...
...
Next Story

Ranveer Singh: రణ్‌వీర్ సింగ్‌పై ఇండస్ట్రీ నిషేధం.. డాన్ 3 వివాదంపై నోరు విప్పిన స్టార్ హీరో.. ఏం చెప్పాడంటే?

Ranveer Singh: డాన్ 3 సినిమా నుంచి హఠాత్తుగా తప్పుకున్నాడనే కారణంతో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌పై ఎఫ్‌డబ్ల్యూఐసీఈ (FWICE) నిషేధం విధించడం సంచలనంగా మారింది. ఈ వివాదంపై రణ్‌వీర్ ప్రతినిధి అధికారిక ప్రకటన విడుదల చేశాడు. ఇందులో ఏముందో చూసేయండి.

Published on: May 26, 2026, 05:48:49 IST
Advertisement

Ranveer Singh: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, ప్రముఖ దర్శకుడు ఫర్హాన్ అక్తర్ మధ్య 'డాన్ 3' సినిమా చుట్టూ నడుస్తున్న వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ ప్రాజెక్ట్ నుండి రణ్‌వీర్ సింగ్ హఠాత్తుగా తప్పుకోవడాన్ని తీవ్రంగా పరిగణించిన ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) సంచలన నిర్ణయం తీసుకుంది.

రణ్‌వీర్ సింగ్‌ పై బ్యాన్

ఇండస్ట్రీ నిషేధంపై రణ్‌వీర్ సింగ్‌ రియాక్షన్ (AFP)
ఇండస్ట్రీ నిషేధంపై రణ్‌వీర్ సింగ్‌ రియాక్షన్ (AFP)

సినీ పరిశ్రమలో ఎవరు కూడా రణ్‌వీర్ సింగ్‌ కు సహకరించవద్దని, ఆయనతో కలిసి పనిచేయవద్దని ఈ కార్మిక సమాఖ్య గట్టిగా పిలుపునిచ్చింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంచలన నిర్ణయం అనంతరం రణ్‌వీర్ సింగ్ అధికారిక ప్రతినిధి స్పందిస్తూ ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశాడు. హీరోపై వస్తున్న విమర్శలు, పరిశ్రమ తీసుకున్న నిర్ణయంపై రణ్‌వీర్ సింగ్ ప్రతినిధి బృందం క్లారిటీ ఇచ్చింది.

అందుకే మౌనం

"సినిమా రంగానికి, అలాగే 'డాన్' ఫ్రాంచైజీతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరినీ రణ్‌వీర్ సింగ్ ఎప్పుడూ గౌరవిస్తాడు. 'డాన్ 3' చుట్టూ ఇటీవల జరుగుతున్న పరిణామాలపై ఆయన ఉద్దేశపూర్వకంగానే మౌనం పాటించాడు. వృత్తిపరమైన చర్చలు, వ్యక్తిగత బంధాలను ఎప్పుడైనా సరే పరిణతితో, పరస్పర గౌరవంతో, హుందాగా పరిష్కరించుకోవాలని ఆయన నమ్ముతాడు" అని రణ్‌వీర్ సింగ్‌ టీమ్ ఆ ప్రకటనలో పేర్కొంది.

రణ్‌వీర్ సింగ్‌ నిర్ణయం

ఈ వివాదంపై సోషల్ మీడియాలో, పరిశ్రమలో రకరకాల ఊహాగానాలు, కథనాలు ప్రచారంలో ఉన్నప్పటికీ, వాటిపై బహిరంగంగా స్పందించి వివాదాన్ని మరింత పెద్దది చేయడం రణ్‌వీర్‌కు ఇష్టం లేదని ప్రతినిధి తెలిపాడు.

తాజాగా మీడియా సమావేశంలో ఎఫ్‌డబ్ల్యూఐసీఈ (FWICE) ప్రతినిధులు ఈ వివాదంపై పూర్తి వివరాలు వెల్లడించారు. 'డాన్ 3' వివాదానికి సంబంధించి రణ్‌వీర్ సింగ్‌కు తాము గతంలోనే పలుమార్లు నోటీసులు పంపినట్లు వారు పేర్కొన్నారు. అయితే, ఈ నోటీసులపై స్పందించిన రణ్‌వీర్.. తమ మధ్య ఉన్న ఒప్పందపరమైన (కాంట్రాక్ట్) సమస్యలను చర్చించడానికి సినీ కార్మిక సమాఖ్య సరైన వేదిక (Appropriate Forum) కాదని సమాధానం ఇచ్చాడు. ఈ వైఖరిపై ఎఫ్‌డబ్ల్యూఐసీఈ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

"ఫెడరేషన్‌తో పాటు ఈ ప్రాజెక్ట్‌తో ముడిపడి ఉన్న వాటాదారుల పట్ల రణ్‌వీర్ సింగ్ ప్రదర్శించిన ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని, ఆయనపై సహాయ నిరాకరణ ఉత్తర్వులు (NCD) జారీ చేయాలని మా కార్యవర్గం నిర్ణయించింది" అని సమాఖ్య తమ ప్రకటనలో వెల్లడించింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: రణ్‌వీర్ సింగ్‌పై ఎఫ్‌డబ్ల్యూఐసీఈ ఎందుకు నిషేధం లేదా సహాయ నిరాకరణ ఉత్తర్వులు విధించింది?

జవాబు: దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన 'డాన్ 3' సినిమా నుంచి హీరో రణ్‌వీర్ సింగ్ హఠాత్తుగా, ముందస్తు సమాచారం లేకుండా తప్పుకున్నారనే ఫిర్యాదుపై చర్చించడానికి ఫెడరేషన్ నోటీసులు ఇచ్చింది. అయితే, ఈ సమస్యల పరిష్కారానికి ఫెడరేషన్ సరైన వేదిక కాదని రణ్‌వీర్ భావించడంతో, ఆయన ప్రవర్తనకు నిరసనగా సహాయ నిరాకరణ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రశ్న: ఈ వివాదంపై రణ్‌వీర్ సింగ్ అధికారికంగా ఏమని స్పందించారు?

జవాబు: రణ్‌వీర్ సింగ్ తన ప్రతినిధి ద్వారా స్పందిస్తూ.. పరిశ్రమపై, 'డాన్' ఫ్రాంచైజీపై తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపాడు. వృత్తిపరమైన విభేదాలను హుందాగా, పరిణతితో పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఊహాగానాలపై స్పందించకుండా మౌనంగా ఉన్నట్లు స్పష్టం చేశాడు.

ప్రశ్న: 'డాన్ 3' సినిమాలో రణ్‌వీర్ సింగ్ స్థానంలో హృతిక్ రోషన్ నటిస్తున్నాడా?

జవాబు: రణ్‌వీర్ సింగ్ తప్పుకున్న తర్వాత హృతిక్ రోషన్ పేరు ప్రచారంలోకి వచ్చినప్పటికీ, తాను ఈ ప్రాజెక్ట్‌లో నటించడం లేదని హృతిక్ రోషన్ ఇప్పటికే స్పష్టం చేస్తూ ఆ వార్తలను కొట్టిపారేశాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks