Dhurandhar Story: ధురంధర్ స్టోరీ పీఎం ఆఫీస్ నుంచి వచ్చిందా? ఆ వైరల్ బోల్డ్ కామెడీ సీన్స్ వెనుక అసలు సీక్రెట్ ఇదే!
Dhurandhar Story: బాలీవుడ్ యాక్షన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచిన 'ధురంధర్' సిరీస్ స్క్రిప్ట్‌పై వస్తున్న రాజకీయ పుకార్లకు సీనియర్ నటుడు రాకేష్ బేడీ చెక్ పెట్టారు. ఈ హై-వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌లో ఆకట్టుకున్న వైరల్ కామెడీ సీన్ల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బయటపెట్టారు.
Dhurandhar Story: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, విజనరీ డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన హై-వోల్టేజ్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్' (Dhurandhar). థియేటర్లలో ఊహించని రేంజ్ యాక్షన్, తీవ్రమైన హింసతో కూడిన సీన్లతో ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అయితే, ఈ సీరియస్ యాక్షన్ డ్రామాలో ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించిన అంశం ఏదైనా ఉందంటే.. అది సినిమాలో అక్కడక్కడా వచ్చే అద్భుతమైన కామెడీ సీన్స్.

పీఎం ఆఫీస్ స్క్రిప్ట్ వివాదం
ధురంధర్ సినిమాలోని స్టోరీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ విజయాలను ఎక్కువగా చూపిస్తూ, గత ప్రభుత్వాలను తక్కువ చేసి చూపేలా ఉందనే విమర్శలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపించాయి. ఈ క్రమంలోనే 'ధురంధర్' స్క్రిప్ట్ అంతా ప్రధానమంత్రి కార్యాలయం (PMO) లోనే తయారైందంటూ కొందరు ప్రచారం మొదలుపెట్టారు.
న్యూఢిల్లీలో జరిగిన 'అమృత్ రత్న 2026' సదస్సుకు హాజరైన సీనియర్ నటుడు రాకేష్ బేడీ ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో పాకిస్తాన్ రాజకీయాల్లోకి చొరబడే భారతీయ ఏజెంట్ 'జమీల్ జమాలి' పాత్రలో ఆయన నటించారు.
బాతుల డైలాగ్ వెనుక కథ!
"నేను స్క్రిప్ట్‌ను రెండు మూడు సార్లు చదివినప్పుడు, ఇది చాలా గంభీరమైన, ఉద్వేగభరితమైన సినిమా అని నాకు అర్థమైంది. ఒక నటుడిగా నాకు సహజంగానే కామెడీ వైపు మొగ్గు ఎక్కువ కాబట్టి, ఈ తీవ్రమైన కథల మధ్య అక్కడక్కడా కాస్త హాస్యాన్ని పండిస్తే ప్రేక్షకులకు ఉపశమనం కలుగుతుందని భావించాను" అని రాకేష్ బేడీ తెలిపారు.
అయితే ఈ భారీ యాక్షన్ చిత్రంలో కామెడీని చేర్చడానికి దర్శకుడు ఆదిత్య ధర్ మొదట్లో అస్సలు ఇష్టపడలేదని, కానీ చిత్రీకరణ ముందుకు సాగుతున్న కొద్దీ ఆయన కూడా ఆ సీన్లను, ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ 'బాతుల కామెడీ డైలాగ్'ను ఎంతో ఆస్వాదించారని రాకేష్ బేడీ వివరించారు.
ఇండస్ట్రీ టాక్
గతంలో ఆదిత్య ధర్ తీసిన ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ సమయంలోనూ ఇలాంటి రాజకీయ విమర్శలు వచ్చాయి. అయితే ఈ పుకార్లపై రాకేష్ బేడీ తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. "సినిమాలో ఉన్న డబుల్ మీనింగ్ లేదా బోల్డ్ కామెడీ లైన్లను ఎవరూ పీఎంఓ లో కూర్చుని రాయలేరు. సినిమా సూపర్ హిట్ అవ్వగానే కొందరు మేధావులు ఈ కథ పీఎంఓ నుండి వచ్చిందని ప్రచారం మొదలుపెట్టారు. అక్కడ ఉన్నవాళ్లు అసలు ఇలాంటి లైన్లను ఊహించను కూడా ఊహించలేరు" అని నవ్వుతూ సమాధానమిచ్చారు.
కలెక్షన్ల సునామీ
'ధురంధర్' ఫ్రాంచైజీ ఇండియన్ సినిమా బాక్సాఫీస్ లెక్కలను పూర్తిగా మార్చేసింది. ధురంధర్ 1 మూవీ డిసెంబర్ 5, 2025న థియేటర్లలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా అక్షరాలా రూ.1,307 కోట్ల భారీ వసూళ్లను సాధించింది.
ధురంధర్ 2 చిత్రం ఈ ఏడాది మార్చి 19, 2026న విడుదలై ఏకంగా రూ.1,790 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో సంచలనం సృష్టించింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


