Ustaad Bhagat Singh Collections: ఉస్తాద్ భగత్ సింగ్ కు భారీ షాక్.. దారుణంగా పడిపోయిన కలెక్షన్లు.. కేవలం రూ.1.75 కోట్లు

Ustaad Bhagat Singh Collections: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు బిగ్ షాక్ తగిలింది. ఆరో రోజు వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఈ మూవీ ఇంకా రూ.100 కోట్ల కలెక్షన్ ను అందుకోలేకపోయింది.

Published on: Mar 25, 2026, 11:53:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశి ఖన్నా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' బాక్సాఫీస్ రన్ చాలా స్లోగా సాగుతోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం, ఆరో రోజు కలెక్షన్ల పరంగా భారీ క్షీణతను చూసింది. ట్రేడ్ వెబ్‌సైట్ సక్నిల్క్ గణాంకాల ప్రకారం, ఈ సినిమా తన ప్రారంభ జోష్‌ను నిలబెట్టుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది.

పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్

ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్లు

ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఇండియాలో ఈ మూవీ మార్చి 24న కేవలం రూ.1.75 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే సాధించినట్లు సక్నిల్క్ తెలిపింది. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో సినిమాకు ఇలాంటి కలెక్షన్లు ఊహించనిదే.

థియేటర్లలో కేవలం 19.0% ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైంది. అంటే ప్రేక్షకులు థియేటర్లకు రావడం బాగా తగ్గిపోయిందని అర్థం. ప్రస్తుతం ఈ సినిమా మొత్తం వసూళ్లు రూ.64.60 కోట్లుగా ఉన్నాయి, ఇది బడ్జెట్ పరంగా ఆందోళన కలిగించే విషయం.

'ధురంధర్ 2' నుంచి గట్టి పోటీ

తెలుగు రాష్ట్రాల్లో రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్: ది రివెంజ్' సినిమా నుంచి 'ఉస్తాద్ భగత్ సింగ్'కు గట్టి పోటీ ఎదురవుతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లు వసూలు చేసి ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ హిందీ సినిమా ప్రభావం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాకు రావాల్సిన వసూళ్లు భారీగా తగ్గుముఖం పట్టాయని అనలిస్ట్ లు చెబుతున్నారు.

మొదటి రోజు జోరు ఏది?

మొదటి రోజు రూ.34.75 కోట్లతో అదిరిపోయే ఓపెనింగ్స్ సాధించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం, రెండో రోజు నుండే నెమ్మదించడం మొదలైంది. రెండో రోజు రూ.9.00 కోట్లు, మూడో రోజు రూ.9.10 కోట్లు వసూలు చేస్తూ వస్తున్న ఈ సినిమా, ఇప్పుడు రూ.1.75 కోట్లకు పడిపోయింది. థియేటర్ ఆక్యుపెన్సీ కూడా 69% నుండి క్రమంగా 19% కి పడిపోవడం సినిమా నెగెటివ్ టాక్‌ను సూచిస్తోంది.

ఆ మూవీస్

పవన్ కళ్యాణ్ గత ప్రాజెక్టులైన ‘ఓజీ, 'హరి హర వీర మల్లు'తో పోలిస్తే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వసూళ్లు చాలా వెనుకబడి ఉన్నాయి. 'ఓజీ' సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే రూ.130 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు సృష్టించింది. కానీ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఇంకా రూ.100 కోట్ల మైలురాయిని కూడా చేరలేకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More