Rashmika Mandanna: బాక్సాఫీస్ క్వీన్.. బర్త్‌డే భామ రష్మిక మందన్న నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. కళ్లు చెదిరే ఆస్తులు
Rashmika Mandanna: బాక్సాఫీస్ క్వీన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న బర్త్ డే ఈ రోజు. విజయ్ దేవరకొండ భార్యగా ఆమెకు ఇది మొదటి పుట్టిన రోజు. ఈ సందర్భంగా రష్మిక ఆస్తులు, రెమ్యూనరేషన్, నెట్ వర్త్ పై ఓ లుక్కేయండి.
దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు తన నటనతో, చిలిపి నవ్వుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న 'నేషనల్ క్రష్' రష్మిక మందన్న బర్త్ డే ఈ రోజు (ఏప్రిల్ 5). ఆమె 30వ పుట్టినరోజు జరుపుకొంటోంది. ఈ ఏడాది ఆమె పుట్టినరోజు మరింత ప్రత్యేకం. నటుడు విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్న తర్వాత ఆమె జరుపుకుంటున్న మొదటి బర్త్ డే కావడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.

బాక్సాఫీస్ క్వీన్
రష్మిక మందన్న బాక్సాఫీస్ క్వీన్ గా దూసుకెళ్తోంది. ముఖ్యంగా కరోనా పాండమిక్ తర్వాత రష్మిక జోరు మామూలుగా లేదు. అత్యధిక వసూళ్లు రాబట్టిన హీరోయిన్‌గా రష్మిక రికార్డు సృష్టించింది. రష్మిక నటించిన గత అయిదు సినిమాల నుంచి ఏకంగా రూ.2,070 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
రష్మిక రెమ్యునరేషన్
'పుష్ప 2: ది రూల్', 'సికందర్', 'ఛావా', ‘యానిమల్’ వంటి సినిమాలతో రష్మిక మందన్న పేరు మార్మోగింది. ప్రస్తుతం రష్మిక మందన్న ఒక్కో సినిమాకు 4 నుంచి 8 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే, 'పుష్ప' వంటి పాన్-ఇండియా ప్రాజెక్టుల కోసం ఆమె 10 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
నెట్ వర్త్
ఫోర్బ్స్ నివేదికల ప్రకారం, 2026 నాటికి రష్మిక మందన్న నికర ఆస్తుల విలువ (Net Worth) సుమారు 66 కోట్ల రూపాయలుగా అంచనా. కేవలం సినిమాల ద్వారానే కాకుండా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, పెట్టుబడుల ద్వారా కూడా రష్మిక భారీగా సంపాదిస్తోంది.
కల్యాణ్ జ్యువెలర్స్, 7UP, బోట్ (boAt), స్వరోవ్‌స్కీ (Swarovski), మీషో వంటి ప్రముఖ బ్రాండ్లకు రష్మిక మందన్న ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. అంతేకాకుండా, వేగన్ బ్యూటీ బ్రాండ్ 'ప్లమ్' (Plum) లో ఆమె ఇన్వెస్ట్ చేసింది.
లగ్జరీ కార్లు
రష్మికకు స్థిరాస్తి రంగంలోనూ గట్టి పట్టు ఉంది. హైదరాబాద్‌తో పాటు ముంబై, గోవా, కూర్గ్, బెంగళూరు వంటి నగరాల్లో ఆమెకు సొంత ఇళ్లు ఉన్నాయి. ముఖ్యంగా బెంగళూరులోని ఐటీ హబ్‌లో ఆమెకు ఉన్న నివాసం విలువ దాదాపు 8 కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. ఇక ఆమె కార్ల గ్యారేజీలో ఆడి క్యూ3, రేంజ్ రోవర్ స్పోర్ట్, మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ వంటి లగ్జరీ వెహికిల్స్ ఉన్నాయి.
రాబోయే సినిమాలు
'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమాతో ప్రశంసలు అందుకున్న రష్మిక చేతిలో ప్రస్తుతం వరుస ప్రాజెక్టులు ఉన్నాయి. హిందీలో షాహిద్ కపూర్, కృతి సనన్ తో కలిసి 'కాక్ టెయిల్ 2'లో నటిస్తోంది. అలాగే, రవీంద్ర పుల్లె దర్శకత్వంలో 'మైసా' అనే మాస్ యాక్షన్ చిత్రంలో రష్మిక కనిపించనుంది.
అన్నింటికంటే ముఖ్యంగా, తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి 'రణబాలి' చిత్రంలో రష్మిక మందన్న నటిస్తోంది. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత ఈ జంట మళ్లీ వెండితెరపై మెరవబోతుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
1. రష్మిక మందన్న పుట్టినరోజు ఎప్పుడు?
రష్మిక మందన్న ఏప్రిల్ 5, 1996న జన్మించారు. 2026 నాటికి ఆమె వయస్సు 30 ఏళ్లు.
2. రష్మిక మందన్న ప్రస్తుత ఆస్తుల విలువ ఎంత?
ప్రముఖ ఆర్థిక సంస్థ ఫోర్బ్స్ నివేదికల ప్రకారం, 2026 నాటికి రష్మిక నికర ఆస్తుల విలువ సుమారు 66 కోట్ల రూపాయలు.
3. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్న కొత్త సినిమా ఏది?
ఈ క్రేజీ జంట 'రణబాలి' అనే తెలుగు సినిమాలో కలిసి నటిస్తోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper












