...
...
Next Story

రష్మిక మమ్మల్ని పెళ్లికి పిలవలేదు.. అతనేమీ బాధపడటం లేదు: మాజీ బాయ్‌ఫ్రెండ్ స్నేహితుడి కామెంట్స్.. ఏకిపారేసిన ఫ్యాన్స్

రష్మిక మందన్న మాజీ బాయ్‌ఫ్రెండ్, నటుడు రక్షిత్ శెట్టి ఫ్రెండ్ ప్రమోద్ శెట్టి ఆమె పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆమె తమను పెళ్లికి పిలవలేదని అతడు అనడం విశేషం. దీనికి రక్షిత్ ఏమీ బాధపడటం లేదని కూడా చెప్పాడు.

Published on: Feb 20, 2026, 20:58:42 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి స్నేహితుడు, నటుడు ప్రమోద్ శెట్టి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పెళ్లికి తమను ఆహ్వానించలేదంటూ అతడు చేసిన కామెంట్స్‌పై రష్మిక ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

ప్రమోద్ శెట్టి ఏమన్నారంటే?

రష్మిక మమ్మల్ని పెళ్లికి పిలవలేదు.. అతనేమీ బాధపడటం లేదు: మాజీ బాయ్‌ఫ్రెండ్ స్నేహితుడి కామెంట్స్.. ఏకిపారేసిన ఫ్యాన్స్
రష్మిక మమ్మల్ని పెళ్లికి పిలవలేదు.. అతనేమీ బాధపడటం లేదు: మాజీ బాయ్‌ఫ్రెండ్ స్నేహితుడి కామెంట్స్.. ఏకిపారేసిన ఫ్యాన్స్

రష్మిక, విజయ్ తమ పెళ్లి గురించి ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ.. కన్నడ నటుడు, రక్షిత్ శెట్టికి అత్యంత సన్నిహితుడైన ప్రమోద్ శెట్టిని మీడియా దీనిపై ప్రశ్నించింది. దానికి అతడు నవ్వుతూ ఇచ్చిన సమాధానం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

"నాకు రష్మిక పెళ్లి శుభలేఖ ఇంకా రాలేదు. ఒకవేళ వస్తే కచ్చితంగా వెళ్తాను. కానీ ఆమె మమ్మల్ని పిలవదని మాకు తెలుసు. అందులో కొత్తేమీ లేదు. ఇక రక్షిత్ శెట్టి విషయానికొస్తే.. అతనేమీ చాక్లెట్ తినే చిన్న పిల్లాడు కాదు. జరిగిపోయిన దాని గురించి గదిలో కూర్చొని బాధపడటానికి.." అని ప్రమోద్ కామెంట్ చేశాడు.

ప్రమోద్ శెట్టిని ఏకిపారేసిన ఫ్యాన్స్..

ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో రష్మిక అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎక్స్ వేదికగా ప్రమోద్ శెట్టిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

"సారీ బూమర్ అంకుల్.. ఇంకెన్ని సంవత్సరాలు ఆమె పేరు వాడుకుని పబ్లిసిటీ పొందుతారు?" అని ఒకరు కామెంట్ చేశారు. "బ్రేకప్ తర్వాత ఏ అమ్మాయైనా తన మాజీ ప్రియుడిని, అతని స్నేహితులను పెళ్లికి ఎందుకు పిలుస్తుంది?" అని మరొకరు ప్రశ్నించారు.

"చీప్ పబ్లిసిటీ.. కన్నడ ఇండస్ట్రీలో ఉన్న కొందరికి ఇంకా రష్మికనే గుర్తొస్తోంది. ఎన్ని ద్వేషాలు ఎదురైనా ఆమె స్ట్రాంగ్‌గా నిలబడిన తీరు ఐకానిక్" అంటూ చురకలు అంటించారు.

రష్మిక - రక్షిత్ ఎంగేజ్‌మెంట్ నేపథ్యం..

2016లో కన్నడ మూవీ 'కిరిక్ పార్టీ'తో రష్మిక హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ సమయంలో హీరో రక్షిత్ శెట్టితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. జులై 2017లో వీరికి నిశ్చితార్థం జరిగింది. అప్పటికి రష్మిక వయసు 21 ఏళ్లు కాగా, రక్షిత్ వయసు 34 ఏళ్లు (13 ఏళ్ల గ్యాప్). అయితే ఇద్దరికీ కుదరని కారణంగా సెప్టెంబర్ 2018లో తాము విడిపోతున్నట్లు ప్రకటించారు.

ఆ సమయంలో రష్మిక కన్నడ అభిమానుల నుంచి విపరీతమైన ట్రోలింగ్, సైబర్ వేధింపులు ఎదుర్కొంది. తాను ఎంతలా వేధింపులకు గురైందో వివరిస్తూ అప్పట్లో ఆమె ఒక ప్రకటన కూడా విడుదల చేయాల్సి వచ్చింది.

ఇప్పుడు వాటన్నింటినీ అధిగమించి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రష్మిక.. విజయ్ దేవరకొండతో గత ఏడాది (2025) అక్టోబర్‌లో హైదరాబాద్‌లో సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఇప్పుడు ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య వైభవంగా పెళ్లి పీటలు ఎక్కబోతోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks