Virosh: బాల‌కృష్ణ ముందు విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ర‌ష్మిక కాల్..ల‌వ‌ర్ మాట‌ల‌కు సిగ్గుప‌డ్డ నేష‌న‌ల్ క్ర‌ష్‌.. వీడియో వైర‌ల్‌

Virosh: రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ చాలా ఏళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. బయటకు చెప్పకపోయినా అప్పుడప్పుడు కొన్ని సంఘటనల ద్వారా ఈ విషయంపై క్లారిటీ వచ్చేది. ఇప్పుడు ఈ లవ్ బర్డ్స్ పెళ్లితో ఒకటవుతున్న నేపథ్యంలో వీళ్లకు సంబంధించిన ఓ పాత వీడియో తెగ వైరల్ అవుతోంది. 

Published on: Feb 25, 2026, 10:15:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఒక్కటి కాబోతున్నారు. మూడు ముళ్ల బంధంతో కలిసిపోనున్నారు. ఫిబ్రవరి 26న విరోష్ వెడ్డింగ్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ పాత వీడియో తెగ వైరల్ గా మారింది. ఇందులో విజయ్ దేవరకొండకు కాల్ చేసిన రష్మిక అతని మాటలతో సిగ్గుపడుతుంది.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి

విజయ్ కు రష్మిక కాల్

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ చాలా కాలం నుంచే డేటింగ్ లో ఉన్నారు. వీళ్ల రిలేషన్ షిప్ పై చాలా వార్తలు వచ్చినా వీళ్లు రియాక్ట్ కాలేదు. కానీ కలిసి బయట కనిపించారు. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్ స్టాపబుల్ షోలో విజయ్, రష్మిక మధ్య క్యూట్ మూమెంట్ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. అప్పుడు విజయ్ కు రష్మిక ఫోన్ చేసింది.

ఏం జరిగిందంటే?

2023లో రష్మిక, రణ్‌బీర్ కపూర్ జంటగా నటించిన యానిమల్ మూవీ వచ్చింది. దీనికి సందీప్ రెడ్డి వంగా డైరెక్టర్. ఈ టీమ్ తమ మూవీ ప్రమోషన్ కోసం నందమూరి బాలకృష్ణ షో అన్ స్టాపబుల్ కు వచ్చింది. అప్పుడు విజయ్ కు కాల్ చేయమని రష్మికను రణ్‌బీర్ అడిగాడు. బాలయ్య కూడా చెప్పడంతో రష్మిక కాల్ చేసింది.

కాల్ లిఫ్ట్ చేసిన విజయ్ దేవరకొండ డైరెక్ట్ గా ‘వాట్సాప్ రే’ అనడంతో రష్మిక మందన్నకు సిగ్గు ముంచుకొచ్చింది. ఆమె క్యూట్ గా సిగ్గుపడింది. అప్పుడు పక్కనే ఉన్న రణ్‌బీర్ నవ్వకుండా ఉండలేకపోయాడు. ఆ తర్వాత ‘నువ్వు స్పీకర్ లో ఉన్నావు’ అని రష్మిక విజయ్ కు హింట్ ఇచ్చింది. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

విరోష్ వెడ్డింగ్

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకోబోతున్నారు. వీళ్లు తమ వెడ్డింగ్ కు విరోష్ వెడ్డింగ్ అని పేరు పెట్టారు. ఇప్పటికే మెహందీ, హల్దీ, సంగీత్ లాంటి ప్రి వెడ్డింగ్ ఈవెంట్లతో పెళ్లి సందడి మొదలైంది. 2018లో వచ్చిన గీత గోవిందం సినిమాలో రష్మిక, విజయ్ కలిసి తొలిసారి నటించారు. అప్పుడే వాళ్ల మధ్య లవ్ మొదలైనట్లు చెపుతారు.

2019లో రిలీజైన డియర్ కామ్రేడ్ సినిమాలోనూ రష్మిక, విజయ్ కలిసి మరోసారి స్క్రీన్ పై మాయ చేశారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో వీళ్ల ప్రేమ మరింత ముదిరింది. 2025 అక్టోబర్ లో విరోష్ జంట ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇప్పుడు పెళ్లితో ఒక్కటి కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More