నార్త్ అమెరికాలో అత్యధిక కలెక్షన్స్ తొలి హిందీ మూవీగా ధురంధర్- కానీ, డిస్ట్రిబ్యూటర్‌కు 90 కోట్ల నష్టం- ఎలా అంటే?
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ ప్రపంచవ్యాప్తంగా రికార్డులను తిరగరాస్తోంది. తాజాగా నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి బాలీవుడ్ చిత్రంగా దురంధర్ నిలిచింది. ఆ స్థానంలో ఉన్న షారుక్ ఖాన్ ‘పఠాన్’ను వెనక్కి నెట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది.
దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని రీతిలో దూసుకుపోతోంది. దీపికా పదుకొణె భర్త రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ విడుదలైనప్పటి నుంచి సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది.

తాజాగా ఈ దురంధర్ చిత్రం మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రంగా ఉన్న షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీ రికార్డును దురంధర్ సినిమా బద్దలు కొట్టింది.
నార్త్ అమెరికాలో రికార్డుల వేట
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ధురంధర్ నార్త్ అమెరికాలో నాలుగో మంగళవారం (డిసెంబర్ 30) నాటికి 17.50 మిలియన్ డాలర్ల మార్కును అధిగమించింది. గతంలో ‘పఠాన్’ సాధించిన 17.49 మిలియన్ డాలర్ల వసూళ్లను దురంధర్ దాటేసింది.
దీంతో నార్త్ అమెరికాలో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన తొలి హిందీ చిత్రంగా దురంధర్ నిలిచింది. అలాగే, ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న షారుక్ ఖాన్ పఠాన్ మూవీని వెనక్కి నెట్టేసింది ఈ సినిమా. అయితే, భారతీయ సినిమాల జాబితాలో చూస్తే.. ‘బాహుబలి 2’ (20+ మిలియన్ డాలర్లు), ‘కల్కి 2898 ఏడీ’ (18.50+ మిలియన్ డాలర్లు) తర్వాత మూడో స్థానంలో ధురంధర్ కొనసాగుతోంది.
వ్యాపార పరంగా భారీ నష్టం
అయితే, నార్త్ అమెరికాలో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన మొదటి రెండు ఇండియన్ సినిమాల్లో టాలీవుడ్ నుంచే ఉండటం విశేషం. మరోవైపు, దురంధర్ సినిమాకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్ పర్నాబ్ కపాడియా ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈతో పాటు పాకిస్తాన్‌లో ఈ దురంధర్‌పై నిషేధం విధించడం వల్ల సుమారు 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 90 కోట్లు) వరకు నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు.
"సాధారణంగా గల్ఫ్ దేశాలలో భారతీయ యాక్షన్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంటుంది. అక్కడ విడుదల అయి ఉంటే ధురంధర్ వసూళ్లు ఇంకా భారీగా ఉండేవి" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నిజ జీవిత ఘటనల నేపథ్యం
కాగా, స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ధురంధర్.. రెండు భాగాల సిరీస్‌లో మొదటిది. పాకిస్తాన్‌లోని కరాచీ అండర్ వరల్డ్‌లోకి చొరబడే ఒక భారతీయ గూఢచారి కథాంశంతో ఇది తెరకెక్కింది. 1999 నాటి IC-814 విమానం హైజాక్, 2001 భారత పార్లమెంట్ దాడి, 2008 ముంబై దాడులు వంటి వాస్తవ సంఘటనల స్ఫూర్తితో దర్శకుడు ఆదిత్య ధర్ ఈ కథను అత్యంత ఉత్కంఠభరితంగా మలిచారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


