ఉదయ్ పూర్ లోని మెమెంటోస్ బై ఐటీసీ హోటల్లో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి సందడి ఊపందుకుంది. ఈ విరోష్ జంట ఫిబ్రవరి 26న మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానుంది. ఈ నేపథ్యంలో హోటల్లో విరోష్ లవ్ స్టోరీని తెలిపేలా ప్రత్యేకంగా ఫొటో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇవి ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. వీటికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ గా మారాయి.
విరోష్ ఫొటోలు

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి ముహూర్తం దగ్గరపడింది. ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమెంటోస్ హోటల్లో విరోష్ వెడ్డింగ్ గ్రాండ్ గా జరగబోతుంది. అంతకంటే ముందు ప్రి వెడ్డింగ్ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. మెహందీతో పెళ్లి సందడి మొదలైందని తెలిసింది. ఇక హల్దీ, సంగీత్ కూడా నిర్వహించనున్నారని సమాచారం. ఈ ఈవెంట్ల కోసం డెకరేషన్ అదరగొట్టారని తెలిసింది. ముఖ్యంగా విరోష్ లవ్ స్టోరీని తెలిపేలా ఉన్న ఫొటో ఫ్లెక్సీలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి.
ఆన్ లైన్ లో లీక్
విరోష్ వెడ్డింగ్ కోసం కట్టుదిట్టమైన సెక్యూరిటీ పెట్టారు. అత్యంత ప్రైవసీ నడుమ వీళ్ల పెళ్లి జరగబోతుంది. ఈ నేపథ్యంలో హోటల్ నుంచి వీడియో ఆన్ లైన్ లో లీక్ కావడం గమనార్హం. రష్మిక, విజయ్ ఫొటో ఫ్లెక్సీల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోలను రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
తరలివస్తున్న అతిథులు
ఫిబ్రవరి 26న జరిగే విరోష్ వెడ్డింగ్ కోసం సెలబ్రిటీలు ఉదయ్ పూర్ కు తరలి వెళ్తున్నారు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ కలిసి వెళ్లారు. విజయ్ దేవరకొండకు పెళ్లి చూపులు లాంటి బ్లాక్ బస్టర్ మూవీని తరుణ్ అందించాడు. తరుణ్, విజయ్ మంచి ఫ్రెండ్స్. అలాగే రష్మిక మందన్న క్లోజ్ ఫ్రెండ్ శ్రావ్య వర్మ, హీరోయిన్ ఆషికా రంగనాథ్, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కూడా ఉదయ్ పూర్ చేరుకున్నారు.
విరోష్ లవ్ స్టోరీ
{{/usCountry}}ఫిబ్రవరి 26న జరిగే విరోష్ వెడ్డింగ్ కోసం సెలబ్రిటీలు ఉదయ్ పూర్ కు తరలి వెళ్తున్నారు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ కలిసి వెళ్లారు. విజయ్ దేవరకొండకు పెళ్లి చూపులు లాంటి బ్లాక్ బస్టర్ మూవీని తరుణ్ అందించాడు. తరుణ్, విజయ్ మంచి ఫ్రెండ్స్. అలాగే రష్మిక మందన్న క్లోజ్ ఫ్రెండ్ శ్రావ్య వర్మ, హీరోయిన్ ఆషికా రంగనాథ్, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కూడా ఉదయ్ పూర్ చేరుకున్నారు.
విరోష్ లవ్ స్టోరీ
{{/usCountry}}రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ జంట 2018లో రిలీజైన గీత గోవిందం సినిమా కోసం తొలిసారి కలిసి యాక్టింగ్ చేశారు. ఆ మూవీ షూటింగ్ సమయంలోనే వీళ్ల మధ్య ప్రేమ మొదలైందని టాక్. ఆ తర్వాత 2019లో రిలీజైన డియర్ కామ్రేడ్ మూవీ కోసం కూడా కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
ఇప్పుడు విరోష్ తమ వెడ్డింగ్ తో ఒక్కటి కాబోతున్నారు. ఈ జంట ప్రస్తుతం రణబాలి సినిమాలోనూ కలిసి నటిస్తోంది.