిపడేలా కిరీటం, నగలు ధరించి ఉన్న ఈ లీక్‌డ్ ఫోటోలు చూసి.. సినిమాలోని రాముడు, సీత పెళ్లి వేడుకకు సంబంధించినవేనని అంతా భావించారు. అయితే, ఈ ఫోటోలు అసలైనవి కావు, ఏఐ (AI) సృష్టించిన నకిలీ ఫోటోలని తాజాగా తేలిపోయింది.
అనుమానం రేకెత్తించిన క్లారిటీ!
సాధారణంగా సెట్స్ నుంచి లీక్ అయ్యే ఫోటోలు కాస్త అస్పష్టంగా ఉంటాయి. కానీ, ఇప్పుడు వైరల్ అవుతున్న ఫోటోలు అత్యంత స్పష్టంగా (HD Quality) ఉండటంతో నెటిజన్లకు అనుమానం వచ్చింది. దీనిపై కొందరు ఆరా తీయగా, ‘గ్రోక్’ (Grok) చాట్‌బాట్ కూడా ఇవి ఫేస్-స్వాప్ ఎడిటింగ్ అని తేల్చేసింది. గతేడాది పూర్తయిన సీక్వెన్స్ ఫోటోలు ఇప్పుడు ఎలా బయటకు వస్తాయని కొందరు నెటిజన్లు లాజిక్ తీశారు.
గుట్టు విప్పిన టీవీ రాముడు!
ఈ ఫోటోల వెనుక ఉన్న అసలు నిజాన్ని 2015-16లో వచ్చిన ‘సియా కే రామ్’ (Siya Ke Ram) (తెలుగులో సీతారామ) సీరియల్ నటుడు ఆశిష్ శర్మ బయటపెట్టారు. ఆ సీరియల్‌లో రాముడి పాత్ర పోషించింది ఆయనే.
రణ్‌బీర్ కపూర్ ముఖాన్ని అతికించారని
ఇప్పుడు వైరల్ అవుతున్న ఫోటోలలో ఆశిష్ శర్మ ముఖాన్ని తీసేసి రణ్‌బీర్ కపూర్ ముఖాన్ని అతికించారని ఆయన ఆధారాలతో సహా నిరూపించారు. "ఇదిగోండి.. మరో ‘ఒరిజినల్’ లీక్‌డ్ ఫోటో. ఏఐ నా ముఖాన్ని మార్చగలిగింది కానీ, నా జుట్టును మార్చలేకపోయింది" అని ఆశిష్ శర్మ సరదాగా ట్వీట్ చేస్తూ, ఆ సీరియల్లోని తన అసలైన ఫోటోను షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు ఫేక్ అని స్పష్టమైంది.
భారీ బడ్జెట్ మూవీగా రామాయణం
{{/usCountry}}ఇప్పుడు వైరల్ అవుతున్న ఫోటోలలో ఆశిష్ శర్మ ముఖాన్ని తీసేసి రణ్‌బీర్ కపూర్ ముఖాన్ని అతికించారని ఆయన ఆధారాలతో సహా నిరూపించారు. "ఇదిగోండి.. మరో ‘ఒరిజినల్’ లీక్‌డ్ ఫోటో. ఏఐ నా ముఖాన్ని మార్చగలిగింది కానీ, నా జుట్టును మార్చలేకపోయింది" అని ఆశిష్ శర్మ సరదాగా ట్వీట్ చేస్తూ, ఆ సీరియల్లోని తన అసలైన ఫోటోను షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు ఫేక్ అని స్పష్టమైంది.
భారీ బడ్జెట్ మూవీగా రామాయణం
{{/usCountry}}ఇదిలా ఉంటే, రామాయణం కావ్యాన్ని రెండు భాగాలుగా నితీష్ తివారీ వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. ఇందులో రావణుడిగా యశ్, లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు.
అత్యంత భారీ వ్యయంతో
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ రామాయణ చిత్రం.. ఈ ఏడాది దీపావళి కానుకగా థియేటర్లలోకి రానుంది. ఆస్కార్ గ్రహీత ‘ప్రైమ్ ఫోకస్’ స్టూడియో ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ (VFX) అందిస్తోంది.