Rao Bahadur: టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు కళ్ళు అప్పగించి చూస్తున్న ఒకే ఒక్క ప్రాజెక్ట్ సత్యదేవ్ ‘రావు బహదూర్’. వెంకటేష్ మహా (Venkatesh Maha) డైరెక్ట్ చేసిన ఈ మైండ్ బెండింగ్ సైకలాజికల్ డ్రామా రేపు (జులై 3) థియేటర్లలోకి ఎంట్రీ ఇస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి టాప్ స్టార్ ఈ సినిమాను తన జీఎంబీ బ్యానర్‌పై ప్రెజెంట్ చేస్తుండటంతో ఇండస్ట్రీలో బజ్ మామూలుగా లేదు. దీనికితోడు తాజాగా ఈ సినిమాకు ప్రేక్షకులకు అందుబాటు ధరలో టికెట్లు రేట్లు నిర్ణయించి మేకర్స్ మరో సూపర్ ఎత్తు వేశారు.
మేకర్స్ బంపర్ ఆఫర్
ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడానికి రావు బహదూర్ మేకర్స్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం టికెట్ రేట్లు వందల్లో ఉంటున్నాయి. కొన్నిభారీ బడ్జెట్ సినిమాలు వచ్చినప్పుడు వాటిని భారీగా పెంచేస్తున్నారు. అంతేకాదు భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్న ఈ టైమ్‌లో ఆడియన్స్‌ను థియేటర్ల వరకు తీసుకురావడం పెద్ద ఛాలెంజ్.
అందుకే మంచి కంటెంట్ ఉన్న సినిమాను ఇలాంటి రీజనబుల్ రేట్లతో రిలీజ్ చేస్తే ఖచ్చితంగా మౌత్ టాక్ తోనే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని మేకర్స్ భావించారు. అందుకే ఏరియాను బట్టి అందుబాటు ధరలు నిర్ణయించారు.
సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ రేట్లు ఇవే
రావు బహదూర్ టీమ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన రీజనబుల్ టికెట్ రేట్స్ వివరాలు చూస్తే.. సింగిల్ స్క్రీన్స్ విషయానికి వస్తే నైజాంలో రూ. 150, ఆంధ్రాలో రూ. 145, సీడెడ్‌లో కేవలం రూ. 100 గా ఫిక్స్ చేశారు. అలాగే మల్టీప్లెక్స్ ఆడియన్స్‌కు కూడా భారీ ఊరట ఇచ్చారు. తెలంగాణలోని మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధర రూ. 200 గా, ఏపీలో రూ. 177 గా సెట్ చేశారు.
ఈ రేట్లు చూసి సినిమా లవర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇలాంటి పర్ఫెక్ట్ ప్రైసింగ్ స్ట్రాటజీ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాకి క్యూ కట్టడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. దీపా థామస్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా.. వికాస్ ముప్పల, బాల పరాశర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాకా, మాస్టర్ కిరణ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
{{/usCountry}}ఈ రేట్లు చూసి సినిమా లవర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇలాంటి పర్ఫెక్ట్ ప్రైసింగ్ స్ట్రాటజీ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాకి క్యూ కట్టడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. దీపా థామస్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా.. వికాస్ ముప్పల, బాల పరాశర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాకా, మాస్టర్ కిరణ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
{{/usCountry}}చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర ఈ డార్క్ డ్రామాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. రేపు థియేటర్లలో సత్యదేవ్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
సత్యదేవ్.. వెరైటీ కథలతో..
సత్యదేవ్ స్క్రిప్ట్ సెలెక్షన్ ఎప్పుడూ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. 'బ్లఫ్ మాస్టర్', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య', 'కృష్ణమ్మ' లాంటి సినిమాలతో తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు.
ఇప్పుడు రావు బహదూర్ క్యారెక్టర్‌తో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టడానికి రెడీ అయ్యాడు. టీజర్, ట్రైలర్ చూస్తుంటే సత్యదేవ్ యాక్టింగ్ ఈ సినిమాకు ప్రాణం పోసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
డైరెక్టర్ మార్క్..
ఈ సినిమాకి మరో మెయిన్ పిల్లర్ డైరెక్టర్ వెంకటేష్ మహా. 'కేరాఫ్ కంచరపాలెం' లాంటి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్‌తో తన మార్క్ చూపించిన మహా, ఈసారి కంప్లీట్ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్‌తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ క్రేజీ కాంబోను నమ్మి ఏకంగా మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినిమా రేంజ్ అమాంతం పెరిగిపోయింది.
రావు బహదూర్ - టికెట్ రేట్లు ఇలా..
✦ సింగిల్ స్క్రీన్స్ (నైజాం): రూ. 150
✦ సింగిల్ స్క్రీన్స్ (ఆంధ్రా): రూ. 145
✦ సింగిల్ స్క్రీన్స్ (సీడెడ్): రూ. 100
✦ మల్టీప్లెక్స్ (తెలంగాణ): రూ. 200
✦ మల్టీప్లెక్స్ (ఏపీ): రూ. 177
✦ రిలీజ్ డేట్: జులై 3, 2026