...
...
Next Story

Rashmi Gautam: జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ ఇన్ని సినిమాలు చేసిందా? చిరుతో కూడా.. అదే టర్నింగ్ పాయింట్

Rashmi Gautam: హాయ్, హలో అంటూ జబర్దస్త్ షోలో యాంకర్ గా అదరగొడుతున్న బ్యూటీ రష్మి గౌతమ్ చేసిన సినిమాలు ఎన్నో మీకు తెలుసా? ఆ నంబర్ తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు. ఇన్ని మూవీస్ చేసిందా? అని అనుకుంటారు. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి.

Published on: May 23, 2026, 15:14:06 IST
Advertisement

Rashmi Gautam: బుల్లితెర నుంచి సిల్వర్ స్క్రీన్ కు వెళ్లిన నటీనటులు చాలా మందే ఉన్నారు. అలాగే వెండి తెర నుంచి స్మాల్ స్క్రీన్ కు వెళ్లిన స్టార్లూ ఉన్నారు. ఇప్పుడు జబర్దస్త్ లో యాంకర్ గా అలరిస్తున్న రష్మి గౌతమ్.. బిగ్ స్క్రీన్ నుంచి టీవీల్లోకి వచ్చింది. జబర్దస్త్ కామెడీ షోతో ఆడియన్స్ ఆదరణ పొందుతోంది. ఆమె చేసిన సినిమాలపై లుక్కేయండి.

రష్మి గౌతమ్ సినిమాలు

జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ చేసిన సినిమాలు తెలుసా? (instagram)
జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ చేసిన సినిమాలు తెలుసా? (instagram)

జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్ గా సత్తాచాటుతున్న రష్మి గౌతమ్ ఒకటో రెండో మూవీస్ చేసిందని చాలా మంది అనుకుంటుంటారు. కానీ రష్మీ ఇప్పటివరకూ తన కెరీర్ లో ఏకంగా 27 సినిమాల్లో మెరిసింది. ఇందులో తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల సినిమాలూ ఉండటం గమనార్హం.

ఆ మూవీతో మొదలెట్టి

ఒడియా మదర్ కు, యూపీ ఫాదర్ కు వైజాగ్ లో పుట్టిన రష్మి గౌతమ్ 2002లో వచ్చిన హోలీ మూవీతో డెబ్యూ చేసింది. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్లతో క్రమంగా రష్మి గౌతమ్ కు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఆది కేరాఫ్ ఏబీఎన్ కాలేజీ, థ్యాంక్స్, కరెంట్, ఎవరైనా ఎపుడైనా, వెల్ డన్ అబ్బా (హిందీ), గణేష్ జస్ట్ గణేష్, బిందాస్, చలాకీ, ప్రస్థానం తదితర సినిమాల్లో రష్మి గౌతమ్ నటించింది.

బోల్డ్ యాక్టింగ్ తో

2016లో వచ్చిన గుంటూరు టాకీస్ మూవీలో బోల్డ్ యాక్టింగ్ తో రష్మి గౌతమ్ అందరినీ షాక్ కు గురి చేసింది. రాణి గారి బంగ్లా, తను వచ్చెనంట, నెక్ట్స్ నువ్వే, అంతకుమించి లాంటి హారర్ థ్రిల్లర్లతో రష్మీ సత్తాచాటింది. మెగాస్టార్ చిరంజీవి పక్కన కూడా మెరిసింది ఈ బ్యూటీ. భోళా శంకర్ సినిమాలోని భోళా సాంగ్ లో చిరుతో స్టెప్పులేసింది రష్మి.

జబర్దస్త్ తో మారిన రాత

ప్రస్తుతం ఈటీవీలో వస్తున్న జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు హోస్ట్ గా ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తుంది రష్మి గౌతమ్. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ ఇష్యూస్ పై రియాక్టవుతుంది. ఇక ఆమెకు స్ట్రీట్ డాగ్స్ కు ఫీడింగ్ అందించడం ఇష్టం.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe