సౌత్ సినిమాలను ఎడమ కాలితో తన్నేశాడు.. కుడి కాలితో ఇప్పుడు వణికించబోతున్నాడు: ధురంధర్ 2పై ఆర్జీవీ కామెంట్స్

ధురంధర్ మూవీపై రామ్ గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కొనసాగుతూనే ఉంది. ఈ మూవీతో సౌత్ సినిమాలను ఆదిత్య ధర్ ఎడమ కాలితో తన్నేశాడని అతడు అనడం విశేషం. ఇప్పటికే చాలాసార్లు ఆర్జీవీ ఈ సినిమాను పొగిడిన విషయం తెలిసిందే.

Published on: Dec 29, 2025, 13:32:23 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ ఏడాది నంబర్ 1 సినిమాగా నిలిచిన 'ధురంధర్' (Dhurandhar) ఏకంగా రూ. 1000 కోట్లు వసూలు చేసి రికార్డులు బద్దలు కొట్టింది. రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమాపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. బాలీవుడ్ పై సౌత్ సినిమాల ఆధిపత్యానికి ఈ సినిమా గట్టి సమాధానం ఇచ్చిందని, ఇక మార్చి 2026లో రాబోయే 'ధురంధర్ 2' ప్రేక్షకులను వణికిస్తుందని వర్మ హైప్ పెంచేశాడు.

సౌత్ సినిమాలను ఎడమ కాలితో తన్నేశాడు.. కుడి కాలితో ఇప్పుడు వణికించబోతున్నాడు: ధురంధర్ 2పై ఆర్జీవీ కామెంట్స్
సౌత్ సినిమాలను ఎడమ కాలితో తన్నేశాడు.. కుడి కాలితో ఇప్పుడు వణికించబోతున్నాడు: ధురంధర్ 2పై ఆర్జీవీ కామెంట్స్

ధురంధర్ 2 వణికిస్తుంది: ఆర్జీవీ

డిసెంబర్ 5న విడుదలై బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించిన 'ధురంధర్' సినిమాపై ఆర్జీవీ మరోసారి తనదైన శైలిలో స్పందించాడు. ఈ సినిమాను ఇండియన్ సినిమాకు ఒక పెద్ద మలుపుగా అభివర్ణించిన వర్మ.. ఇప్పుడు పార్ట్-2 గురించి ఇచ్చిన స్టేట్‌మెంట్ వైరల్ అవుతోంది.

సోమవారం (డిసెంబర్ 29) ఉదయం తన ఎక్స్ ఖాతాలో ఆర్జీవీ ఒక బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. పుష్ప, కేజీఎఫ్ వంటి సౌత్ సినిమాల ప్రభావాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ అతడు చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి.

"బాలీవుడ్ మీదకు దూసుకొచ్చిన సౌత్ సినిమాల 'ఫైర్ బాల్‌'ను.. ఆదిత్య ధర్ తన ఎడమ కాలితో 'ధురంధర్' రూపంలో వెనక్కి తన్నాడు. ఇప్పుడు తన కుడి కాలుతో 'ధురంధర్ 2' ని రెడీ చేస్తున్నాడు. నేను పార్ట్-2లో చూసిన దానిబట్టి చెప్తున్నా.. పార్ట్-1 మిమ్మల్ని భయపెట్టి ఉంటే, పార్ట్-2 మిమ్మల్ని వణికించేస్తుంది" అని వర్మ ట్వీట్ చేశాడు.

పాన్ ఇండియా మేకర్స్‌కు గుణపాఠం

ఇంతకుముందు కూడా రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. పాన్ ఇండియా దర్శకులు 'ధురంధర్' చూసి పాఠాలు నేర్చుకోవాలని అన్నాడు.

"హింస అనేది ప్రేక్షకులను కేవలం ఎంటర్టైన్ చేయకూడదు.. అది వాళ్లను బాధపెట్టాలి. యాక్షన్ అనేది ఆర్గానిక్ గా, ఎమోషనల్ గా ఉండాలి తప్ప.. లౌడ్ గా, లాజిక్ లేని కొరియోగ్రఫీలా ఉండకూడదు. ఇది మన వాళ్లు నేర్చుకోవాల్సిన పాఠం" అని విశ్లేషించాడు.

'ధురంధర్' సినిమా విశేషాలు

పాకిస్థాన్ లోని బలోచ్ గ్యాంగ్ లోకి చొరబడిన ఇండియన్ స్పై కథ ఇది. ఇందులో రణ్‌వీర్ సింగ్ (స్పై హంజా అలీ మజారీ అలియాస్ జస్కిరత్ సింగ్ రంగీ), అక్షయ్ ఖన్నా (గ్యాంగ్ లీడర్ రెహ్మాన్ డకైత్), సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ నటించారు.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లు దాటింది. ఇక రెండో పార్ట్ కూడా రాబోతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 19న రిలీజ్ చేయబోతున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More