Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కేవలం వెండితెరపై నటనతోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ తన ఉదారతతో అందరి హృదయాలను గెలుచుకుంటున్నారు. తన భర్త విజయ్ దేవరకొండతో (Vijay Deverakonda) పెళ్లి తర్వాత కలిసి నటించిన మొదటి భారీ చారిత్రాత్మక చిత్రం 'రణబాలి' (Ranabaali) విడుదలకు సిద్ధమవుతున్న వేళ ఆమె తీసుకున్న ఒక సంచలన నిర్ణయం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఈ సినిమాలో తాను పోషించిన 'జయమ్మ' పాత్ర ఇచ్చిన ప్రేరణతో ఏకంగా 400 పేద కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు రష్మిక అధికారికంగా ప్రకటించారు. ఈ కుటుంబాలకు తదుపరి మూడు నెలల పాటు ఉచితంగా నిత్యావసర సరుకులు అందించనున్నట్లు వెల్లడించారు.
"నా కన్నీళ్లు, నిద్రలేని రాత్రులకు దక్కిన నిజమైన బహుమతి ఇది!"
ఈ ఛారిటీకి సంబంధించిన రేషన్ కిట్ల పంపిణీ వీడియోను రష్మిక తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. "మనం చేసే పాత్రలు మన జీవితాలపై చాలా ప్రభావం చూపుతాయి. చాలా మంది నన్ను జయమ్మ పాత్రకు, నాకు ఉన్న పోలికల గురించి అడుగుతుంటారు. నా సమాధానం అవును. సహాయం చేసే గుణం నాలో ఎప్పుడూ ఉంది, జయమ్మలోనూ అదే ఉంది. ఇప్పటివరకు ఇలాంటి విషయాలను సీక్రెట్‌గా ఉంచాను. కానీ ఈ రోజు బయటకు చెప్పడానికి కారణం.. ఇది చూసి మీలో ఒక్కరు ప్రేరణ పొందినా నేను చాలా సంతోషిస్తాను" అని రాసుకొచ్చారు.
ఒకేసారి 400 కుటుంబాలకు 3 నెలల పాటు సరుకులు అందిస్తూ, రాబోయే ఏడాది పొడవునా ఈ సైకిల్‌ను కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేశారు. దీనికి ప్రాజెక్ట్ అన్నపూర్ణ అనే పేరు పెట్టడం విశేషం. పేద ప్రజలు సరుకుల కోసం పెట్టే ఖర్చును దాచుకుని తమ భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకుంటారనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ షూటింగ్ సమయంలో పడ్డ కష్టం, నిద్రలేని రాత్రులు, గాయాలు, కన్నీళ్లు.. వీటన్నిటికీ ఆ పేద ప్రజల ముఖాల్లోని చిరునవ్వులే అసలైన బహుమతి అని రష్మిక ఎమోషనల్ అయ్యారు.
'రణబాలి' స్టోరీ, సీమ కరవు
రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రణబాలి' చిత్రం 1876-78 కాలంలో భారతదేశాన్ని పట్టిపీడించిన భయంకరమైన కరువు (Great Famine) నేపథ్యంలో తెరకెక్కింది. బ్రిటీష్ పాలకులు భారతదేశం నుంచి ధాన్యాన్ని ఇతర దేశాలకు తరలించడం వల్ల రాయలసీమతో పాటు దక్షిణాదిలో లక్షలాది మంది ఆకలితో అలమటించి ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో బ్రిటీష్ అధికారులపై తిరుగుబాటు చేసిన యోధుడిగా విజయ్ దేవరకొండ నటించగా, ఆయనకు అండగా నిలిచే ధైర్యవంతురాలైన భార్య జయమ్మగా రష్మిక కనిపించనున్నారు.
{{/usCountry}}రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రణబాలి' చిత్రం 1876-78 కాలంలో భారతదేశాన్ని పట్టిపీడించిన భయంకరమైన కరువు (Great Famine) నేపథ్యంలో తెరకెక్కింది. బ్రిటీష్ పాలకులు భారతదేశం నుంచి ధాన్యాన్ని ఇతర దేశాలకు తరలించడం వల్ల రాయలసీమతో పాటు దక్షిణాదిలో లక్షలాది మంది ఆకలితో అలమటించి ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో బ్రిటీష్ అధికారులపై తిరుగుబాటు చేసిన యోధుడిగా విజయ్ దేవరకొండ నటించగా, ఆయనకు అండగా నిలిచే ధైర్యవంతురాలైన భార్య జయమ్మగా రష్మిక కనిపించనున్నారు.
{{/usCountry}}అక్టోబర్ 16న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తెరపై జయమ్మగా మెప్పించడమే కాకుండా తెరవెనుక కూడా వందలాది కుటుంబాలకు అండగా నిలిచిన రష్మిక మందన్నపై నెటిజన్లు, సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.