...
...
Next Story

Rashmika Mandanna Injury: రష్మిక మందన్నకు గాయం.. డ్యాన్స్ చేస్తుండగా పడటంతో.. షూటింగ్‌కు బ్రేక్.. టాలీవుడ్‌లో మరో కలకలం

Rashmika Mandanna Injury: టాలీవుడ్ లో మరో నటి గాయం బారిన పడింది. రష్మిక మందన్న ఓ డ్యాన్స్ సీక్వెన్స్ చేస్తుండగా తీవ్రంగా గాయపడటంతో డాక్టర్లకు ఆమెకు 6 వారాల పూర్తి విశ్రాంతి చెప్పారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే హీరోలు వరుసగా గాయపడుతుండగా ఇప్పుడు రష్మిక కూడా ఆ జాబితాలో చేరింది.

Published on: Jul 31, 2026, 20:24:19 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Rashmika Mandanna Injury: నేషనల్ క్రష్ రష్మిక మందన్న షూటింగ్ సెట్‌లో తీవ్రమైన ప్రమాదానికి గురయ్యారు. ఒక హై-వోల్టేజ్ డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ఆమె హిప్ ఏరియాలోని టెండన్ పూర్తిగా వేరయింది. దీంతో డాక్టర్లు ఆమెకు అత్యవసరంగా 6 వారాల పాటు పూర్తి బెడ్ రెస్ట్ సూచించారు. గాయం తీవ్రత చాలా పెద్దది కావడంతో రష్మికను తక్షణమే పరీక్షించిన నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

“క్రీడాకారుల్లో మాత్రమే కనిపించే అరుదైన గాయం”

Rashmika Mandanna Injury: రష్మిక మందన్నకు గాయం.. డ్యాన్స్ చేస్తుండగా పడటంతో.. షూటింగ్‌కు బ్రేక్.. టాలీవుడ్‌లో మరో కలకలం
Rashmika Mandanna Injury: రష్మిక మందన్నకు గాయం.. డ్యాన్స్ చేస్తుండగా పడటంతో.. షూటింగ్‌కు బ్రేక్.. టాలీవుడ్‌లో మరో కలకలం

సాధారణంగా రోజూ అత్యంత కఠినమైన శిక్షణ పొందే ప్రొఫెషనల్ అథ్లెట్లు, స్పోర్ట్స్ పర్సన్లలో మాత్రమే ఇలాంటి తీవ్రమైన టెండన్ డిటాచ్మెంట్ కనిపిస్తుందని డాక్టర్లు స్పష్టం చేశారు. సినిమాల కోసం కఠినమైన డ్యాన్స్ స్టెప్పులు, యాక్షన్ రిహార్సల్స్ చేయడమే రష్మిక మందన్న ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

కేవలం బెడ్ రెస్ట్ మాత్రమే కాకుండా.. 6 వారాల విశ్రాంతి అనంతరం ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ కూడా పూర్తి చేయాలని హెచ్చరించారు. ఈ ఫిజియోథెరపీ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మాత్రమే ఆమె కదలికలు సాధారణ స్థితికి వస్తాయని సమాచారం.

“టాలీవుడ్‌ను వెంటాడుతున్న గాయాల భయం!”

గత కొన్ని నెలలుగా టాలీవుడ్‌ను షూటింగ్ ప్రమాదాలు, గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. వరుసగా బిగ్ స్టార్స్ సెట్‌లో గాయపడుతుండటంతో సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం రేగుతోంది.

ఇటీవలే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Balakrishna) తమ ప్రాజెక్ట్‌ల చిత్రీకరణలో పాల్గొంటూ వివిధ రకాల గాయాలకు గురయ్యారు. ఆ తర్వాత కొద్దిరోజులు షూటింగ్‌లకు విరామం ఇచ్చి విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మోస్ట్ ప్రామిసింగ్ హీరోయిన్ రష్మిక కూడా ఈ దురదృష్టకర లిస్ట్‌లో చేరడంతో ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

పాన్-ఇండియా సినిమాల షూటింగ్స్‌పై ప్రభావం

దీనికి తోడు దాదాపు 30కి పైగా అంతర్జాతీయ, జాతీయ బ్రాండ్లకు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ ఎంతో బిజీ షెడ్యూల్ గడుపుతున్నారు. ఈ హఠాత్తు ప్రమాదం కారణంగా ఆమె భాగమైన పలు సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ తాత్కాలికంగా వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.

ఈ కఠినమైన సమయాన్ని దాటుకుని రష్మిక త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ సోషల్ మీడియాలో 'గెట్ వెల్ సూన్ రష్మిక' అనే హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. కనీసం ఆరు వారాల తర్వాత పూర్తి ఆరోగ్యంగా ఉన్న తర్వాత ఆమె మళ్లీ కెమెరా ముందుకు వచ్చి తనదైన ఎనర్జీతో అలరించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe