ఎయిర్‌పోర్ట్‌లో లవ్ బర్డ్స్.. ఒకే కార్లో వెళ్లిన రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ.. పెళ్లి పనుల్లో బిజీ!
త్వరలో మూడుముళ్ల బంధంతో లవ్ బర్డ్స్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఒక్కటి కానున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంబయి ఎయిర్ పోర్ట్ లో ఈ జంట కలిసి కనిపించింది. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు అనిపించింది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండల పెళ్లి గురించిన గుసగుసలు హాట్ టాపిక్ గా కొనసాగుతూనే ఉన్నాయి. వీళ్లిద్దరు ఇదే నెలలో మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం (ఫిబ్రవరి 15) రాత్రి రష్మిక, విజయ్ ముంబయి ఎయిర్ పోర్ట్ లో కనిపించడం వైరల్ గా మారింది. వీళ్లిద్దరు కలిసి ఒకే కార్లో వెళ్లారు.

ఎయిర్ పోర్ట్ లో రష్మిక, విజయ్
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ తాజాగా ముంబయి వెళ్లారు. అక్కడి ఎయిర్ పోర్ట్ లో వీళ్లు వేర్వేరుగానే కనిపించారు. విడివిడిగానే బయటకు వచ్చారు. రష్మిక బ్రౌన్ టాప్, బ్లాక్ జీన్స్, బూట్లతో సాధారణ దుస్తుల్లో కనిపించింది. ఆమె ఒక పుస్తకం పట్టుకుని, ఫోటోగ్రాఫర్‌లకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ టెర్మినల్ నుంచి బయటకు వెళ్లింది.
కార్లో కలిసి
విజయ్ దేవరకొండ కూడా అదే సమయంలో ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు. అతను బ్లాక్ టీ షర్ట్, లేత గోధుమ రంగు ప్యాంట్ వేసుకున్నాడు. ముఖానికి మాస్క్ తో వచ్చిన విజయ్ ను ఓ ఫ్యాన్ గుర్తుపట్టాడు. ఆ అభిమానితో ఫొటో కోసం విజయ్ మాస్క్ తీశాడు. ఆ తర్వాత ఫొటోగ్రాఫర్లకు దూరంగా వెళ్లిపోయాడు. ఆ తర్వాత విజయ్, రష్మిక కలిసి ఒకే కార్లో విమానాశ్రయం నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో వైరల్ గా మారింది.
రష్మిక, విజయ్ పెళ్లి
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లోని కోటలో జరగనుందని సమాచారం. ఈ జంట 2025లో అక్టోబర్ 3న ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఉదయ్ పూర్ లో పెళ్లి తర్వాత రష్మిక, విజయ్ హైదరాబాద్ లో రిసెప్షన్ నిర్వహించనున్నారని తెలిసింది. ఈ పెళ్లి పనుల్లోనే విజయ్, రష్మిక బిజీగా గడుపుతున్నారు.
సీఎం రేవంత్ తో
విజయ్ దేవరకొండ రీసెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తన పెళ్లికి రేవంత్ రెడ్డిని పిలిచేందుకు విజయ్ వెళ్లారని తెలిసింది. ఇప్పుడు ముంబయిలో కొంతమంది సెలబ్రిటీలను తమ వెడ్డింగ్ కు ఆహ్వానించేందుకు రష్మిక, విజయ్ వెళ్లారని టాక్.
2018లో వచ్చిన గీత గోవిందం సినిమా కోసం రష్మిక, విజయ్ తొలిసారి కలిసి నటించారు. అప్పుడే వీళ్ల మధ్య పరిచయం ఏర్పడింది. 2019లో వచ్చిన డియర్ కామ్రేడీ మూవీతో ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇప్పుడు రష్మిక, విజయ్ కలిసి రణబాలి మూవీ చేస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


