Ranveer Singh: విరాట్ కోహ్లికే షాకిచ్చిన రణ్‌వీర్ సింగ్.. రూ.1539 కోట్ల బ్రాండ్ వాల్యూ.. నంబర్ 1 ఎవరో తెలుసా?

Ranveer Singh: ధురంధర్ సిరీస్ తో దేశవ్యాప్తంగా ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న రణ్‌వీర్ సింగ్ బ్రాండ్ వాల్యూలోనూ దూసుకెళ్లాడు. విరాట్ కోహ్లిని వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలవడం విశేషం.

Published on: Aug 5, 2026, 20:23:08 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ranveer Singh: బాలీవుడ్ ఎనర్జటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ భారతీయ వినోద రంగంలో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. ప్రఖ్యాత బ్రాండ్ వాల్యుయేషన్ సంస్థ 'క్రోల్' (Kroll) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీల జాబితాలో క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి రణ్‌వీర్ సెకండ్ ప్లేస్ కైవసం చేసుకున్నారు.

Ranveer Singh: విరాట్ కోహ్లికే షాకిచ్చిన రణ్‌వీర్ సింగ్.. రూ.1539 కోట్ల బ్రాండ్ వాల్యూ.. నంబర్ 1 ఎవరో తెలుసా?
Ranveer Singh: విరాట్ కోహ్లికే షాకిచ్చిన రణ్‌వీర్ సింగ్.. రూ.1539 కోట్ల బ్రాండ్ వాల్యూ.. నంబర్ 1 ఎవరో తెలుసా?

ఏకంగా 162.9 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1539 కోట్లు) బ్రాండ్ వ్యాల్యూతో ఆయన ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారు.

నంబర్ 1 స్థానంలో కింగ్ ఖాన్.. తప్పుకున్న విరాట్

ఈ టాప్ 10 లిస్ట్‌లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) 177.9 మిలియన్ డాలర్ల బ్రాండ్ వాల్యూతో అగ్రస్థానంలో నిలిచి తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకున్నారు. గతేడాది వరకు నంబర్ 1 పొజిషన్‌లో ఏకచక్రాధిపత్యం చెలాయించిన విరాట్ కోహ్లీ.. ఈసారి 158.4 మిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో మూడో స్థానానికి పడిపోవడం గమనార్హం.

మరోవైపు టీమిండియా లెజెండ్స్ సచిన్ టెండూల్కర్ (125.9 మిలియన్ డాలర్లు) నాలుగో స్థానంలో, ఎంఎస్ ధోనీ (115.3 మిలియన్ డాలర్లు) ఐదో స్థానంలో నిలిచి తమ గ్లోబల్ క్రేజ్ ఇంకా తగ్గలేదని నిరూపించారు.

హీరోయిన్లలో ఆలియా టాప్.. రణ్‌బీర్‌కు బిగ్ షాక్

లేడీ సెలబ్రిటీల కేటగిరీలో స్టార్ నటి ఆలియా భట్ 93.9 మిలియన్ డాలర్ల బ్రాండ్ వాల్యూతో ఆరో స్థానంలో నిలిచి సత్తా చాటారు. ఆమె తర్వాత రణ్‌వీర్ భార్య, గ్లోబల్ ఐకాన్ దీపికా పదుకోన్ 89.2 మిలియన్ డాలర్లతో ఏడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

హృతిక్ రోషన్ ఎనిమిదో స్థానంలో, అమితాబ్ బచ్చన్ తొమ్మిదో స్థానంలో నిలవగా, యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, రణ్‌బీర్ కపూర్ పదో స్థానానికి పరిమితమయ్యారు. యానిమల్ లాంటి హిట్ కొట్టినా రణ్‌బీర్ కపూర్ ఈ లిస్ట్‌లో చిట్టచివరన ఉండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

'ధురంధర్' బ్లాక్‌బస్టర్లు.. 'ప్రళయ్' కోసం గ్రాండ్ ప్లాన్

రణ్‌వీర్ సింగ్ బ్రాండ్ వాల్యూ ఈ స్థాయిలో పెరగడానికి ఆయన ఇటీవలి బాక్సాఫీస్ హిట్లు ప్రధాన కారణం. ఆయన నటించిన 'ధురంధర్', 'ధురంధర్ 2' చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి ఆయన రేంజ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.

ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ 'ప్రళయ్' అనే ఇంటెన్స్ యాక్షన్ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం ఆయన రెండు నెలల పాటు నాన్‌స్టాప్‌గా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఆ తర్వాత భార్య దీపికా పదుకోన్ రెండవ డెలివరీ కోసం ప్రత్యేకంగా 'పెటర్నిటీ బ్రేక్' తీసుకోనున్నారు. జనవరి వరకు కుటుంబంతో సమయం గడిపిన తర్వాతే ఆయన మళ్లీ షూటింగ్ సెట్‌లోకి అడుగుపెడతారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More