రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వాళ్ల గురించే ఎక్కువగా చర్చ నడుస్తోంది. తాజాగా రష్మిక ఎక్స్ వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. తన గురించి ఎవరో రాసిన ఒక ఆర్టికల్ చదివి తను ఎంతలా భావోద్వేగానికి గురైందో వివరిస్తూ, తన మనసులోని మాటలను అభిమానులతో పంచుకుంది. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
రష్మిక ట్వీట్‌లో ఏముందంటే..

చాలా కాలం తర్వాత తన గురించి రాసిన ఒక విషయం చదివి తను ఇంతలా ఎమోషనల్ అవ్వడం బహుశా ఇదే తొలిసారి అని రష్మిక మందన్న రాసుకొచ్చింది.
"చెప్పాలని నా మనసులో చాలా ఉంది.. కానీ నేను బయటపెట్టగలిగేది చాలా తక్కువే. నేను నాకంటూ ఒక సొంత స్పేస్ వెతుక్కుంటున్నాను.. నేను చేస్తున్న ఈ ప్రయాణం పట్ల ఎంతో కృతజ్ఞతతో ఉన్నాను. నా ఈ జర్నీని గుర్తించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు" అని చెప్పింది.
స్వేచ్ఛను ఇచ్చే ప్రేమే నిజమైన ప్రేమ
ఈ పోస్ట్‌లో అందరినీ అత్యంత ఆకర్షించిన లైన్ ఒకటుంది. "ప్రేమ గురించి నేను చెప్పగలిగేది ఒకటే - మిమ్మల్ని స్వేచ్ఛగా ఉంచే ప్రేమను వెతుక్కోండి" అని రష్మిక ఒక అద్భుతమైన సందేశం ఇచ్చింది. విజయ్ దేవరకొండ తనను ఎంత స్వేచ్ఛగా ఉంచుతాడో, తన కలలను సాధించడంలో అతడు ఇచ్చే ప్రోత్సాహం ఎలాంటిదో ఈ ఒక్క మాటతో రష్మిక చాలా స్పష్టంగా చెప్పేసింది.
వెడ్డింగ్ పోస్ట్‌లోనూ ఇలాగే..
రీసెంట్‌గా ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో జరిగిన లగ్జరీ వెడ్డింగ్‌లో విజయ్‌ను పెళ్లాడిన రష్మిక.. తన భర్త గురించి చేసిన మొదటి పోస్ట్‌లో కూడా ఇలాంటి మాటలే చెప్పింది. "నేను పెద్ద పెద్ద కలలు కనడం తప్పు కాదని చెప్పిన వ్యక్తి, నన్ను ఎవరూ చూడటం లేనట్లుగా స్వేచ్ఛగా డ్యాన్స్ చేయకుండా ఎప్పుడూ ఆపని వ్యక్తి" అంటూ అప్పట్లో విజయ్‌ను పొగడ్తలతో ముంచెత్తింది.
ఇప్పుడు ఈ తాజా పోస్ట్ చూస్తుంటే, విజయ్ ప్రేమలో తను ఎంతలా స్వేచ్ఛగా ఫీల్ అవుతుందో మనకు ఇట్టే అర్థమవుతుంది. ప్రతి అమ్మాయి కూడా తనను బంధించే ప్రేమను కాకుండా, తనను తనలా ఉండనిచ్చే ప్రేమను ఎంచుకోవాలని రష్మిక పరోక్షంగా ఒక మంచి సలహా ఇచ్చింది.
{{/usCountry}}ఇప్పుడు ఈ తాజా పోస్ట్ చూస్తుంటే, విజయ్ ప్రేమలో తను ఎంతలా స్వేచ్ఛగా ఫీల్ అవుతుందో మనకు ఇట్టే అర్థమవుతుంది. ప్రతి అమ్మాయి కూడా తనను బంధించే ప్రేమను కాకుండా, తనను తనలా ఉండనిచ్చే ప్రేమను ఎంచుకోవాలని రష్మిక పరోక్షంగా ఒక మంచి సలహా ఇచ్చింది.
{{/usCountry}}రష్మిక కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. ఎన్నో విమర్శలను దాటుకుని పాన్ ఇండియా హీరోయిన్‌గా ఎదిగింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో విజయ్ తనకు ఎంతో అండగా నిలబడ్డాడు. అందుకే తనను అర్థం చేసుకునే వాళ్లు తన గురించి రాసినప్పుడు రష్మిక ఇంతలా కనెక్ట్ అయింది. అభిమానులు కూడా ఆమె పోస్ట్‌కు స్పందిస్తూ, "రష్మిక.. నువ్వు నిజంగా ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్" అంటూ ప్రేమగా వ్యాఖ్యానిస్తున్నారు.